అన్వేషించండి

AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!

AP Municipal Elections Counting: ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నానికి కొన్ని చోట్ల ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు నేడు జరుగుతుంది.
  • ఆదివారం పోలింగ్ జరగ్గా, నేడు 13 కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది.
  • పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, విజయవాడలో ఆలస్యంగా ముగిసింది.
  • ఓట్ల లెక్కింపుకు భారీ భద్రత, మధ్యాహ్నానికల్లా ఫలితాలు.

AP Municipal Elections Counting: ఏపీలో ఎంతగానో ఆసక్తి రేకెత్తించిన పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పోలింగ్ నిర్వహించగా.. మిగతా 13 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు. నేడు(నవంబర్ 3) ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి ఒక్కో చోట ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కనుక ఫలితాలు కాస్త ఆలస్యంగానే వస్తాయని ఈసీ తెలిపింది. 

పోలింగ్ వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్‌పై గుర్తులు తారుమారు కావడం వల్ల పోలింగ్ నిర్వహణ ఆలస్యమైంది. దీంతో ఓటర్లకు ఎన్నికల సంఘం రెండున్నర గంటల అదనపు సమయాన్ని పొడిగించి, రాత్రి 7.30 గంటల వరకు ఓటు వేసే వెసులుబాటు కల్పించింది.

ఎస్‌ఈసీ సమీక్ష 

ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ.. 12 జిల్లాల కలెక్టర్లు, పరిశీలకులతో నిరంతరం పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాయని, అయితే కడప, అనంతపురం, పల్నాడు జిల్లాల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయన్నారు.  ముఖ్యంగా పులివెందుల  ఫిర్యాదులపై కలెక్టర్లు, ఎస్పీలు ఇచ్చే అధికారిక నివేదికల ఆధారంగానే ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. 2021లో 63.6% పోలింగ్ నమోదవ్వగా, ఈసారి నమోదైన పూర్తి స్థాయి పోలింగ్ శాతంపై స్పష్టత రానుందని వివరించారు.

నేడే లెక్కింపు – కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత:

మంగళవారం ఉదయం నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, స్థానిక యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. మధ్యాహ్నానికల్లా స్థానిక పోరులో గెలుపెవరిదో తేలిపోనుండటంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజలందరి దృష్టి ఈరోజు వెలువడే ఫలితాలపైనే నెలకొంది.

Also Read: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు

Frequently Asked Questions

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుంది?

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (నవంబర్ 3) జరుగుతుంది. ఈరోజే ఫలితాలను ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో రీపోలింగ్ ఎక్కడైనా జరిగిందా?

అవును, రాష్ట్రవ్యాప్తంగా 13 పోలింగ్ కేంద్రాల్లో నేడు రీపోలింగ్ నిర్వహించారు. ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రీపోలింగ్ జరిగింది.

పోలింగ్ సందర్భంగా ఏవైనా ప్రత్యేక ఘటనలు జరిగాయా?

కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్‌పై గుర్తులు తారుమారు కావడంతో ఓటు వేసే సమయాన్ని పొడిగించారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎప్పటిలోగా వెలువడతాయి?

మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నానికల్లా స్థానిక పోరులో గెలుపెవరిదో తేలిపోనుందని అధికారులు తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kota Rukmini vs YSRCP: పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టబోయి వైసీపీ సెల్ఫ్ గోల్ - కోట రుక్మిణి న్యాయపోరాటంతో ప్రతిపక్షం సైలెంట్ అయిపోయిందా?
పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టబోయి వైసీపీ సెల్ఫ్ గోల్ - కోట రుక్మిణి న్యాయపోరాటంతో ప్రతిపక్షం సైలెంట్ అయిపోయిందా?
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Kakinada Fishermen Boat Missing: సముద్రంలో గల్లంతైన ఉప్పాడ మత్స్యకారుల బోటు.. గాలింపు చర్యలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు
సముద్రంలో గల్లంతైన ఉప్పాడ మత్స్యకారుల బోటు.. గాలింపు చర్యలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajiv Gandhi Security: రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Embed widget