అన్వేషించండి

రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత

Hero Splendor Plus down Payment | కేవలం 10 వేల రూపాయల డౌన్ పేమెంట్‌తో అత్యంత నమ్మకమైన బైక్ Hero Splendor Plusను సొంతం చేసుకోండి. మీ నెలవారీ EMI ఎంత, వడ్డీ రేటు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అధిక మైలేజ్, i3S సాంకేతికతతో పెట్రోల్ ఆదా చేస్తుంది ఈ బైక్.

భారత ఆటో మార్కెట్లో మన్నికైన, నమ్మకమైన, అధిక మైలేజ్ ఇచ్చే బైక్ అనగానే మీకు ముందుగా Hero Splendor Plus పేరు గుర్తుకొస్తుంది.  రోజూ ఆఫీసుకు వెళ్లేవారికి లేదా గ్రామం నుంచి టౌన్‌లకు మట్టి, పక్కా రోడ్లపై ప్రయాణించడం అయనా సరే ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సామాన్యుడి తొలి ఎంపికగా హీరో స్ప్లెండర్ ప్లస్ నిలుస్తోంది. కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నా, ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించడం మీ వల్ల కాకపోతే మీ కోసమే ఈ వార్త.

ఇప్పుడు కేవలం 10,000 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ బెస్ట్ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. పలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల  ఫైనాన్స్ ఆప్షన్లు కొత్త బైక్ కొనుగోలును సాధ్యం చేస్తున్నాయి. దీంతో మీ ఒకేసారి ధర చెల్లించకున్నప్పటికీ బడ్జెట్ ధరకే బైక్ సొంతం చేసుకోండి. కార్ లోన్ ఈఎంఐ పద్దతుల వివరాలు అందిస్తున్నాం. 

ఆన్-రోడ్ ధర

హైదరాబాద్‌లో Hero Splendor Plus ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రకారం సుమారు రూ.78,000 ఉంటుంది.  ఇందులో RTO రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర పన్నులు కలిపితే దీని ఆన్-రోడ్ ధర సుమారు 93,000 రూపాయల వరకు చేరుతుంది. ఇప్పుడు మీరు 10,000 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన మొత్తం అంటే సుమారు 83,000 రూపాయల వరకు బ్యాంక్ నుంచి టూ-వీలర్ లోన్ అవుతుంది. ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్ల CIBIL స్కోర్, అర్హత ఆధారంగా ఆన్-రోడ్ ధరలో 85 నుంచి 90 శాతం వరకు లోన్‌ను మంజూరు చేస్తాయి. దీంతో మీరు మీ బైక్‌ను సులభంగా ఫైనాన్స్ చేయించుకోవచ్చు.

Also Read: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

ఎంత EMI అవుతుంది?

లోన్‌లో మిగిలిన మొత్తంపై వచ్చే వాయిదా పూర్తిగా మీరు ఎంచుకున్న లోన్ టెన్యూర్ అంటే గడువు, వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. మీరు బ్యాంక్ నుంచి 9.5 నుంచి 10 శాతం సగటు వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కోసం లోన్ తీసుకుంటే, ప్రతి నెల సుమారు 2,644 రూపాయల  EMI చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ 4 ఏళ్లకు లోన్ తీసుకుంటే EMI రూ.2059 చెల్లించాలి. 5 ఏళ్లకుగానూ వెహికల్ లోన్ తీసుకుంటే కనుక ప్రతినెలా ఈఎంఐ 1711

ముఖ్యమైన విషయాలను గమనించండి

10 వేలు చెల్లించి బైక్‌ను ఇంటికి కొనుగులు చేయడం అద్భుతమైన ఆఫర్ అయినప్పటికీ, షోరూమ్‌కు వెళ్లే ముందు కొన్ని అవసరమైన పత్రాల వివరాలు తెలుసుకోండి. బ్యాంక్ లోన్ ప్రక్రియ కోసం మీ వద్ద ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఆదాయ రుజువు, పాన్ కార్డు లేదా ప్లే స్లిప్ ఉండాలి. 

మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, బ్యాంక్ మీకు తక్కువ వడ్డీ రేటుతో, అధిక ప్రాసెసింగ్ ఫీజు లేకుండా లోన్ ఆఫర్ చేయవచ్చు. షోరూమ్‌కు వెళ్లి  ఛార్జీలు, ఫైల్ ఛార్జ్, ప్రీ-పేమెంట్ పెనాల్టీల గురించి తెలుసుకోవాలి. దాంతో మీపై అదనపు భారం పడదు.

Splendor ఎందుకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటోంది

స్ప్లెండర్ ప్లస్ బైక్‌లో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ వస్తుంది. ఇది 8.02 పీఎస్ పవర్, బెస్ట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని అతిపెద్ద ప్రత్యేకత దీని మైలేజ్ అని చెబుతారు. ఇది రియల్-వరల్డ్‌లో కూడా 65 నుంచి 70 కిలోమీటర్లు సులభంగా ఇస్తుంది.

అదనంగా, ఇందులో i3S టెక్నాలజీ.. ఇది ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ నిలిచినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది. క్లచ్ నొక్కగానే మళ్లీ స్టార్ట్ అవుతుంది. దీంతో పెట్రోల్ వినియోగం ఆదా అవుతుంది.

 

Frequently Asked Questions

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎందుకు సామాన్యుల తొలి ఎంపికగా నిలుస్తుంది?

దీని మన్నిక, నమ్మకమైన పనితీరు, అధిక మైలేజ్ (65-70 కి.మీ) కారణంగా స్ప్లెండర్ ప్లస్ ప్రజల మొదటి ఎంపిక. i3S టెక్నాలజీ కూడా పెట్రోల్ ఆదాకు సహాయపడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget