అన్వేషించండి

మీ బడ్జెట్‌లోనే మంచి ఆటోమేటిక్ కారు! రూ.7 లక్షల నుంచి స్టార్ట్.. బెటర్‌ మైలేజ్‌ కూడా!

రూ.7-10 లక్షల బడ్జెట్‌లో కొనదగిన బెస్ట్ ఆటోమేటిక్ కార్ల వివరాలు ఇవే. మైలేజ్‌ విషయంలోనూ ఇవి బెటర్‌ ఆప్షన్లు. ఆ కార్ల ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Best automatic cars under 10 lakh 2026: రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో ఆటోమేటిక్ కారు కొనాలని చూస్తున్నారా?. ఈ ధర పరిధిలో.. సిటీ డ్రైవింగ్‌కు సౌకర్యంగా ఉండటంతో పాటు మంచి ఫీచర్లు, భద్రత, మైలేజీ అందించే కార్లు మీ కోసం మార్కెట్‌లో సిద్ధంగా ఉన్నాయి. మీ కుటుంబ అవసరాలకు సరిపోయే సెడాన్ నుంచి స్పోర్టీ ఎస్‌యూవీ వరకు పలు మోడళ్లను ఎంచుకోవచ్చు.

Honda Amaze

మన దేశంలో మంచి గుర్తింపు ఉన్న కాంపాక్ట్ సెడాన్.. హోండా అమేజ్. సౌకర్యవంతమైన డ్రైవింగ్, స్మూత్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇది కుటుంబాలకు మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని V పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర సుమారు రూ.9.81 లక్షలు ఎక్స్-షోరూమ్.

ఈ కారులో CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, హోండా సెన్సింగ్ ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ స్మూత్‌గా పనిచేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో ఈ వేరియంట్ సుమారు 19.46 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Skoda Kylaq

కాంపాక్ట్ SUV విభాగంలో స్కోడా కైలాక్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పటిష్టమైన నిర్మాణం, మంచి డ్రైవింగ్ అనుభూతి దీని ప్రత్యేకతలు. Classic Plus AT వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.9.25 లక్షలు.

కైలాక్‌లో 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. మంచి పనితీరుతో పాటు స్మూత్ డ్రైవింగ్‌ను అందిస్తుంది.

భద్రత విషయంలోనూ ఈ SUV ఆకట్టుకుంటుంది. 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఆటోమేటిక్ వేరియంట్ సుమారు 19.05 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: ADAS ఉన్న కారులో ఈ పొరపాటు చేయవద్దు! విస్మరిస్తే ప్రాణాలకే ముప్పు!

Tata Punch

టాటా పంచ్.. దేశంలోని ప్రముఖ మైక్రో SUVలలో ఒకటి. భద్రత, SUV తరహా డిజైన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రధాన ఆకర్షణలు. ఆటోమేటిక్ వేరియంట్లలో Pure Plus AMT ధర సుమారు రూ.7.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

పంచ్‌లో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌ను యాడ్‌ చేశారు. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. రహదారి పరిస్థితులు & డ్రైవింగ్ విధానాన్ని బట్టి ఆటోమేటిక్ వేరియంట్ సుమారు 18.8 నుంచి 20.09 కి.మీ. మైలేజీ ఇస్తుందని తెలిపింది.

ఇది కూడా చదవండి: E20 ఇంధనంపై పెరుగుతున్న ఆందోళన.. 2,573 పెట్రోల్ బంకుల్లో అమ్మకాలు నిలిపివేత!

Maruti Suzuki Swift

యువతలో ఎంతో పాపులర్ అయిన కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. స్పోర్టీ డిజైన్, మంచి పనితీరు, రీసేల్ విలువ దీని బలాలు. దీని ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు రూ.7.04 లక్షల నుంచి రూ.8.65 లక్షల వరకు ఉన్నాయి.

స్విఫ్ట్‌లో కొత్త 1.2 లీటర్ Z-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్ & ESP వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి. సుజుకి కనెక్ట్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

మైలేజీ విషయంలో స్విఫ్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ సుమారు 25.75 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

మొత్తంగా చూస్తే, రూ.7-10 లక్షల లోపు ఆటోమేటిక్ కారు కొనాలనుకునే వారికి ఈ నాలుగు మోడళ్లు మంచి ఆప్షన్లు. ఎక్కువ మైలేజీ కోసం స్విఫ్ట్, SUV తరహా డిజైన్‌ కోసం పంచ్, ప్రీమియం అనుభూతి కోసం అమేజ్, బలమైన నిర్మాణం & పనితీరుకు కైలాక్‌ను పరిశీలించవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మీ వెహికల్‌ RC కార్డు పోతే టెన్షన్ వద్దు.. డూప్లికేట్ RC కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు!
మీ బండి RC పోయిందా? డూప్లికేట్ పొందడం ఎలా? ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం ఇదే!
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
దాడి సమయంలో Tiger Shroff వెళ్తున్న BMW Car ఎంత వరకు సేఫ్? బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఖర్చు ఎంత
దాడి సమయంలో Tiger Shroff వెళ్తున్న BMW Car ఎంత వరకు సేఫ్? బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఖర్చు ఎంత
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Embed widget