అన్వేషించండి

2026 మారుతి బ్రెజ్జా సేఫ్టీలో ఫస్ట్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో 5 స్టార్ భారత్ NCAP రేటింగ్

మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలు & చిన్నారుల భద్రత విభాగాల్లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో, ప్రయాణాల్లో కుటుంబ సభ్యుల భద్రతకు హామీ లభించినట్లయింది.

2026 Maruti Brezza Safety Rating: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త 2026 బ్రెజ్జా, లాంచ్‌ సందర్భంగా ఒక భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. కాంపాక్ట్ SUV విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్, భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో పెద్దలు & చిన్నారుల భద్రత విభాగాల్లో అత్యున్నతమైన 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. లాంచ్‌కు ఒక రోజు ముందే ఈ ఫలితాలు వెలువడటంతో కొత్త బ్రెజ్జాపై వినియోగదారుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కొత్త బ్రెజ్జా 24 జులై 2026న లాంచ్ అయింది.

భారత్ NCAP విడుదల చేసిన వివరాల ప్రకారం, 2026 మారుతి బ్రెజ్జా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో 32 మార్కులకు గాను 30.41 మార్కులు సాధించింది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో 49 మార్కులకు గాను 43 మార్కులు సాధించి రెండు విభాగాల్లోనూ 5 స్టార్ రేటింగ్ అందుకుంది.

ఈ క్రాష్ టెస్ట్‌లో 2026 మారుతి బ్రెజ్జా ZXI+ 1.5L 6AT వేరియంట్‌ను పరీక్షించారు. అయితే ఈ ఫలితాలు బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లోని అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయని భారత్ NCAP స్పష్టం చేసింది. అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు భద్రతా ప్రమాణాల్లో ఇదే రేటింగ్ వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?

పెద్దల భద్రత

అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరీక్షల్లో భాగంగా ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్‌లో బ్రెజ్జా 16 మార్కులకు గాను 14.41 మార్కులు సాధించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్‌లో మాత్రం పూర్తి 16కు 16 మార్కులు సాధించింది. మొత్తం కలిపి 30.41/32 స్కోర్ నమోదు చేసింది.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో డ్రైవర్ తల, మెడ, పెల్విస్, తొడలు & పాదాలకు 'గుడ్' రక్షణ లభించినట్లు నివేదిక వెల్లడించింది. ఛాతీ & కాళ్ల దిగువ భాగాలకు 'అడిక్వేట్' స్థాయి రక్షణ లభించింది. సహ ప్రయాణికుడి విషయంలో కూడా తల, మెడ, ఛాతీ, పెల్విస్ వంటి కీలక భాగాలకు 'గుడ్' రక్షణ లభించగా, కాళ్ల దిగువ భాగాలకు 'అడిక్వేట్' రక్షణ లభించింది.

సైడ్ మూవబుల్ బ్యారియర్ & సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షల్లో ప్రయాణికుడి తల, ఛాతీ, పొత్తికడుపు & పెల్విస్ వంటి అన్ని కీలక భాగాలకు 'గుడ్' రక్షణ లభించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలో కూడా వాహనం పనితీరు 'OK'గా నమోదైంది.

ఇది కూడా చదవండి: eయాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?

పిల్లల భద్రత

చిన్నారుల భద్రత విభాగంలో 2026 బ్రెజ్జా అద్భుతమైన ఫలితాలు నమోదు చేసింది. డైనమిక్ స్కోర్‌లో పూర్తి 24కు 24 మార్కులు సాధించింది. అలాగే CRS ఇన్‌స్టాలేషన్ స్కోర్‌లో కూడా పూర్తి 12కు 12 మార్కులు దక్కాయి. అయితే వెహికల్ అసెస్‌మెంట్ విభాగంలో 13 మార్కులకు గాను 7 మార్కులు మాత్రమే రావడంతో మొత్తం స్కోర్ 49లో 43 మార్కులకు పరిమితమైంది.

చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరీక్షల్లో 18 నెలల & 3 ఏళ్ల చిన్నారుల డమ్మీలను వెనుక వైపు చూసే విధంగా అమర్చిన చైల్డ్ సీట్లలో ఉంచి పరీక్షించారు. ఫ్రంటల్ క్రాష్‌లో రెండు డమ్మీలు కూడా పూర్తి 8కి 8 మార్కులు సాధించగా, సైడ్ క్రాష్‌లో 4కు 4 మార్కులు సాధించాయి. ఇది చిన్నారుల భద్రత పరంగా బ్రెజ్జా సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

పరీక్షించిన ZXI+ 1.5L 6AT వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC), అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్లు, ముందు సీట్లకు సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్లు & వెనుక అవుట్‌బోర్డ్ సీట్లలో ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలు వంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2018లో గ్లోబల్ NCAP పరీక్షించిన అప్పటి విటారా బ్రెజ్జా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 4 స్టార్ & చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో కేవలం 2 స్టార్ రేటింగ్ మాత్రమే సాధించింది. ఇప్పుడు 2026 బ్రెజ్జా రెండు విభాగాల్లోనూ 5 స్టార్ రేటింగ్ సాధించింది. తద్వారా, మారుతి సుజుకి తన కార్లలో భద్రత ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచిందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు
రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget