అన్వేషించండి

సుజుకి నుంచి వస్తున్న చవకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావచ్చు! e Sky ప్రత్యేకతలు ఇవే

సుజుకి తొలి ఎలక్ట్రిక్ కీ కారు e Sky. 310 కి.మీ. వరకు రేంజ్‌తో రానున్న ఈ కారు ఈ ఏడాదే లాంచ్‌ కానుంది.

Suzuki e Sky Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో సుజుకి మరో అడుగు ముందుకు వేసింది. అత్యంత చిన్న కార్ల విభాగంగా పేరున్న ‘కీ కారు’ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన తన తొలి ఎలక్ట్రిక్ కారును సుజుకి పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్ పేరు e Sky. 2026 శరదృతువులో ఈ కారును మార్కెట్లో విడుదల చేయనుంది. అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, e Sky అడుగు పెట్టేది మన మార్కెట్‌లోకి కాదు, జపాన్‌ మార్కెట్‌లోకి.

సుజుకి, e Sky కారును తొలిసారిగా 2025 జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించింది. అప్పటి కాన్సెప్ట్‌లో కనిపించిన డిజైన్‌లోని చాలా అంశాలను తుది మోడల్‌లోనూ కొనసాగించింది.

చిన్న పరిమాణం.. ఎక్కువ స్థలం

e Skyలో ప్రధాన ఆకర్షణ దాని బాక్సీ డిజైన్. కారు పొడవు, వెడల్పును కాంపాక్ట్‌గా ఉంచుతూనే క్యాబిన్‌లో ఎక్కువ స్థలం అందించేలా దీనిని డిజైన్‌ చేశారు. ముందు భాగంలో చదరపు ఆకారంలో LED హెడ్‌లైట్లు ఉన్నాయి. వీటిలో C ఆకారంలో LED DRLs ఉంటాయి. కాన్సెప్ట్‌లో కనిపించిన పూర్తి వెడల్పయిన LED లైట్ బార్‌ను మాత్రం ఉత్పత్తి (తుది) మోడల్‌లో ఇవ్వలేదు. దాని స్థానంలో నలుపు రంగు టెక్స్చర్డ్ ట్రిమ్ & కెమెరా మాడ్యూల్ ఉన్నాయి.

కారు సైడ్ డిజైన్ కూడా బాక్సీగానే ఉంటుంది. వీల్ ఆర్చ్‌లను కొద్దిగా బయటకు వచ్చినట్లుగా తీర్చిదిద్దారు. నలుపు రంగు అల్లాయ్ వీల్స్‌ను అందించారు, వీటి పరిమాణాన్ని సుజుకి ఇంకా వెల్లడించలేదు.

వెనుక భాగంలో ర్యాప్‌అరౌండ్ LED టెయిల్‌లైట్లు ఉన్నాయి. హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, రివర్స్ లైట్లు, రియర్ వైపర్, వాషర్ ఉన్నాయి. రూఫ్‌పై స్పాయిలర్‌ను కూడా ఇచ్చారు. టెయిల్‌గేట్ హ్యాండిల్ సమీపంలో మరో కెమెరా మాడ్యూల్ ఉంది.

కాన్సెప్ట్ కారు పొడవు 3,395 మిల్లీమీటర్లు, వెడల్పు 1,475 మిల్లీమీటర్లు, ఎత్తు 1,625 మిల్లీమీటర్లు. అయితే, తుది ఉత్పత్తి e Sky కొలతలను సుజుకి ఇంకా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: 30,000 జీతం ఉన్నవారు కారు కొనడం సాధ్యమేనా? అందుకు ఏం చేయాలి

రెండు డిజిటల్ స్క్రీన్లు

e Sky క్యాబిన్‌లో ఆధునిక డిజైన్ కనిపిస్తుంది. పెద్ద టచ్‌స్క్రీన్‌తో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. 3-స్పోక్స్‌ స్టీరింగ్ వీల్‌కు ఫిజికల్‌ బటన్లను అమర్చారు. స్థలాన్ని ఆదా చేసేందుకు డ్రైవ్ సెలెక్టర్‌ను డ్యాష్‌బోర్డ్‌పైనే ఏర్పాటు చేశారు.

చార్జింగ్ పోర్టులు సెంటర్ కన్సోల్‌లో ఉన్నాయి. అక్కడ చిన్న వస్తువులను పెట్టుకునేందుకు స్టోరేజ్ స్పేస్‌ కూడా అందించారు. సీట్లకు ఫిక్స్‌డ్ హెడ్‌రెస్ట్‌లు & ఫ్యాబ్రిక్ అప్‌హోలిస్టరీ ఉన్నాయి.

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఇందులో కనిపించాయి. ఈ వాహనం నుంచి ఇతర ఎలక్ట్రిక్ పరికరాలకు విద్యుత్ అందించే V2L సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది. పూర్తి ఫీచర్ల జాబితాను సుజుకి తర్వాత వెల్లడించనుంది.

ఇది కూడా చదవండి: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?

310 కి.మీ. వరకు రేంజ్?

e Sky పవర్‌ట్రెయిన్ వివరాలను సుజుకి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. జపాన్ కీ కార్లకు వర్తించే పవర్ నిబంధనలకు అనుగుణంగా సుమారు 64hp శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్‌ను ముందు భాగంలో అమర్చే అవకాశం ఉంది.

Vision e Sky కాన్సెప్ట్‌లో 270 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను ప్రకటించారు. ఉత్పత్తి మోడల్ మాత్రం సుమారు 310 కిలోమీటర్ల రేంజ్‌ను అందించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

జపాన్‌లో 2026 శరదృతువులో e Sky విడుదల కానుంది. భారత్‌లో ఈ కారును తీసుకువచ్చే విషయంపై సుజుకి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే, e Sky భారత్‌కు వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. భారత్‌లో విడుదలైతే MG Comet EV వంటి చిన్న ఎలక్ట్రిక్ కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget