నిద్ర లేకపోతే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందట.. కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

తక్కువ నిద్ర వల్ల లిబిడో తగ్గి.. లైంగిక కోరిక, ఆసక్తి తగ్గుతుంది.

టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా పురుషుల్లో హార్మోన్ imbalance వస్తుంది.

ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. శారీరక శక్తి లేకపోవడం వల్ల పనితీరు తగ్గుతుంది.

ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల cortisol పెరిగి, సెక్స్‌పై ఆసక్తి తగ్గుతుంది.

ఎరెక్షన్ సమస్యలు రావచ్చు. సరైన రక్త ప్రసరణ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి.

ఫెర్టిలిటీ తగ్గవచ్చు. స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్ ప్రభావితమవుతాయి.

మూడ్ స్వింగ్‌లు పెరుగుతాయి. భావోద్వేగ అస్థిరత వల్ల సంబంధాలు దెబ్బతింటాయి.

ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ స్థాయిలు మారిపోతాయి. హార్మన్ల సమస్య రావచ్చు.

శరీర రికవరీ అవడం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం ఉండకపోవచ్చు.

కాబట్టి రోజుకు కనీసం 7–8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది.