అన్వేషించండి

Ampere Magnus Grand vs Honda Activa eయాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?

Ampere Magnus Grand vs Honda Activa e: 90వేలకు లభించే యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌, హోండా యాక్టివా ఈ తో పోటీ పడుతోంది. బడ్జెట్‌ ఫ్రెండ్లీలో 118 కిలోమీటర్ల రేంజ్‌ను, ఐదేళ్ల బ్యాటీ వారంటీని అందిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యాంపియర్ ప్రాక్టికల్ డిజైన్, హోండా ఆధునిక రూపాన్ని కలిగివున్నాయి.
  • యాంపియర్ ఫిక్స్డ్ బ్యాటరీ, హోండా స్వాపబుల్ టెక్నాలజీ అందిస్తున్నాయి.
  • యాంపియర్ 65kmph టాప్ స్పీడ్, హోండా శక్తివంతమైన 6kW మోటార్.
  • బడ్జెట్, ఛార్జింగ్ ప్రాధాన్యతలను బట్టి స్కూటర్ ఎంచుకోవాలి.

Ampere Magnus Grand vs Honda Activa e: భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో ఇప్పుడు ఈవీ, పెట్రోల్ వాహనాల మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. అందుకే మిడిల్ క్లాస్‌ పల్స్ పట్టుకున్న చాలా కంపెనీలు తక్కువ ధరకే ఈవీలను తీసుకొస్తున్నాయి. అందుకే వాటి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఏర్పడింది. అలాంటి పోటీలోనే ఉన్నాయి యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌, హోండా యాక్టివ్‌ ఇ. అలాంటి వాటిలో ఏది కొనుక్కుంటే మంచిదో ఇక్కడ చూద్దాం. 

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలోని హైదరాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ,, విజయవాడ వంటి నగరాల నిత్య ట్రాఫిక్‌లో ఈ రెండు ఈ స్కూటర్‌లు ఎలాంటి పెర్ఫార్మెన్స్‌ ఇస్తాయి? బ్యాటరీ రేంజ్‌,టాప్‌ స్పీడ్‌, మెయింటెనెన్స్‌ కాస్ట్‌ విషయంలో దేనిది పై చేయో చూద్దాం. 

స్కూటర్ కొనేటప్పుడు భారతీయ కుటుంబాలు మొదట చూసేది డిజైన్, కూర్చునే సౌకర్యం. ఈ విషయంలో రెండు బ్రాండ్లు రెండు విభిన్న వ్యూహాలను అనుసరించాయి. యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ పూర్తిగా ప్రాక్టికాలిటీ ఆధారంగా డిజైన్ చేశారు. కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి, కూరగాయల సంచులు లేదా లగేజ్‌ ఉంచడానికి వీలుగా విశాలమైన ఫుట్‌బోర్డ్ను ఇచ్చారు. సీటు కింద 22 లీటర్ల అండర్ సీటు స్టోరేజ్ లభిస్తుంది. హెల్మెంట్‌, రోజువారీ వస్తువులు పెట్టకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 108 కేజీల కేర్బ్‌ వెయిట్‌ ఉండటం వల్ల రుకైన సందుల్లో, ట్రాఫిక్‌లో సైతం దీనిని హ్యాండిల్ చేయడం చాలా సులభం. 

ఏళ్ల తరబడి అలవాటైన యాక్టివా క్లాసికల్‌ సిల్హౌట్‌ను కొనసాగిస్తూనే ఈవీకి తగినట్టుగా మోడర్న్‌ రోబోటిక్‌ టచ్ ఇచ్చింది హోండా.. ముందు భాగంలో ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, ప్రీమియం డైమండ్‌ కట్ అల్లాయ్‌ వీల్స్, ఏరోడైనమిక్ ఫ్రంట్‌ ఫెండర్స్‌ ఉన్నాయి. హోండా సొంతంగా అభివృద్ధి చేసిన హెవీ డ్యూటీ అండర్‌బోన‌ ఫ్రేమ్‌ వల్ల అత్యధిక రోడ్‌ స్టెబిలిటీ లభిస్తుంది. దీని కెర్బ్‌ వెయిట్ 119 కేజీలు. 

బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీలో ఎవరిది పైచేయి 

బ్యాటరీ సిస్టమ్‌లో రెండు స్కూటర్స్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మాగ్నస్‌ గ్రాండ్‌లో 2.3kWh LFP ఫిక్స్డ్‌ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. మన భారతీయ వేడి వాతావరణానికి, భద్రతకు ఎల్‌ఎఫ్‌పీ కెమిస్ట్రీ చాలా సురక్షితమైందిగా పరిగణిస్తారు. ఇంటి దగ్గరే ఐదు నుంచి ఆరు గంటల్లో వంద శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే క్లెయిమ్డ్‌ రేంజ్‌ 118 కిలోమీటర్లు కాగా, రియల్ వరల్డ్‌ రీడింగ్‌లో 85-95 కిలోమీటర్లు నిరభ్యంతరంగా వస్తుంది. 

