అన్వేషించండి

Panic Attack : పానిక్ అటాక్ అంటే ఏమిటి? ప్రాణాంతకమైన ఈ సమస్యను ఇలా సులభంగా ఎదుర్కోండి

Mental Health : చాలా మంది పానిక్ అటాక్స్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల ముందుగానే దానిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అధిక ఒత్తిడి, జీవనశైలి మార్పుల వల్ల పానిక్ అటాక్స్ పెరుగుతున్నాయి.
  • గుండె దడ, ఆయాసం, భయం వంటి లక్షణాలు పానిక్ అటాక్ సూచిస్తాయి.
  • శ్వాస వ్యాయామాలు, 5-4-3-2-1 టెక్నిక్ ద్వారా అటాక్ నియంత్రించవచ్చు.
  • క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్ర, మానసిక నిపుణుల సలహా అవసరం.

Panic Attack Causes and Precautions : నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది అధిక ఒత్తిడికి లోనవుతున్నారు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సోషల్ మీడియా, ఆర్థిక సమస్యలు.. ఇలా అన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీని ఫలితంగా చాలా మంది పానిక్ అటాక్స్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పానిక్ అటాక్స్ లైట్ తీసుకోకూడదని.. ఎందుకంటే ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పానిక్ అటాక్స్​ని ముందుగానే గుర్తించి.. సరైన చర్యలు తీసుకుంటే సమస్యను నియంత్రించవచ్చని చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యపై అవగాహన చాలా అవసరం. అసలు పానిక్ అటాక్స్ అంటే ఏమిటి? దీనిని ఎలా ఎదుర్కోవాలి? సమస్యను దూరం చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం. 

పానిక్ అటాక్స్ అంటే..

పానిక్ అటాక్ అంటే అకస్మాత్తుగా కలిగే భయం లేదా ఆందోళనగా చెప్పవచ్చు. ఈ సమయంలో.. బాధితుడిలో ఏదో జరగబోతోందనే భయం కలుగుతుంది. ఈ భయం భయంకరమైన స్థాయిలో ఉంటుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం, చెమటలు పట్టడం, చేతులు, కాళ్లు మొద్దుబారడం లేదా తిమ్మిరిగా అనిపించడం వంటివి జరుగుతాయి. 

పానిక్ అటాక్​ లక్షణాలు..

పానిక్ అటాక్‌లో హృదయ స్పందన లేదా ఆందోళన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరాడకపోవడం, చెమట పట్టడం లేదా వణకడం, ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, తల తిరగడం లేదా స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా జలదరింపు, శరీరం తన నుంచి తాను వేరుపడినట్లు అనిపించడం, చనిపోతానేమోనన్న భయం లేదా నియంత్రణ కోల్పోతానేమోనన్న భయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

పానిక్ అటాక్స్​కి కారణాలు..

ఒత్తిడి, మానసిక సమస్యలు, PTSD లేదా ఫోబియాల వంటి మానసిక ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్, గుండె సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత, కెఫీన్, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వాటి వల్ల పానిక్ అటాక్స్ ఎక్కువగా జరుగుతాయి. అలాగే కుటుంబంలో పానిక్ డిజార్డర్ సమస్య ఉన్నా కూడా పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు.

4-4-4-4 బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్..

పానిక్ అటాక్‌లను ఎదుర్కోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని పాటిస్తూ ఉంటే.. వాటిని నియంత్రించవచ్చని చెప్తున్నారు నిపుణులు. వాటిలో 4-4-4-4 బాక్స్ బ్రీతింగ్ అనే శ్వాస వ్యాయామం ఒకటి. దీనిలో భాగంగా 4 సెకన్ల పాటు శ్వాస లోపలికి పీల్చి, 4 సెకన్ల పాటు బిగపట్టి, 4 సెకన్ల పాటు శ్వాసను బయటకు వదిలి.. మళ్లీ 4 సెకన్ల పాటు బిగపట్టండి.

5-4-3-2-1 టెక్నిక్..

పానిక్ అటాక్​ని తగ్గించడంలో 5-4-3-2-1 టెక్నిక్ బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో భాగంగా 5 వస్తువులను చూడండి. 4 వస్తువులను తాకండి. 3 శబ్దాలను వినండి. 2 వాసనలను పీల్చండి. 1 టేస్ట్ చూడండి. అలాగే ఇది కేవలం ఒక పానిక్ అటాక్ మాత్రమే.. ఇది తగ్గిపోతుందని మీకు మీరు చెప్పుకోండి. కెఫీన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. క్రమం ధ్యానం చేస్తే కలిగే లాభం ఉంటుంది. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే..

భయాందోళనలు పదేపదే వస్తుంటే లేదా మీ దినచర్యకు ఆటంకం కలిగిస్తుంటే.. వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) మీ ఆలోచనా విధానాలను మార్చడం ద్వారా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్యుడు ఆందోళన తగ్గించడానికి నివారణ లేదా యాంటీ-డిప్రెసెంట్ మందులను సూచించవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ద్వారా లక్షణాలను సరిగ్గా గుర్తించి, చికిత్స చేయడానికి వీలవుతుంది.

లైఫ్​స్టైల్​లో చేయాల్సిన మార్పులు

భయాందోళనలను నివారించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. 7 నుంచి 8 గంటల పాటు తగినంత నిద్ర పొందండి. సోషల్ మీడియా, స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి పెయింటింగ్, సంగీతం లేదా పుస్తక పఠనం వంటివి స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Kitchen Sink Cleaning Tips : చేతులు ఉపయోగించకుండా సింక్‌ను ఎలా శుభ్రం చేయాలి? ఇలా చేయండి క్షణాల్లో మెరిసిపోతుంది
చేతులు ఉపయోగించకుండా సింక్‌ను ఎలా శుభ్రం చేయాలి? ఇలా చేయండి క్షణాల్లో మెరిసిపోతుంది
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
Hair Care Tips : జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలా? అయితే ఈ ఇంటి చిట్కాలు ఫాలో అవ్వండి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medals: ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
Auto Fares Hike: తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
CM Vijay Vetri Payanam: కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
Dilsukhnagar Santoshimatha Temple: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
ED Notices To YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
PM Modi Video Call Pilot Smith: స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Embed widget