అన్వేషించండి

E20 ఇంధనంపై పెరుగుతున్న ఆందోళన.. 2,573 పెట్రోల్ బంకుల్లో అమ్మకాలు నిలిపివేత!

E20 పెట్రోల్‌లో కలుషితాలపై కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించని 2,573 పెట్రోల్ బంకుల్లో విక్రయాలను నిలిపివేసింది.

E20 petrol contamination: దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఇంధన నాణ్యతపై భారీ తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని బంకులపై చర్యలు తీసుకుంటోంది. కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆగస్టు 25 నాటికి దేశవ్యాప్తంగా 2,573 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అమ్మకాలను నిలిపివేశారు.

ఇందులో.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన 1,257 బంకులు ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన 915 బంకుల్లోనూ విక్రయాలు నిలిపివేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన 401 బంకులపై కూడా ఇదే చర్య తీసుకున్నారు.

SIAM లేఖతో కలకలం
ఈ కఠిన చర్యలకు ప్రధాన కారణం E20 ఇంధనంపై వచ్చిన కలుషిత ఆరోపణలే. జులై 28న, 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్' (SIAM) కేంద్రానికి ఒక లేఖ రాసింది. దేశవ్యాప్తంగా సేకరించిన E20 ఇంధన నమూనాల్లో క్లోరైడ్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆ తర్వాత ఆ లేఖను SIAM వెనక్కి తీసుకుంది. అందులో ఉన్న గణాంకాలకు మరింత ధ్రువీకరణ అవసరమని తెలిపింది. అయితే అప్పటికే ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దీని తర్వాత వచ్చిన రాయిటర్స్ పరిశోధనతో ఈ వివాదం మరింత ముదిరింది.

ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడంతో పాటు ఇంధన సరఫరా వ్యవస్థలో కలుషితాలు, నీరు చేరడాన్ని అరికట్టేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకుల్లోకి నీరు చేరుతోందా అన్నది నిర్ధరించుకునేందుకు రోజుకు 8 నుంచి 12 సార్లు తనిఖీ చేయాలని ఆదేశించింది. 

ఇప్పటికే 88,995 డీలర్‌షిప్‌లలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పాత పెట్రోల్ బంకులకు ప్రాధాన్యం ఇస్తూ 84,687 ఇంధన కేంద్రాల్లో ఆడిట్ నిర్వహించారు. వర్షం సమయంలో ట్యాంకుల పరిస్థితిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆటోమేషన్ వ్యవస్థలు, మానిటరింగ్ ప్రోబ్స్ 85,649 బంకుల్లో పనిచేస్తున్నాయి. లోపాలు ఉన్న పరికరాలను అత్యవసర ప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు.

ఇంధన నాణ్యతను నిర్ధారించేందుకు చమురు సంస్థలు కూడా పరీక్షలు పెంచాయి. ఇథనాల్ రవాణా చేసే ట్యాంకర్లలో 7,296 సల్ఫర్ పరీక్షలు & 1,079 క్లోరైడ్ పరీక్షలు నిర్వహించారు. తమ నిల్వ ట్యాంకుల్లో మరో 151 క్లోరైడ్ పరీక్షలు చేశారు.

ఇది కూడా చదవండి: 7 సీటర్‌ హైబ్రిడ్ SUV 'MG Hector Tomahawk' లాంచ్.. పెట్రోల్‌, ఛార్జింగ్‌ కలిపి 1100km పైగా కంబైన్డ్‌ రేంజ్‌

E20 ఇంధనం అంటే?
E20 అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్. ఏప్రిల్ 1 నుంచి దేశంలోని పెట్రోల్ బంకుల్లో E20నే ప్రధానంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గతంలో లభించిన E10 పెట్రోల్‌కు బదులుగా వాహనదారులు E20పై ఆధారపడాల్సి వస్తోంది.

వాహనదారుల్లో ఆందోళనకు మరో కారణం మైలేజీ తగ్గడం. ఇంధన సామర్థ్యం తగ్గడంతో అదనపు ఖర్చు అవుతోందని చాలామంది చెబుతున్నారు. కొన్ని వాహనాల్లో ఇంజిన్ & విడిభాగాల్లో సమస్యలు తలెత్తాయని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి వాహన తయారీ కంపెనీలు
ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇంధన నమూనాలపై విస్తృత పరీక్షలు నిర్వహించాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్ & మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు ఏడాది వ్యవధిలో 21 రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 250కు పైగా ఇంధన నమూనాలను సేకరించి పరీక్షించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్లోరైడ్ పరిమితి 3 పీపీఎం. అయితే కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షల్లో దీనికంటే చాలా ఎక్కువ స్థాయిలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 6 నుంచి 570 పీపీఎం వరకు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 1.4 నుంచి 420 పీపీఎం వరకు ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో 4.1 నుంచి 550 పీపీఎం వరకు నమోదైంది.

మరోవైపు కర్ణాటక & కేరళలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ క్లోరైడ్ స్థాయిలు 1 నుంచి 2.2 పీపీఎం మధ్య ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

ఇది కూడా చదవండి: 7 సీట్లు, 517 కి.మీ. రేంజ్, 204hp పవర్.. రూ.19.49 లక్షలకే MG Hector Tomahawk EVలో చాలా ప్రత్యేకతలు

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆందోళనకర పరిస్థితి
నీటి కలుషితంపై కూడా ఆందోళన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నమూనాల్లో నీటి స్థాయి 13,000 పీపీఎంకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో 12,500 పీపీఎం నమోదైంది. ఇది అనుమతించిన 3,000 పీపీఎం పరిమితి కంటే నాలుగు రెట్లకు పైగా ఎక్కువ.

ఆధునిక వాహనాల్లోని ఇంధన ఇంజెక్టర్లు చాలా సున్నితంగా ఉంటాయి. అధిక క్లోరైడ్.. ఇంధన వ్యవస్థలో తుప్పుపట్టడం వంటి సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంధన పంపు ఫిల్టర్లు మూసుకుపోయే అవకాశం కూడా ఉందని కొన్ని వాహన తయారీ సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. అయితే, మొత్తంగా E20 పెట్రోల్‌నే సమస్యగా చూడకూడదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఉండే క్లోరైడ్ స్థాయిలే అసలు సమస్య కావచ్చని పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం BIS ప్రమాణాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌లో ఇన్‌ఆర్గానిక్‌ క్లోరైడ్‌కు తప్పనిసరి పరిమితి స్పష్టంగా లేదు. ఈ విషయంలో స్పష్టమైన ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇంధన నాణ్యతపై కేంద్రం చేపట్టిన తాజా చర్యలు, ప్రభుత్వం ఈ సమస్యను ఎంత సీరియస్‌గా తీసుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget