అన్వేషించండి

CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!

నీట్‌, సీబీఎస్‌యీ వివాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నేడు ధర్నాలు చేపట్టింది. ఆన్‌లైన్ పోరాటాలకే పరిమితమైన ఈ సేన ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమైంది 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పరీక్షల వైఫల్యాలపై సీజేపీ నిరసన, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం.
  • విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ.
  • జంతర్ మంతర్‌లో శాంతియుత నిరసన, పోలీసు అనుమతి లభించలేదు.

CJP Protest: పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్‌ లీకేజీలు, ఫలితాల వెల్లడిలో అస్పష్టత వంటి అంశాలు కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా పుట్టిన ఒక వినూత్న గళం కాక్రోచ్‌ జనతా పార్టీ, ఇప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు సిద్ధమైంది. జూన్ 6వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ పార్టీ తలపెట్టిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

గత కొంతకాలంగా నీటి పరీక్ష నిర్వహణలో ఎదురవుతున్న వివరాలు, సీబీఎస్‌ఈ ఫలితాలపై తలెత్తిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విద్యార్థులను తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ఈ వ్యవస్థాగత వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. సుమారు కోటి మందికిపైగా విద్యార్థుల భవిష్యత్‌ ఈ విద్యా వ్యవస్థ లోపాల వల్ల దెబ్బతిన్నదని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

జూన్ 6 ఉదయం 9 గంటలకు డిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సమీపంలో, జంతర్ మంతర్ వద్ద ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ వేదికా ప్రారంభమైన ఒక వ్యంగ్యాస్త్రం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారి ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనించబోతోంది. ఈ నిరసన కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, అత్యంత క్రమశిక్షణతో,వినూత్నంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నిరసనకారుల కోసం ప్రత్యేక డూస్ అండ్ డోంట్స్ జాబిాను విడుదల చేసింది. 

నిరసనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ భారతీయ జాతీయ జెండాను, ఒక పుస్తకాన్ని వెంట తెచ్చుకోవాలి. ఇది దేశభక్తిని, విద్య పట్ల ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. సాధారణంగా నిరసనల్లో పోలీసులతో వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ వినూత్నంగా పాలీసులకు పువ్వులను బహుకరించి తమ కృతజ్ఞత చెప్పాలని పిలుపునిచ్చారు. ఎక్కడా హింసకు తావులేకుండా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారితో వాదించకుండా, కేవలం విద్యా సంస్కరణలే ధ్యేయంగా నిరసన సాగాలని కోరారు. ఢిల్లీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వాటర్ బాటిల్స్, క్యాప్స్, సన్‌ స్క్రీన్ వంటి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. నిరసన ప్రారంభమయ్యేలోపు అవసరమైన పోలీసు అనుమతులు, లాంఛనాలను పూర్తి చేస్తానని తెలిపారు. ఉదయం 9 గంటలకు జంతర్ మంతర్ వద్ద నిరసనను ప్రారంభించాలని ప్రణాళిక. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో సీజేపీకి 2 కోట్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నిరసనలో ఎంతమంది పాల్గొంటారో వేచి చూడాలి. 

ఈ నిరసన అందరి ప్రజల కోసం – సీజేపీ

రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ఈ నిరసనలో అందరూ పాల్గొనవచ్చని సీజేపీ స్పష్టం చేసింది. ఈ ఉద్యమంలో శాంతియుతంగా చేరాలని ఆ సంస్థ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, యువతకు విజ్ఞప్తి చేసింది. నిరసనకు ఒక రోజు ముందు, విద్యా వ్యవస్థలో మార్పులు కోరుతూ ప్రజలు జంతర్ మంతర్ వద్ద గుమిగూడే రోజు ఆసన్నమైందని పేర్కొంటూ సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, వరుణ్ దాస్ ఒక వీడియోను విడుదల చేశారు. అభిప్రాయాలను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేయడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీజేపీ విజ్ఞప్తి

ఈ ఉద్యమం పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, సద్భావనతో జరుగుతుందని వారు పేర్కొన్నారు. దేశంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, గత నెలలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఉదహరిస్తూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని సీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు .

సీజేపీ నిరసనపై ఢిల్లీ పోలీసులు ఏమన్నారు?

ప్రతిపాదిత నిరసన కోసం సీజేపీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక అనుమతి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం, వారు ఈ కార్యక్రమం గురించి ప్రధానంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారానే తెలుసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సెంట్రల్ ఢిల్లీలో భద్రతను పెంచారు. పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు.

ఢిల్లీలో జరగనున్న బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) నిరసన కార్యక్రమానికి ముందు, అభిజిత్ దీప్కేకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)ను ఒక ప్రశ్న మీడియా అడిగింది. అభిజిత్ దీప్కేను బహిష్కరించడం లేదా వీసా దుర్వినియోగం గురించి అమెరికా అధికారులు ఏమైనా సమాచారం అందించారా అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను అడిగారు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఏడాది 3,567 మంది భారత పౌరులను అమెరికా నుంచి బహిష్కరించగా, 2026లో ఇప్పటివరకు 1,076 మందిని మాత్రమే బహిష్కరించినట్లు ప్రభుత్వం తెలిపింది . వలసలు, ప్రజల రాకపోకలపై భారత్, అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని అధికార ప్రతినిధి తెలిపారు. అక్రమ వలసలను నివారించడం, చట్టబద్ధమైన ప్రయాణం, పనిపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడటంపై దృష్టి సారించారు.

అభిజిత్ దీపక్ అమెరికాను విడిచిపెట్టారు

అభిజీత్ దీప్కే మహారాష్ట్ర వాసి. ఆయన పూణేలో జర్నలిజం అభ్యసించి, ఇటీవలే బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. నిరుద్యోగ యువత గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన చేసిన ఒక వ్యాఖ్యల వివాదం చెలరేగిన తర్వాత సీజేపీ (CJP)ని ప్రారంభించారు. ఈ సంస్థ సోషల్ మీడియాలో త్వరగా ప్రజాదరణ పొందింది.

Frequently Asked Questions

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎందుకు నిరసన చేపడుతోంది?

పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, ఫలితాల వెల్లడిలో అస్పష్టత వంటి సమస్యలపై విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడటానికి CJP నిరసన చేపడుతోంది. ఈ వ్యవస్థాగత వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.

CJP నిరసన ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ఈ నిరసన జూన్ 6వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఇది జరుగుతుంది.

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు ఎవరు?

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే. అతను మహారాష్ట్ర వాసి, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.

CJP నిరసనలో పాల్గొనేవారు పాటించాల్సిన మార్గదర్శకాలు ఏమిటి?

నిరసనకారులు భారత జాతీయ జెండాను, పుస్తకాన్ని తీసుకురావాలి. పోలీసులకు పువ్వులు బహుకరించి, ఎక్కడా హింసకు తావులేకుండా శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Railways Transformation: బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
Parliament Seat Redistribution: డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
Advertisement

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget