అన్వేషించండి

రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి

TVS Apache RTR 160ని కేవలం ₹9,999 డౌన్ పేమెంట్ చెల్లించి తీసుకెళ్లండి. దీని ఫైనాన్స్ ప్లాన్, మంత్లీ EMI, ఇంజిన్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన ఫీచర్ల పూర్తి వివరాలా తెలుసుకోండి.,

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీవీఎస్ అపాచే RTR 160 బైక్ ₹9,999 డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు.
  • రోడ్‌పై ధర ₹1.32 లక్షలు, నెలసరి EMI ₹2,989 నుండి.
  • 159.7cc ఇంజిన్, డిజిటల్ కన్సోల్, ABS, 45kmpl మైలేజ్.

భారత్‌లో బైక్‌లంటే యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు కంపెనీలు అద్భుతమైన స్పోర్టీ బైక్‌లను లాంచ్ చేయడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఒక పవర్‌ఫుల్ బైక్ గురించి, సులభంగా ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ TVS Apache RTR 160 బైక్ గురించి తెలుసుకుందాం. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 కొనాలని ఆలోచిస్తుంటే ఈ విషయాలు తెలుసుకోండి.

మీరు కేవలం ₹9,999 డౌన్ పేమెంట్ డిపాజిట్ చేసి ఈ బైక్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. డౌన్ పేమెంట్ తర్వాత ప్రతి నెలా మీ వాయిదా (EMI) ఎంత అవుతుంది, ఫైనాన్స్ ప్లాన్ లెక్కలు ఇలా ఉన్నాయి. 

EMI ఎంత అవుతుంది 

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 యొక్క బేస్ మోడల్‌ను ఎంచుకుంటే, హైదరాబాద్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు ₹1.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్ కలిపిన తర్వాత ఆన్-రోడ్ ధర దాదాపు ₹1.32 నుండి ₹1.35 లక్షల వరకు అవుతుంది. ఈ బైక్ కోసం ₹9,999 డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని వెహికల్ లోన్ రూపంలో ఫైనాన్స్ చేయాలి. 


రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి

అలాగే, బ్యాంక్ మీకు 9.5% నుండి 10% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి లోన్ ఇస్తే, మీ నెలవారీ వాయిదా (EMI) నెలకు దాదాపు ₹4,000 నుండి ₹4,300 వరకు ఉంటుంది. 4 ఏళ్లకు అయితే నెలవారీ ఈఎంఐ రూ.3,496 చెల్లించాలి. 5 ఏళ్ల లోన్ అయితే 60 నెలలపాటు ప్రతినెలా ఈఎంఐ రూ.2,989 కడుతూ పోవాలి. ప్రతిరోజూ కేవలం ₹130 నుండి ₹140 ఆదా చేసుకోవడం ద్వారా డ్రీమ్ బైక్‌కి యజమాని అవుతారు.

 పవర్‌ఫుల్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్

TVS అపాచీ ఆర్‌టిఆర్ 160 కేవలం లుక్స్ కాకుండా, దీని ఇంజిన్ కూడా చాలా నమ్మకమైనది. ఇందులో 159.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఇచ్చారు. ఈ ఇంజిన్ 16.04 PS గరిష్ట పవర్,13.85 Nm టాపిక్ (టార్క్) జనరేట్ చేస్తుంది.

 అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బైక్‌లో టెక్నాలజీ అద్భుతంగా ఉపయోగించారు. ఇందులో పూర్తిగా డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తుంది. మీరు దీని టాప్ వేరియంట్ తీసుకుంటే, అందులో SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యం కల్పించారు. దీని ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కి కనెక్ట్ చేసి నేవిగేషన్, కాల్- SMS అలర్ట్‌లు, రేస్ టెలిమెట్రీ వంటి ప్రయోజనాన్ని పొందవచ్చు.

రాత్రి సమయంలో సురక్షితమైన రైడింగ్ కోసం LED హెడ్‌లైట్, LED టెయిల్‌లైట్ ఇస్తున్నారు. భద్రత దృష్ట్యా ఇందులో సింగిల్-ఛానల్ ABSతో పాటు ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ లభిస్తుంది.

Also Read: సుజుకి నుంచి వస్తున్న చవకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావచ్చు! e Sky ప్రత్యేకతలు ఇవే

మైలేజ్ కూడా అద్భుతం

160cc స్పోర్టీ బైక్ అయిన TVS అపాచే ఆర్‌టిఆర్ 160 మైలేజ్ విషయంలో నిరాశపరచదు. ఈ బైక్ సాధారణ రైడింగ్ కండిషన్‌లో లీటరుకు 45 నుండి 50 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. దీని 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మీరు లాంగ్ జర్నీ చేయడంలో హెల్ప్ అవుతుంది.

మీరు ఆఫీస్‌కి వెళ్లడంతో పాటు వీకెండ్‌లలో లాంగ్ రైడ్స్ ఇష్టపడేవారై, మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే కేవలం 9,999 డౌన్ పేమెంట్ చేసి వెహికల్ లోన్ తీసుకోవాలి. ఖచ్చితమైన ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్, EMI మీ లొకేషన్, సిబిల్ (CIBIL) స్కోర్‌పై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోండి.

Also Read: : రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ ధర!.. మార్కెట్‌లోకి సరికొత్త హోండా 'రెబల్ 300'

Frequently Asked Questions

TVS Apache RTR 160 బైక్‌ను తక్కువ డౌన్ పేమెంట్‌తో ఎలా కొనుగోలు చేయవచ్చు?

మీరు కేవలం ₹9,999 డౌన్ పేమెంట్ చెల్లించి TVS Apache RTR 160 బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగిలిన మొత్తాన్ని వెహికల్ లోన్ ద్వారా ఫైనాన్స్ చేయాలి.

TVS Apache RTR 160 బైక్ కోసం నెలవారీ EMI ఎంత అవుతుంది?

లోన్ వ్యవధిని బట్టి EMI మారుతుంది. 3 ఏళ్లకు నెలకు ₹4,000-₹4,300, 4 ఏళ్లకు ₹3,496, 5 ఏళ్లకు ₹2,989 చెల్లించాల్సి ఉంటుంది.

TVS Apache RTR 160 బైక్ మైలేజ్ మరియు ఇంజిన్ వివరాలు ఏమిటి?

ఈ బైక్ లీటరుకు 45 నుండి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 159.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది.

TVS Apache RTR 160 బైక్‌లో ఏయే అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి?

ఈ బైక్‌లో డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీ (టాప్ వేరియంట్‌లో), LED హెడ్‌లైట్ మరియు సింగిల్-ఛానల్ ABSతో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget