అన్వేషించండి

Heart Blockage Symptoms : గుండెలో బ్లాకేజీని సూచించే సంకేతాలు ఇవే.. విస్మరిస్తే ప్రమాదమే

Heart Blockage Symptoms : గుండెలోనే ఏర్పడిన బ్లాకేజీలు గుండెపోటుకు కారణాలు అవుతాయి. పరిస్థితి విషమించకముందు శరీరం ఇచ్చే సంకేతాలు అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గుండె ధమనులలో ఫలకం చేరడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది.
  • తేలికపాటి ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సాధారణ లక్షణాలు.
  • అసాధారణ అలసట, నొప్పి చేతులు, మెడ, దవడలకు విస్తరించవచ్చు.
  • క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్య పరీక్షలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Hidden Signs of Heart Blockage : హార్ట్ బ్లాకేజ్ అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ పరిస్థితి గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో ఇరుకైన లేదా బ్లాక్స్ ఏర్పడడాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా ధమనులలో ఫలకం పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. దీనివల్ల గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా మంది గుండె జబ్బులను అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పితో ముడిపెడతారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీని ప్రారంభ సంకేతాలు చాలా తేలికగా ఉంటాయి. కానీ చాలామంది వాటిని నార్మల్ ఇబ్బందులు అనుకుని విస్మరిస్తారు.

నిపుణులు ఏమంటున్నారంటే..

కార్డియాక్ సైన్సెస్ నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ రమణ్ మిశ్రా మాట్లాడుతూ.. గుండె ధమనులలో బ్లాకేజీ ఏర్పడినప్పుడు ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి రావడం అనేది అత్యంత సాధారణంగా కనిపించే లక్షణంగా చెప్తున్నారు. కానీ చాలా మంది దీనిని ఛాతీలో భారంగా, బిగుతుగా లేదా మంటగా ఉందని భావించి లైట్ తీసుకుంటారు. అయితే ఈ నొప్పి ఎల్లప్పుడూ తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ తరచుగా వస్తుంది. మళ్లీ పోతుంది. ముఖ్యంగా వ్యక్తి శారీరక శ్రమ చేసినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది. దీనితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా చెప్తున్నారు. కొందరు మెట్లు ఎక్కుతున్నప్పుడు, కొద్ది దూరం నడిచినప్పుడు లేదా సాధారణ పనులు చేస్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

లక్షణాలు ఏమిటి?

గుండెలో బ్లాకేజీ ఏర్పడినప్పుడు అసాధారణ అలసట కూడా ఓ లక్షణమేనని అంటున్నారు. గుండెకు తగినంత ఆక్సిజన్ రక్తం అందించనప్పుడు.. శరీరం నిరంతరం బలహీనత, అలసటతో ఉంటుంది. చాలా సందర్భాల్లో నొప్పి ఛాతీకి మాత్రమే పరిమితం కాదు. చేతులు, మెడ, దవడ లేదా వీపు వరకు వ్యాపిస్తుంది. ప్రజలు తరచుగా దీనిని కండరాల నొప్పి లేదా గ్యాస్-అసిడిటీగా భావిస్తారు. దీనితో పాటు మైకం, వికారం లేదా ఎటువంటి కారణం లేకుండా అధికంగా చెమట పట్టడం కూడా హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా ఈ లక్షణాలు శారీరక శ్రమ సమయంలో కనిపిస్తే అస్సలు విస్మరించకూడదు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, ఎటువంటి శారీరక శ్రమ లేకపోవడం గుండె ధమనులలో బ్లాకేజీ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు పదేపదే కనిపిస్తే లేదా పెరుగుతుంటే.. వెంటనే కార్డియాలజిస్ట్ను సంప్రదించడం మంచిది. దీనివల్ల తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. మీరు ఈ లక్షణాలను విస్మరిస్తే.. భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget