అన్వేషించండి

Chest Pain : ఛాతీలో నొప్పి వస్తుందా? అయితే అది గుండెపోటు కాకపోవచ్చు.. తేడాలు ఇలా గుర్తించండి

Chest Pain Causes : ఛాతీలో వచ్చే నొప్పి ప్రతీసారి గుండె నొప్పి కాకపోవచ్చని అంటున్నారు. అయితే ఈ నొప్పిని ఎప్పుడు సీరియస్​గా తీసుకోవాలో.. తేడాలు ఎలా గుర్తించాలో ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఛాతీ నొప్పి గుండెపోటు కాకపోవచ్చు, ఊపిరితిత్తులు లేదా జీర్ణ సమస్యలు కారణం.
  • గుండె నొప్పి మధ్యలో బరువుగా, చేతులు, దవడలకు వ్యాపించవచ్చు.
  • ఊపిరితిత్తుల నొప్పి సూది గుచ్చినట్లు, శ్వాసతో తీవ్రమవుతుంది.
  • జీర్ణ సమస్య నొప్పి తిన్న తర్వాత, పడుకున్నప్పుడు మంటగా వస్తుంది.

Heart Pain vs Other Chest Pain : ఛాతీలో నొప్పి వస్తే దానిని చాలామంది గుండెపోటు అనుకొని కంగారు పడతారు. ఈ ఆందోళనలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గుండె సమస్యలు ప్రాణాంతకమైనవి. అయితే ఛాతీలో వచ్చే నొప్పి ఎప్పుడూ గుండెకు సంబంధించినది మాత్రమే కాదని.. కొన్నిసార్లు ఊపిరితిత్తులు లేదా జీర్ణవ్యవస్థలో సమస్యలు కూడా కారణం కావచ్చని అంటున్నారు. కేవలం గుండెపైనే దృష్టి పెట్టి.. ఇతర కారణాలను, ముఖ్యంగా ఊపిరితిత్తులు లేదా జీర్ణవ్యవస్థ సమస్యలను విస్మరించడం ప్రమాదకరమని అంటున్నారు.

గుండె నొప్పి లక్షణాలు 

వైద్యుల ప్రకారం గుండె నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో బరువుగా లేదా ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ నొప్పి చేతులు, దవడ లేదా వీపుకు వ్యాపించవచ్చు. దీనితో పాటు చెమట పట్టడం, వికారం లేదా ఆయాసం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. శారీరక శ్రమ సమయంలో ఈ నొప్పి తీవ్రతరం కావచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.

ఊపిరితిత్తుల వ్యాధి వల్ల.. 

ఊపిరితిత్తుల వ్యాధి వల్ల కూడా ఛాతీ నొప్పి రావచ్చు. అయితే దాని అనుభూతి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ నొప్పి తరచుగా సూది గుచ్చినట్లుగా, తీవ్రంగా ఉంటుంది. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం, దగ్గడం లేదా శారీరక శ్రమ వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది. జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల పొర వాపు వలన శ్వాస తీసుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. పల్మనరీ ఎంబోలిజం వలన ఆయాసంతో పాటు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి కలగడం వంటివి ఉంటాయి.

బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే..

దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి వంటి పరిస్థితులు నిరంతర ఛాతీ అసౌకర్యాన్ని,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణలో ఆలస్యం చేస్తే.. తీవ్రమైన శ్వాస ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.

జీర్ణ సమస్య వల్ల.. 

మరోవైపు గుండెల్లో మంట లేదా నొప్పి తరచుగా వస్తే అది జీర్ణవ్యవస్థకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఇది కూడా గుండె నొప్పి వలె అనిపించవచ్చు. కానీ ఇది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి కారణంగా వస్తుంది. దీనివల్ల తరచుగా తిన్న తర్వాత లేదా పడుకున్నప్పుడు గుండెల్లో మంట వస్తుంది. అన్నవాహిక సంకోచాలు ఆకస్మిక, తీవ్రమైన ఛాతీ నొప్పికి కారణం కావచ్చు. 

ఇతర కారణాలు..

అదేవిధంగా ఎసిడిటీ, మంట లేదా ఒత్తిడి వంటివి కూడా గుండె నొప్పికి కారణమవుతాయి. అన్ని ఛాతీ నొప్పులు తీవ్రమైనవి కావని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు కండరాల ఒత్తిడి, పక్కటెముకకు గాయం లేదా ఆందోళన కూడా ఛాతీ నొప్పికి కారణం కావచ్చు. అయితే ఈ సందర్భాలలో నొప్పి సాధారణంగా ఒకే ప్రాంతానికి పరిమితమై ఉంటుంది.

తేడాలు ఇలా గుర్తించండి..

వైద్యుల ప్రకారం.. ఈ పరిస్థితిని గుర్తించడానికి కొన్ని సంకేతాలను ఉపయోగించవచ్చు. ఒత్తుతున్నట్లుగా లేదా శరీరమంతా వ్యాపించినట్లుగా ఉండే నొప్పి గుండెకు సంబంధించినది కావచ్చు. శ్వాస తీసుకున్నప్పుడు లేదా కదిలినప్పుడు తీవ్రమయ్యే నొప్పి ఊపిరితిత్తులకు సంబంధించినది కావచ్చు. తిన్న తర్వాత వచ్చే మంటగా ఉండే నొప్పి కడుపునకు సంబంధించినది కావచ్చు.

అయితే ఛాతీ నొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు కూడా చెబుతున్నారు. లక్షణాలు తరచుగా ఒకేలా ఉండవచ్చు కాబట్టి.. ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. అంతేకాకుండా అవగాహన, ముందస్తు చికిత్స తదుపరి సమస్యలను నివారించగలవు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget