నానబెట్టిన బాదం రోజూ తింటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

బాదం నానబెట్టడం వల్ల దానిలోని అన్ని పోషకాలు శరీరంలో త్వరగా కలుస్తాయి.

అందులో విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

పొడి బాదం కంటే నానబెట్టిన బాదం జీర్ణించుకోవడం సులభం.

ఇది మెదడును చురుకుగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తుంది.

బాదాం నుంచి తగినంత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉత్తమమైనది.

ప్రతిరోజు బాదం తినడం వల్ల మీ చర్మం సహజంగా మరింత మెరుస్తుంది.

ఆకలిని నియంత్రించడంలో, బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం తినడం చాలా ఉత్తమం.