అన్వేషించండి

Union Cabinet Expansion: మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!

PM Modi Cabinet Expansion: కేంద్ర మంత్రిమండలిలో త్వరలో భారీ మార్పులుచేర్పులు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర మంత్రివర్గ, బీజేపీ సంస్థాగత మార్పులకు ప్రధాని మోదీ కసరత్తు.
  • 'ఒక వ్యక్తి-ఒక పదవి' నిబంధనతో యూపీ, పంజాబ్‌లో మార్పులు.
  • నేడు కేంద్ర కేబినెట్ భేటీ, యూపీ, మణిపూర్ సామాజిక సమతుల్యత లక్ష్యం.

న్యూఢిల్లీ: త్వరలో కేంద్ర మంత్రివర్గంతో పాటు బీజేపీ సంస్థాగత నిర్మాణంలో పెద్ద ఎత్తున మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఉత్తరాదిన పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూన్ 23న) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. 2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో తమ పట్టును బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగానే బీజేపీ కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగియడం, ఆయనను మళ్లీ ఎగువ సభకు పంపకూడదని నిర్ణయించడంతో కేంద్ర కేబినెట్‌లో కేరళ ప్రాతినిధ్యంపై కొత్త చర్చ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో కేరళకు మరో అవకాశం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేరళ నుంచి ఉన్న ఏకైక బీజేపీ మంత్రి, నటుడు సురేష్ గోపి మాత్రమే. ఆయన త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 

పంజాబ్ రాజకీయాల్లోకి తిరిగి రానున్న బిట్టూ
బుధవారం (జూన్ 24న) కేంద్ర కేబినెట్ భేటీ కానుందని, ఆ తర్వాత మంత్రుల శాఖల మార్పు లేదా కొత్త వారికి కేబినెట్ లోకి తీసుకోవడంపై  ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టూలను బీజేపీ మళ్లీ రాజ్యసభకు పంపలేదు. మరోవైపు బిట్టూ ఇంకా రాజీనామా చేయలేదు. అయితే, తాను పంజాబ్ రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Also Read: Ujjain Land Scam: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం - సీఎం మోహన్ యాదవ్ ఫ్యామిలీ ల్యాండ్ స్కామ్? రూ. 45 కోట్ల భూముల వెనుక మాస్టర్ ప్లాన్!

యూపీపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్

'ఒక వ్యక్తి, ఒకే పదవి' బీజేపీ రూల్ పాటించడం ద్వారా మరో ఇద్దరు మంత్రులకు పదవీగండం ఉంది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన హర్ష్ మల్హోత్రా, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి ఈ జాబితాలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీజేపీ నిబంధనల ప్రకారం పంకజ్ చౌదరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో, గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం పంకజ్ చౌదరి స్థానంలో మరో ఓబీసీ లేదా దళిత నేతకు.. ముఖ్యంగా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారికి మోదీ కేబినెట్‌లో చోటు కల్పించవచ్చు. సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్‌ల PDA (వెనుకబడిన, దళిత, మైనారిటీ) ఫార్ములాను తిప్పికొట్టేందుకు బీజేపీ ఈ మార్పుల ద్వారా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి యూపీలో సోషల్ బ్యాలెన్స్ సాధించాలని చూస్తోంది.

Also Read: TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు

పంజాబ్ నుంచి రేసులో రాఘవ్ చద్దా, తరుణ్ చుగ్, సునీల్ జాఖడ్
 వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రవ్‌నీత్ బిట్టూ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో పంజాబ్ నుంచి ఒక మంత్రి పదవి ఖాళీ అవుతుంది. బీజేపీ ఇక్కడ కేవల్ సింగ్ థిల్లాన్‌ను పంజాబ్ అధ్యక్షుడిగా నియమించింది. ఒక హిందువుకు కేబినెట్‌లో అవకాశం ఇస్తుందని సమాచారం. మంత్రి పదవి రేసులో రాఘవ్ చద్దా, సునీల్ జాఖడ్, తరుణ్ చుగ్ పేర్లు వినిపిస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా మణిపూర్ హింసాత్మక జ్వాలల్లో నలిగిపోతోంది. ఇక్కడ మైతేయి, కుకీ వర్గాల మధ్య జాతి సంఘర్షణలకు పెద్ద చరిత్రే ఉంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు వీధుల నుంచి పార్లమెంట్ వరకు మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఎన్నికల కంటే ముందే ఏ వర్గంలోనూ అసంతృప్తి తలెత్తకుండా ఉండేందుకు, ఇక్కడి వివిధ వర్గాల నాయకులకు కేబినెట్ లేదా పార్టీ సంస్థాగత పదవుల్లో చోటు కల్పించి సమతుల్యతను సాధించాలని బీజేపీ భావిస్తోంది.

Frequently Asked Questions

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ప్రధాన కారణం ఏమిటి?

2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ మార్పులు చేయనుంది. ఆయా రాష్ట్రాల్లో తమ పట్టును బలోపేతం చేసుకోవడమే దీని లక్ష్యం.

కేంద్ర కేబినెట్‌లో కేరళ ప్రాతినిధ్యంపై ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

జార్జ్ కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో కేరళ ప్రాతినిధ్యంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం, సురేష్ గోపి మాత్రమే కేరళ నుండి ఏకైక బీజేపీ మంత్రిగా ఉన్నారు.

'ఒక వ్యక్తి, ఒకే పదవి' నిబంధన కారణంగా ఎవరికి మంత్రి పదవి గండం ఉంది?

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఉన్నారు. ఈ నిబంధన ప్రకారం వారిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.

రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజకీయ ప్రణాళికలు ఏమిటి?

ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపకూడదని నిర్ణయించారు. బిట్టూ పంజాబ్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget