అన్వేషించండి

nstant Justice Encounters Vs Rule of Law : తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?

Instant Justice Encounters:ఏదైనా ఒక ఘోరమైన ఉన్మాదం జరిగినప్పుడు నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. చట్టవిరుద్ధమైనా ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

 Raptadu Incident Encounter Demand:  సమాజంలో ఘోరమైన అపరాధాలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై  వికృత దాడులు జరిగిన ప్రతిసారీ ప్రజాక్షేత్రం నుంచి ఒక్కటే  నినాదం వినిపిస్తోంది— నిందితుడిని అప్పటికప్పుడు ఎన్‌కౌంటర్ చేయాల్సిందే! అని.   న్యాయస్థానాల విచారణ, తీర్పుల కోసం వేచి చూసే ఓపిక ప్రజల్లో రోజురోజుకూ సన్నగిల్లుతోంది. గతంలో సంచలనం సృష్టించిన  దిశ  ఉదంతంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ప్రజల నుంచి, పౌర సమాజం నుంచి వెల్లువెత్తిన అభినందనలు, మద్దతు ఈ ధోరణికి నిదర్శనం. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ సంఘటన అనంతర పరిణామాలలోనూ నిందితులపై తీవ్ర ప్రజాక్షోభ, తక్షణ శిక్ష విధించాలన్న డిమాండ్లు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ  తక్షణ న్యాయం సంస్కృతి ఎటు దారితీస్తోందనేది  ఆలోచనాత్మకమైన ప్రశ్న.

 ఎన్‌కౌంటర్ మద్దతు ధోరణి ఎందుకు?

ఈ తరహా ఎన్‌కౌంటర్ మద్దతు ధోరణి ఎందుకు పెరుగుతోందో లోతుగా విశ్లేషిస్తే, ప్రధానంగా మన న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకరాహిత్యమే అసలు కారణమని స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా నడిచే సివిల్, క్రిమినల్ విచారణలు, సాక్ష్యాల కొరత సాకుతో దర్జాగా బయటపడే నిందితులు, బెయిలుపై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడే సంస్కృతి.. సామాన్యుడికి న్యాయవ్యవస్థపై విసుగు పుట్టిస్తోంది.  శిక్ష ఆలస్యమైతే అది న్యాయాన్ని నిరాకరించడమే  అనే భావన బలంగా నాటుకపోవడం వల్లనే, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని  ఆత్మరక్షణ, ఎదురుదాడి  పేరిట మరణశిక్షలు అమలు చేసినప్పుడు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ జైజైలు పలుకుతున్నారు.

కానీ అది అరాచకానికి దారి తీస్తుంది!

 ఎంతటి దారుణ నేరమైనా సరే, న్యాయ విచారణను దాటవేసి పోలీసులు శిక్షకులుగా మారడం ప్రజాస్వామ్య సూత్రాలకే పెద్ద ముప్పు. పోలీసు వ్యవస్థే తప్పును నిర్ధారించి, శిక్షను నిర్ణయించి, దానిని వెంటనే అమలు చేసే అధికారాన్ని పొందితే.. రాజ్యాంగం ప్రసాదించిన చట్టబద్ధమైన పాలన  అనే పునాది కూలిపోతుంది. ఆత్మరక్షణ లేదా ఎదురుదాడి ముసుగులో జరిగే ఎన్‌కౌంటర్లు చట్టబద్ధమైన న్యాయ విచారణకు ప్రత్యామ్నాయం కావు. ఉద్వేగాల ఆధారంగా న్యాయం జరిగే వాతావరణం ఏర్పడితే, రేపు నిర్దోషులు లేదా రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ  తక్షణ న్యాయం  పేరిట బలికావాల్సి వస్తుంది.

ఇలాంటి ఘటనలు అరాచకానికి దారి తీస్తాయి!

పోలీసులు న్యాయమూర్తులుగా మారిపోవడం అనేది అరాచకత్వానికి  దారితీస్తుంది. ఒక పోలీస్ రాజ్యం రూపుదిద్దుకుంటే పౌరుల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ ప్రమాదంలో పడతాయి. ఎన్‌కౌంటర్లను ఆమోదించే సమాజం, అంతర్గతంగా తమ న్యాయపరిపాలన వ్యవస్థ విఫలమైందని ఒప్పుకున్నట్లే. రాప్తాడు వంటి ఘటనల్లో ప్రజల ఆగ్రహం న్యాయమైనదే అయినప్పటికీ, ఆ ఆగ్రహాన్ని ఎన్‌కౌంటర్ల దాహంగా మార్చడం కాకుండా చట్టపరమైన సంస్కరణలకు ఆయుధంగా మలచుకోవాల్సిన బాధ్యత సమాజంపైన, పాలకులపైన ఉంది.  ప్రజలు ఎన్‌కౌంటర్లను కోరుకోవడం వెనుక ఉన్న అసలు సందేశం మాకు తక్షణ, కఠినమైన న్యాయం కావాలి  అని మాత్రమే. ఈ పరిస్థితిని మార్చాలంటే శిక్షాస్మృతి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. దారుణమైన నేరాల్లో వేగంగా  విచారణ పూర్తి చేసి, నెలల వ్యవధిలోనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. సాక్ష్యాల సేకరణలో సాంకేతికతను పెంచి, లూప్‌హోల్స్ లేకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేసినప్పుడే ప్రజలకు నమ్మకం కుదురుతుంది.

భావోద్వేగంతోనే ఎన్ కౌంటర్లు

 ఎన్‌కౌంటర్లు తాత్కాలికంగా ప్రజామోదాన్ని, భావోద్వేగ ఉపశమనాన్ని ఇవ్వవచ్చు కానీ, అవి సమాజానికి ఆరోగ్యకరమైన పరిష్కారాలు కావు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయస్థానాల ద్వారానే నిందితులకు కఠిన శిక్షలు పడాలి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections Counting Live Updates: మురసు తుపాను ఎఫెక్ట్.. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యం
మురసు తుపాను ఎఫెక్ట్.. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యం
Cyclone Murasu Landfall: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
AP Local Body Elections Counting: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా జరుగుతుంది, దశలవారీగా వివరాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా జరుగుతుంది, దశలవారీగా వివరాలు
ABP Desam Top 10, 3 November 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 3 November 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
Cyclone Murasu Landfall: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
AP Youth Trapped In Russia: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
125 యూనిట్లు.. 6 నిమిషాలు! రికార్డు స్థాయిలో అమ్ముడైన Royal Enfield Classic 650 Hypershift స్పెషల్ ఎడిషన్
కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్పెషల్‌ బైక్‌.. ఏంటి ప్రత్యేకత?
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
nstant Justice Encounters Vs Rule of Law : తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
Embed widget