హోండా యాక్టివా ి తన విప్లవాత్మకమైన హోండా మొబైల్‌ పవర్ ప్యాక్‌ స్వాపబుల్‌ బ్యాటరీ సిస్టమ్‌తో వచ్చింది. అంటే ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పనే లేదు. హోండా ఈ స్వాప్ స్టేషన్‌కు వెళ్లి  డిశ్చార్జ్‌ అయిన బ్యాటరీ ఇచ్చి కేవలం రెండు నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ బ్యాటరీలను మార్చుకోవచ్చు. దీని ఐడీసీ రేంజ్‌ 102 కిలోమీటర్లు.

సిటీ రైడింగ్‌లో ఏది కింగ్?

డ్రైవింగ్‌ డైనమిక్స్‌ విషయానికి వస్తే , రెండింటి పవర్ డెలివరీ భిన్నంగా ఉంటుంది. యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌లో 2.4kW పీక్ పవర్‌ కలిగిన BLDC హబ్‌ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 110 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 65 కిలోమీటర్లు. 0-40 kmph వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. సిటీలో ఫ్లైఓవర్లు ఎక్కడానికి, రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి ఈ పవర్ సరిగా సరిపోతుంది. 

హోండా యాక్టివా ఇ లో శక్తిమంతమైన 6kW PMSW అమర్చారు. ఇది కేవలం 7.3సెకన్లలోనే 0-60kmph. ఇందులో ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్ అనే 3రైడింగ్ మోడ్స్‌తోపాు ఇరుకైన పార్కింగ్ స్లాట్‌ల కోసం రివర్స్‌ అసిస్ట్‌ సదుపాయం కూడా ఉంది. 

టెక్ సావీలకు ఏది నచ్చుతుంది?

మాగ్నస్‌ గ్రాండ్‌ కన్సోల్‌లో 3.5 ఇంచ్‌ ఎల్‌సీడి డిజిటల్‌ కన్సోల్‌ ఉంటుంది. స్పీడ్, ఓడోమీట్‌, ట్రిప్ మీటర‌, బ్యాటరీ పర్సంటేజ్‌ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఇి స్పష్టంగా చూపిస్తుంది. ఇది సింపుల్ అండ్ నీట్ లే అవుట్‌. 

హోండా టాప్ వేరియంట్‌లో కంగా 17.78సెంటీమీటర్ల డైనమిక్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే అందించింది. హోండా రోడ్‌ సింగ్‌ డ్యూయో ద్వారా స్మార్ట్‌ ఫోన్ బ్లూటూత్‌ కనెక్టివిటీ, టర్న్‌ బై టర్న్ నావిగేషన్, కాల్‌, మెసేజ్‌ అలర్ట్స్‌, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా కీలెస్‌ రైడింగ్ కోసం స్మార్ట్ కీ సదుపాయం ఉంది,. 

మీ బడ్జెట్‌ 1 లక్ష లోపు ఉండి రోజుారీ 40-60కిలోమీటర్ల నగర ప్రయాణాలకు, ఇంటి వద్ద ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు ఉంటే మీకు యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్ మంచి ఎంపిక అవుతుంది. ఒక వేళ మీకు బడ్జెట్ పరిమితి లేకపోతే బ్రాండ్ రీసేల్‌ వాల్యూ గంటల తరబడి చార్జింగ్‌ పెట్టే ఓపిక లేని స్వాపబుల్ టెక్నాలజీ, హైస్పీడ్‌ ఫర్‌ఫార్మెన్స్‌ కావాలనుకుంటే హోండా యాక్టివా ఇ మంచి ఆప్షన్ అవుతుంది. 

Frequently Asked Questions

హోండా యాక్టివా ఇ, యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ బ్యాటరీ ఛార్జింగ్ విధానంలో ప్రధాన తేడా ఏమిటి?

హోండా యాక్టివా ఇ స్వాపబుల్ బ్యాటరీ సిస్టమ్‌తో వస్తుంది, 2 నిమిషాల్లో మార్చుకోవచ్చు. యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ ఫిక్స్డ్ బ్యాటరీ, ఇంటి వద్ద 5-6 గంటల్లో ఛార్జ్ అవుతుంది.

యాంపియర్ మాగ్నస్ గ్రాండ్, హోండా యాక్టివా ఇ స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి?

యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ టాప్ స్పీడ్ 65 kmph, 0-40 kmph 6.5 సెకన్లలో అందుకుంటుంది. హోండా యాక్టివా ఇ 0-60 kmph 7.3 సెకన్లలో చేరుకుంటుంది.

యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ స్టోరేజ్ మరియు ప్రాక్టికాలిటీ పరంగా ఎలా ఉంటుంది?

ఇది ప్రాక్టికాలిటీ ఆధారంగా డిజైన్ చేయబడింది. విశాలమైన ఫుట్‌బోర్డ్ మరియు 22 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని కెర్బ్ వెయిట్ 108 కేజీలు.

హోండా యాక్టివా ఇ అందించే అధునాతన సాంకేతిక ఫీచర్లు ఏమిటి?

హోండా యాక్టివా ఇ డైనమిక్ TFT డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్, కీలెస్ స్మార్ట్ కీ వంటి ఫీచర్లను అందిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget