అన్వేషించండి

Study Table Mistakes : పరీక్షల సమయంలో పిల్లలు బాగా చదవాలంటే స్టడీ టేబుల్‌పై ఈ 5 వస్తువులు పెట్టొద్దు.. రీజన్స్ ఇవే

Child’s Study Table : పిల్లలు ఎగ్జామ్స్​కి ప్రిపేర్ అయ్యేప్పుడు వారికి తగిన వాతావరణం పేరెంట్స్ కలిపించాలి అంటున్నారు. అందుకే కిడ్స్ స్టడీ టేబుల్​పై ఈ 5 వస్తువులను ఉంచకూడదని చెప్తున్నారు. అవేంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిల్లల ఏకాగ్రతకు ఆటంకం కలిగించే వస్తువులు స్టడీ టేబుల్​పై ఉంచవద్దు.
  • ఫోన్లు, స్నాక్స్, గేమింగ్ టూల్స్​ను స్టడీ టేబుల్​పై లేకుండా చూడాలి.
  • స్టడీ టేబుల్​ను శుభ్రంగా, అత్యవసర వస్తువులతోనే సిద్ధంగా ఉంచాలి.
  • ప్రతికూల సూక్తులకు బదులుగా సానుకూల కొటేషన్లు ప్రేరణనిస్తాయి.

Boost Your Child’s Concentration : ఈ డిజిటల్ యుగంలో పిల్లలకు, టీనేజర్లకు.. చదువుపై దృష్టి పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా వంటి ఎన్నో విషయాలు వారి చదువునకు గణనీయంగా ఆటంకం కలిగిస్తున్నాయి. అందుకే ఎగ్జామ్స్​లో మంచిగా రాణించలేకపోతున్నారు. కాబట్టి వారు శ్రద్ధగా చదువుకునేందుకు పేరెంట్స్ వారికి మంచి వాతావరణం ఉండేలా చూడాలంటున్నారు. ముఖ్యంగా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేప్పుడు వారి స్టడీ టేబుల్​పై మరింత శ్రద్ధ చూపించాలంటున్నారు. 

శుభ్రంగా, సరిగ్గా లేని స్టడీ టేబుల్ పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తుందట. అలాగే పిల్లల ఫోకస్ మారి.. చదివిన విషయాన్ని బ్రెయిన్ సరిగ్గా ఎక్కించుకోదట. స్టడీ టేబుల్‌పై వారి ఏకాగ్రతను దెబ్బతీసే వస్తువులు ఉంటే.. వారు ఎంత కష్టపడి చదివినా ఫోకస్ తక్కువగానే ఉంటుందని అంటున్నారు నిపుణులు. మరి పిల్లల స్టడీ టేబుల్‌పై ఉంచకూడని వస్తువులు ఏంటో.. వాటిని ఎందుకు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

మొబైల్స్.. 

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లల ఏకాగ్రతను బాగా దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, గేమ్స్, వీడియోలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఫోన్‌ను టేబుల్‌పై ఉంటే.. పిల్లల మనసు నిరంతరం నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. దీనివల్ల వారి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందువల్ల చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్‌ను వేరే చోట ఉంచమని చెప్పండి. తద్వారా పిల్లల ఏకాగ్రత చదువుపైనే ఉండే అవకాశం ఉంది. 

స్నాక్స్..

స్టడీ టేబుల్​పై చిప్స్, చాక్లెట్, కూల్​ డ్రింక్స్ వంటివి ఉంచడం కూడా మంచిది కాదని చెప్తున్నారు. ఎందుకంటే పిల్లలు చదువుకునేటప్పుడు తినేస్తుంటారు. దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలగవచ్చు. జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దానికి బదులుగా పిల్లలను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడానికి టేబుల్ దగ్గర పండ్లు, నీళ్లు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచండి. ఆరోగ్యకరమైన స్నాక్స్, ఒక గ్లాసు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచండి.

క్లీన్​గా ఉండాలి..

పిల్లలు తరచుగా పెన్నులు, పెన్సిళ్లు, మార్కర్లు, పోస్ట్-ఇట్ నోట్లను తమ స్టడీ టేబుల్​పై వదిలేస్తారు. దీనివల్ల అవి చిందరవందరగా, అస్తవ్యస్తంగా తయారవుతాయి. ఈ మానసిక గందరగోళం ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల బల్లపై కేవలం అత్యవసరమైన పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్‌లను మాత్రమే ఉంచండి. ఇతర స్టేషనరీని అల్మరాలో లేదా డ్రాయర్‌లో స్టోర్ చేయండి.

గేమింగ్ టూల్స్..

టేబుల్‌పై గేమింగ్ కన్సోల్, హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ టూల్స్ లేదా కంట్రోలర్‌ను ఉంచడం వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. గేమింగ్ పరికరాన్ని చూడగానే పిల్లలకు ఆడాలనే కోరిక కలగవచ్చు. దీనివల్ల చదువుకునే సమయం తగ్గి.. వారి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. గేమింగ్ పరికరాలను వేరే గదిలో లేదా అల్మరాలో ఉంచితే మంచిది.

బ్యాడ్ కోట్స్

చాలా మంది పిల్లలు తమ చదువుకునే దగ్గర "చదువు లేకపోతే ఫెయిల్ అవుతావు" లేదా "పరీక్ష అయ్యేంత వరకు ఫోన్ వద్దు" వంటి చీటీలను పెట్టుకుంటారు. ఇలాంటివి పిల్లలలో మోటీవేషన్ అవ్వడం కంటే.. ఒత్తిడిని, భయాన్ని కలిగిస్తాయి. అలాగే మానసిక ఒత్తిడిని, ఆందోళనను పెంచుతాయి. దీంతో వారి చదువుపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రతికూల చీటీల స్థానంలో.. సానుకూలమైన సూక్తులు, మోటివేషన్ ఇచ్చే కోట్స్ ఉంచండి. ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. ప్రశాంతంగా చదువుకునేందుకు, స్టడీపై ఫోకస్ చేసేందుకు హెల్ప్ అవుతాయి. 

ఈ చిన్ని మార్పులు పిల్లలు చదువుపై చాలా మంచి ప్రభావం చూపిస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి ఎగ్జామ్స్ టైమ్​లో పిల్లల స్టడీ రూమ్​లో లేదా స్టడీ టేబుల్​పై ఈ మార్పులు చేసేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget