అన్వేషించండి

సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్‌ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?

సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్ రివ్యూ. 95km క్లెయిమ్డ్ రేంజ్, 88km టెస్ట్ రేంజ్, 17 లీటర్ల స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Suzuki e-Access Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో బలమైన స్థానంలో ఉన్న టీవీఎస్, బజాజ్, హీరో, ఏథర్‌ వంటి కంపెనీలకు పోటీగా.. సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-యాక్సెస్‌ను ఇటీవల తీసుకొచ్చింది. వాస్తవానికి, సుజుకి ఈ స్కూటర్‌ను తొలిసారి 2025 జనవరిలో ప్రదర్శించింది. అయితే మార్కెట్లోకి మాత్రం 2026 జనవరిలో తీసుకొచ్చింది. ఆలస్యంగా వచ్చినప్పటికీ.. సుజుకి బ్రాండ్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. ఆటో ఎక్స్‌పర్ట్‌లు ఈ బండిని నిజమైన పరిస్థితుల్లో నడిపి చూసినప్పుడు కొన్ని మంచి అంశాలు కనిపించినప్పటికీ, కొన్ని మైనస్‌లను కూడా గుర్తించారు.

డిజైన్‌ విషయంలో e-యాక్సెస్ పూర్తిగా కొత్త ఉత్పత్తి. ఇప్పటికే ఉన్న పెట్రోల్ యాక్సెస్‌తో దీనికి పెద్దగా పోలిక ఉండదు. e-యాక్సెస్ ముందు భాగంలో డబుల్ డక్‌బిల్ ఆకారంలోని డిజైన్ కనిపిస్తుంది. వెనుక భాగం బాక్సీగా ఉంటుంది. ఈ రెండు డిజైన్ అంశాలు కలిసిన తీరు అందరికీ నచ్చకపోవచ్చు.

నిర్మాణ నాణ్యత మాత్రం బాగుంది. సుజుకి స్కూటర్లలో కనిపించే దృఢత్వం ఇందులోనూ ఉంది. 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే అందించారు. ఈ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌లో ఎకో, రైడ్ B & రైడ్ A అనే మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. అయితే ప్రయాణంలో ఎకో నుంచి రైడ్ మోడ్‌కు మాత్రమే మారవచ్చు. రైడ్ A & రైడ్ B మధ్య మారాలంటే స్కూటర్‌ను పూర్తిగా ఆపాలి. ఈ విధానం కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది.

రైడ్ Aలో రీజెనరేటివ్ బ్రేకింగ్ బలంగా ఉంటుంది. రైడ్ Bలో అది సున్నితంగా పనిచేస్తుంది. కీ లెస్ ఇగ్నిషన్, ముందు భాగంలో USB-A ఛార్జర్‌తో ఓపెన్ స్టోరేజ్ స్థలం కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?

అయితే, అండర్‌సీట్ స్టోరేజ్ విషయంలో e-యాక్సెస్ నిరాశపరుస్తుంది. ఇందులో కేవలం 17 లీటర్ల స్థలం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 30 నుంచి 35 లీటర్ల వరకు స్టోరేజ్ ఇస్తున్నాయి. వాటితో పోలిస్తే ఈ 17 లీటర్ల స్థలం చాలా తక్కువ.

సుజుకి 600W ఛార్జర్‌ను అందిస్తోంది. పూర్తిగా ఖాళీ అయిన బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటలు పట్టింది. ఛార్జర్‌ను పెట్టుకునేందుకు ప్రత్యేక బ్యాగ్ కూడా ఇచ్చారు. అయితే ఛార్జర్ కేబుళ్లను సరిగ్గా మడవకపోతే సీట్ కింద ఉన్న స్టోరేజ్ క్లోజ్‌ కాదు.

సుజుకి e-యాక్సెస్‌లో 3.072kWh LFP బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ వెల్లడించిన ప్రకారం IDC రేంజ్ 95km. ఆటో ఎక్స్‌పర్ట్‌ల పరీక్షలో రైడ్ A మోడ్‌లో ఫుల్‌ ఛార్జ్‌తో 88km కంటే కాస్త ఎక్కువ దూరం ప్రయాణించింది. ఈ ఫలితం అంత బ్యాడ్‌గా లేకపోయినప్పటికీ... ఇదే సామర్థ్యం ఉన్న కొన్ని ప్రత్యర్థి స్కూటర్లు 100kmకు పైగా రేంజ్ ఇస్తున్నాయి.

ఎకో మోడ్‌లో రేంజ్ మరింత పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్‌ మాత్రం కొంత తగ్గుతుంది. నగర ట్రాఫిక్‌లో వేగంగా దూసుకెళ్లడానికి & ఫ్లైఓవర్లు ఎక్కడానికి ఇది సరిపోతుంది.

పనితీరు విషయంలో e-యాక్సెస్ అంతగా ఆకట్టుకోలేదు. 0-60kmph వేగాన్ని అందుకోవడానికి ఎక్స్‌పర్ట్‌ల పరీక్షలో దాదాపు 12 సెకన్లు పట్టింది. మార్కెట్‌లో ఉన్న ఇతర ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే నెమ్మదిగా ఉంది. అంతేకాదు, పెట్రోల్ యాక్సెస్ 125 కూడా ఇదే పరీక్షను 7.68 సెకన్లలో పూర్తి చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ట్రెయిన్ శబ్దం కూడా కొంత ఎక్కువగానే ఉంది.

ఇది కూడా చదవండి: చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే

రైడింగ్ కంఫర్ట్ మాత్రం బాగుంది. తక్కువ ఎత్తు ఉన్నవాళ్లకు ఈ స్కూటర్‌లోని 765mm సీట్ ఎత్తు సౌకర్యంగా ఉంటుంది. పొడవుగా ఉన్న రైడర్లకు మాత్రం ఇది కొంచెం తక్కువగా అనిపించవచ్చు. ఫ్లాట్ సీట్, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ & మంచి సస్పెన్షన్ కారణంగా రైడ్ సౌకర్యంగా ఉంటుంది.

122kg బరువుతో e-యాక్సెస్ తేలికగానే ఉంటుంది. ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లవచ్చు. అయితే, మలుపుల్లో స్కూటర్ త్వరగా ఒకవైపు వాలే స్వభావం కనిపించింది. బ్యాటరీని సీట్ కింద నిలువుగా అమర్చడం వల్ల గురుత్వ కేంద్రం కొంత ఎత్తులో ఉండటమే దీనికి కారణం.

బ్రేకింగ్ పవర్‌ బాగున్నప్పటికీ బ్రేక్ బైట్ కొంత షార్ప్‌గా ఉంది. రూ.1.92 లక్షల ధర ఉన్న స్కూటర్‌లో ABS లేకపోవడం పెద్ద లోటుగా చెప్పాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే... ధరే e-యాక్సెస్‌కు ప్రధాన సమస్య. మంచి నిర్మాణ నాణ్యత, సుజుకి బ్రాండ్‌పై నమ్మకం, మంచి కంఫర్ట్ వంటి అంశాలు ఉన్నప్పటికీ రూ.1.92 లక్షల ధరను సమర్థించడం కష్టం. ఇదే ప్రైస్‌ రేంజ్‌లో టీవీఎస్, బజాజ్, విడా & ఏథర్‌ వంటి కంపెనీలు మెరుగైన రేంజ్, ఎక్కువ స్టోరేజ్ & వేగవంతమైన ఛార్జింగ్‌తో స్కూటర్లను అందిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget