E85 ఇంధనంతో నడిచే తొలి స్కూటర్ హోండా ADV160.. 27 లీటర్ల స్టోరేజ్, రూ.1.70 లక్షల ధర
హోండా ADV160 భారత మార్కెట్లో విడుదలైంది. రూ.1.70 లక్షల ధరతో వచ్చిన ఈ స్కూటర్ E85 వరకు ఉండే ఇంధనాలకు అనుకూలంగా ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Honda ADV160 Price And Features Telugu: 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా', తన కొత్త అడ్వెంచర్ తరహా స్కూటర్ "ADV160" ధరను ప్రకటించింది. ఈ స్కూటర్‌ను రూ.1.70 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ టూవీలర్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. హోండా వెబ్‌సైట్‌తో పాటు రెడ్వింగ్ & బిగ్‌వింగ్ షోరూమ్‌లలో ADV160ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మొత్తం రూ.5,000. డెలివరీలు పండుగ సీజన్లో, అంటే ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి.
E85 ఇంధనంతో నడిచే తొలి స్కూటర్
హోండా కంపెనీ, ADV160 ని ఒకే వేరియంట్లో అందిస్తోంది. ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్. E85 వరకు ఎలాంటి ఇథనాల్ మిశ్రమ ఇంధనంతోనైనా ఈ స్కూటర్ నడుస్తుంది. దీంతో, భారత మార్కెట్లో విక్రయించే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్కూటర్‌గా ADV160 నిలిచింది.
ADV160లో కొత్త 156.93cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. భారత్‌లో ఈ ఇంజిన్ పవర్ & టార్క్ వివరాలను హోండా ఇంకా వెల్లడించలేదు. ఇతర దేశాల్లో ఇదే ఇంజిన్ 16.3hp పవర్ & 14.9Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఎక్కువ స్టోరేజ్.. కొత్త డిస్ప్లే
ADV160లో 27 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉంది. ఈ విభాగంలో ఇదే అత్యధిక స్టోరేజ్ సామర్థ్యంగా హోండా చెబుతోంది. హెల్మెట్‌తో పాటు ఇతర వస్తువులను కూడా ఇందులో సులభంగా పెట్టుకునే అవకాశం ఉంది.
స్కూటర్లో కొత్త 5 అంగుళాల కలర్ TFT డిస్ప్లే ఉంది. ఇది హోండా RoadSync కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా రైడర్లు చాలా కనెక్టెడ్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: హ్యాచ్‌బ్యాక్ నుంచి 7 సీటర్ వరకు.. రూ.10 లక్షల్లోనే వచ్చే బెస్ట్ CNG కార్లు ఇవే!
ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది
హోండా ADV160లో Honda Selectable Torque Control అందించారు. ఇది ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థ. జారుడుగా ఉండే రోడ్లపై వెనుక చక్రానికి వచ్చే పవర్‌ను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.
బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సింగిల్ ఛానల్ ABSను కూడా అందించారు. USB ఛార్జింగ్ సదుపాయం కూడా స్టాండర్డ్‌గా ఉంది.
దేశీయంగానే తయారీ
ADV160ను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. దేశీయ ఉత్పత్తి కారణంగానే పోటీ ధరను నిర్ణయించారు. అయినప్పటికీ, ఈ స్కూటర్ ధర ప్రత్యర్థి స్కూటర్ల కంటే కొంత ఎక్కువగానే ఉంది.
Hero Xoom 160 & Yamaha Aerox 155తో Honda ADV160 పోటీ పడుతుంది. వీటితో పోలిస్తే ADV160 ధర కాస్త ఎక్కువైనా, ఈ స్కూటర్లో పెద్ద TFT డిస్ప్లే, ఎక్కువ పవర్ & 27 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?
అడ్వెంచరిస్టిక్ డిజైన్, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ, ట్రాక్షన్ కంట్రోల్, ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం ADV160కి ఉన్న ప్రత్యేకతలు. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి కాబట్టి, మీకు ఈ బండి మీద ఆసక్తి ఉంటే, హోండా వెబ్సైట్ లేదా సమీపంలోని రెడ్వింగ్ & బిగ్‌వింగ్ షోరూమ్‌ను సంప్రదించవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















