అన్వేషించండి

మిత్సుబిషి 'పజెరో' ఈజ్ బ్యాక్.. సెప్టెంబర్ 2న కొత్త SUV ఆవిష్కరణ, దమ్మున్న ఆఫ్‌రోడింగ్‌ కారు!

మిత్సుబిషి పజెరో కొత్త తరం SUV సెప్టెంబర్ 2న గ్లోబల్‌గా ఆవిష్కృతం కానుంది. లాడర్ ఫ్రేమ్, S-AWC, ఆఫ్‌రోడ్ మోడ్‌లు, డీజిల్ హైబ్రిడ్‌తో రానున్నట్లు సమాచారం.

Mitsubishi Pajero 2026 Price And Features Telugu: మిత్సుబిషి పేరు వింటే మనకు ఎలక్ట్రానిక్స్‌ & ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్లు గుర్తుకొస్తాయి. అయితే, ఈ కంపెనీ కార్లను కూడా తయారు చేస్తుంది, అవి మన దేశంలోనూ తిరిగాయి. ఒకప్పుడు, భారతీయ SUV ప్రియుల మనసులను గెలుచుకున్న మిత్సుబిషి కారు.. 'పజెరో' (Pajero). భారీ రోడ్ ప్రెజెన్స్, పటిష్ఠమైన నిర్మాణం & అద్భుతమైన ఆఫ్‌రోడ్ సామర్థ్యంతో ఈ SUV ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా మార్కెట్‌కు దూరంగా ఉన్న పజెరో పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది.

మిత్సుబిషి, కొత్త పజెరోను సెప్టెంబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఈసారి పజెరో కొత్త రూపంతో మాత్రమే కాకుండా, లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌తో రానుంది. దీంతో ఆఫ్‌రోడ్ సామర్థ్యంపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కొత్త పజెరోలో బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణం ఉంటుంది. గత తరం పజెరోలో ఉన్న మోనోకాక్ నిర్మాణానికి ఇది భిన్నం. కొత్త SUV మిత్సుబిషి ట్రిటాన్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం.

ఆఫ్‌రోడ్ సామర్థ్యానికి సంబంధించిన మరో కీలక అంశం S-AWC ఆల్-వీల్ డ్రైవ్ వ్యవస్థ. ఇది ఇప్పటికే ట్రిటాన్ పికప్‌లో అందుబాటులో ఉంది. కొత్త పజెరోలో సూపర్ సెలెక్ట్ 4WD-II వ్యవస్థ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది టూ వీల్‌ డ్రైవ్, ఫోర్‌ వీల్‌ డ్రైవ్ & లో-రేంజ్ వంటి విభిన్న డ్రైవ్ సెట్టింగ్‌లను అందించవచ్చు.

ఆఫ్‌రోడ్ డ్రైవింగ్ కోసం ఎకో, గ్రావెల్, సాండ్, స్నో, మడ్ & రాక్ వంటి టెర్రైన్ మోడ్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి వివిధ రకాల రోడ్డు పరిస్థితుల్లో SUV సామర్థ్యాన్ని పెంచుతాయి.

ఇది కూడా చదవండి: కార్లు, బైకుల హెడ్‌లైట్లకు కొత్త రూల్స్‌! హైబీమ్ వాడితే అలర్ట్.. వెలుగు తగ్గనుందా?

కొత్త పజెరోలో డిజిటల్ టెక్నాలజీకి కూడా పెద్దపీట వేసినట్లు టీజర్ పిక్చర్లను బట్టి తెలుస్తోంది. పజెరోకు గతంలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన 3-గేజ్‌ లేఅవుట్ ఇప్పుడు డిజిటల్ రూపంలో కనిపించనుంది.

ఈ డిజిటల్ డిస్‌ప్లేలో ఆల్టీమీటర్, ఉష్ణోగ్రత, వాహనం పిచ్ & రోల్ వంటి వివరాలను చూపించవచ్చు. ఆఫ్‌రోడ్ డ్రైవింగ్ చేసేవాళ్లకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

క్యాబిన్‌లో 14.3 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. ఇందులో గేజ్ గ్రాఫిక్స్ కూడా కనిపించవచ్చు. వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, హిల్ డిసెంట్ కంట్రోల్ & వెనుక డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. సెమీ అనిలిన్ లెదర్ సీటింగ్‌తో ప్రీమియం టచ్ ఇవ్వనున్నారు.

ఎక్స్‌టీరియర్‌లోనూ పజెరోకు కొత్త రూపాన్ని అందించారు. ముందుభాగంలో H ఆకారంలో ఉండే LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ రెండు లైట్ల మధ్యలో మిత్సుబిషి లోగో ఉంటుంది. నిలువుగా అమర్చిన పిక్సెల్ తరహా లైటింగ్ ఎలిమెంట్లు కూడా టీజర్‌లలో కనిపిస్తున్నాయి.

ఇంజిన్ గురించి మిత్సుబిషి ఇప్పటివరకు పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయితే డీజిల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ టెక్నాలజీపై మిత్సుబిషి ఇప్పటికే పనిచేస్తోంది. అయితే, పజెరోలో ఎలాంటి ఇంజిన్‌ను ఉపయోగిస్తారనే విషయాన్ని సెప్టెంబర్ 2న జరిగే గ్లోబల్ డెబ్యూలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: E85 ఇంధనంతో నడిచే తొలి స్కూటర్ హోండా ADV160.. 27 లీటర్ల స్టోరేజ్‌, రూ.1.70 లక్షల ధర

భవిష్యత్తులో కొన్ని మార్కెట్ల కోసం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ & పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్లను కూడా తీసుకురావచ్చనే ప్రచారం ఉంది.

కొత్త పజెరో 2027 ప్రారంభంలో ఆసియా మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారత్‌లో విడుదలపై మిత్సుబిషి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

భారత్‌లో పజెరోకు ఉన్న ప్రత్యేక గుర్తింపు దృష్ట్యా కొత్త మోడల్ ఇక్కడికి వస్తుందా అనే ఆసక్తి SUV అభిమానుల్లో ఉంది. ఒకప్పుడు భారత రోడ్లపై తన ప్రత్యేకమైన ఇమేజ్‌తో ఆకట్టుకున్న పజెరో, కొత్త తరంలో ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget