అన్వేషించండి

Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!

Parliament Monsoon Session : కేంద్ర మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. మోదీ మౌనం వెనుక ఉన్న ప్రత్యేక ప్లాన్ ఉందని భావిస్తున్నారు.

Why Modi Cabinet Reshuffle Delayed :   కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పు చేర్పులపై గత కొన్ని వారాలుగా దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగింది. కొందరు మంత్రుల రాజీనామాలు, మరికొందరి నయా ఎంట్రీలపై పొలిటికల్ సర్కిల్స్‌లో లీకులు కూడా వచ్చాయి. అయితే, అనూహ్యంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జూలై 20 నుండి ఆగస్టు 13, 2026 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు   జరగనున్నట్లు తేదీలను అధికారికంగా ప్రకటించారు. 19 సిట్టింగులతో సాగనున్న ఈ సమావేశాల షెడ్యూల్ వచ్చినా.. క్యాబినెట్ మార్పులపై మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ యంత్రాంగం వ్యూహాత్మక మౌనం వహించింది. దీంతో, మోదీ మంత్రివర్గ విస్తరణ నిర్ణయం నుండి వెనక్కి తగ్గారా? లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా? అనే చర్చలు మొదలయ్యాయి.

కేబినెట్ మార్పు చేర్పులు వాయిదా

 ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణను పక్కనబెట్టలేదు, కేవలం వాయిదా  వేశారు. ప్రస్తుతం ఎన్డీయే   ప్రభుత్వం ముందు మంత్రి పదవుల పంపకం కంటే.. దేశ భవిష్యత్తును మార్చే అత్యంత కీలకమైన, చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడం అత్యంత అవసరంగా మారింది. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం భారీ శాసన అధికార అజెండాతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి సందిగ్ధ సమయంలో మంత్రివర్గ మార్పులు చేపడితే.. పదవులు దక్కని అసంతృప్త నేతల వల్ల పార్లమెంట్‌లో బిల్లుల ఓటింగ్ సమయంలో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, ముసాయిదా బిల్లుల ప్రక్రియ ముగిసేవరకు ఈ గందరగోళం వద్దని మోదీ భావిస్తున్నారు.
  
 సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ టార్గెట్ 

 రాజ్యాంగ సవరణ బిల్లులు పాస్ కావాలంటే ఉభయ సభల్లో 2/3 వంతు  సభ్యుల మద్దతు అవసరం. అందుకే ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలన్నింటినీ ఏకతాటిపై ఉంచేందుకే క్యాబినెట్ మార్పులను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. ఈ వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది  131వ రాజ్యాంగ సవరణ బిల్లు . దీని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి ఏకంగా 816   కి పెంచనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ యాక్ట్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఈ బిల్లు అత్యంత కీలకం. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, ఏపీ సీట్లు 25 నుండి 38 కి, తెలంగాణ సీట్లు కూడా భారీగా పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ మెగా బిల్లును విజయవంతంగా పాస్ చేయించుకోవడమే మోదీ టీమ్ ముందున్న మైలురాయి.

వన్ నేషన్ - వన్ ఎలక్షన్  బిల్లును కూడా తెస్తారా? 

దీనితో పాటు, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్ నేషన్ - వన్ ఎలక్షన్  బిల్లు ను కూడా ఈ సమావేశాల్లోనే టేబుల్ పైకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. అలాగే, ఇటీవల వివాదాస్పదంగా మారిన 130వ రాజ్యాంగ సవరణ కింద రానున్న  PM-CMs Jail Bill  కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం ఏదైనా కేసులో ప్రధాని, సీఎంలు లేదా కేంద్ర మంత్రులు 31 రోజులకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే.. వారు స్వయంచాలకంగా తమ పదవులను కోల్పోతారు. ఇలాంటి సెన్సేషనల్ బిల్లులపై విపక్షాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్నందున, మోదీ ప్రభుత్వం తన పూర్తి శక్తి సామర్థ్యాలను పార్లమెంట్ వ్యూహాలకే పరిమితం చేసింది.

సెప్టెంబర్‌లోనే కేబినెట్ మార్పు చేర్పులు

 ఈ సుదీర్ఘ వర్షాకాల సమావేశాల పర్వం ముగిసిన తర్వాతే, అంటే ఆగస్టు మూడో వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్‌లో ప్రభుత్వం అనుకున్న వ్యూహాలు ఫలించి, రాజ్యాంగ సవరణ బిల్లులు విజయవంతంగా ఆమోదం పొందితే.. ఆ ఉత్సాహంతోనే మోదీ తన టీమ్‌లోకి కొత్త ముఖాలను తీసుకుంటారు. రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అప్పుడే తుది జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget