స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్... 6 స్పీడ్ ఆటోమేటిక్ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ 1.0 లీటర్ 8AT రియల్ వరల్డ్ మైలేజ్ వివరాలు ఇవి. నిజమైన పరిస్థితుల్లో నగరంలో, హైవేపై నడిపినప్పుడు ఈ SUV ఇచ్చిన మైలేజ్ గురించి తెలుసుకోండి.

Skoda Kushaq 1.0 AT Price And Features Telugu: స్కోడా కుషాక్‌లో కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తీసుకొచ్చింది స్కోడా. 2026 అప్‌డేట్‌లో భాగంగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను యాడ్ చేసింది. అంటే, గతంలో ఉన్న 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తీసుకొచ్చింది. కొత్త గేర్‌బాక్స్‌తో, వాస్తవ పరిస్థితుల్లో కుషాక్ ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకునేందుకు ఆటో ఎక్స్‌పర్ట్‌లు రియల్ వరల్డ్ టెస్ట్ నిర్వహించారు.
కొత్త కుషాక్‌లో, ఇంతకుముందు ఉన్న అదే 1.0 లీటర్, 3 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగిచారు. ఇది 115hp పవర్ & 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కారణంగా కంపెనీ ప్రకటించిన మైలేజ్ పెరిగింది. 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువగా ఉంది.
కొత్త కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్ విషయంలో కంపెనీ పేర్కొన్న మైలేజ్ 19.09kmpl. అయితే రియల్ వరల్డ్ పరిస్థితుల్లో వచ్చిన ఫలితాలు దీని కంటే తక్కువగా ఉన్నాయి, ఇది సాధారణంగా జరిగేదే. ఆటో ఎక్స్‌పర్ట్‌లు, నిజమైన పరిస్థితుల్లో, సిటీ ట్రాఫిక్‌లో & హైవే మీద ఈ కారును నడిపి పరీక్షించారు. ఈ పరీక్షల్లో... నగరంలో కుషాక్ 10.7kmpl మైలేజ్ ఇచ్చింది. హైవేపై 15.1kmpl మైలేజ్ నమోదు చేసింది. ఈ రెండింటిని కలిపి చూస్తే, సగటు మైలేజ్ 12.9kmpl లెక్క తేలింది.
పాత 6 స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్‌తో పోలిస్తే కొత్త 8 స్పీడ్ వెర్షన్ కాస్త మెరుగైన ఫలితాలను ఇచ్చింది. నగరంలో మైలేజ్ 1.8kmpl పెరిగింది. హైవేపై ఏకంగా 2.7kmpl మెరుగుదల కనిపించింది. కొత్త కుషాక్ బరువు పాత మోడల్ కంటే 14kg ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మైలేజ్ మెరుగుపడడం గమనించాల్సిన విషయం.
ఇది కూడా చదవండి: రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌తో Maruti WagonR Automatic కొంటే చెల్లించాల్సిన EMI ఎంత
కొత్త కుషాక్‌లో ఆటోమేటిక్ ఇంజిన్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఇది చాలా త్వరగా పనిచేస్తుంది. కారు పూర్తిగా ఆగకముందే, వేగం తగ్గుతున్న సమయంలోనే ఇంజిన్‌ను ఆపేస్తుంది. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. అయితే, డ్రైవింగ్ సమయంలో ఈ వ్యవస్థ కొంత ఎక్కువగా రియాక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది.
కుషాక్ 1.0 8ATలో డ్రైవ్ మోడ్‌లు లేవు. అయితే, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో క్రిప్ ఫంక్షన్ కొనసాగింది. పాత 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో పోలిస్తే ఇది ఇప్పుడు కొంత సెన్సిటివ్‌గా ఉంది. అయినప్పటికీ, కారు స్టార్ట్ చేసిన వెంటనే ముందుకు వెళ్లేందుకు ఇది వెంటనే స్పందిస్తుంది.
మైలేజ్ పరీక్ష కోసం సాధారణ వినియోగ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ముందుగా కారు ఇంధనం ట్యాంక్‌ను పూర్తిగా నింపారు. టైర్లలో, కంపెనీ సూచించిన ఎయిర్ ప్రెజర్‌ను సెట్ చేశారు. ఆ తర్వాత, నిజమైన ట్రాఫిక్‌సో నగరం & హైవేపై నిర్ణయించిన మార్గాల్లో కారును నడిపారు.
ఇది కూడా చదవండి: టోల్‌గేట్ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్ ట్రావెల్స్!
ఎయిర్ కండిషనర్‌ను 22 డిగ్రీల వద్ద పూర్తి ఆటోమేటిక్ మోడ్‌లో ఉంచారు. ఆడియో సిస్టమ్, వైపర్లు, ఇండికేటర్లు వంటి ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను సాధారణ వినియోగదారుల మాదిరిగానే అవసరమైనప్పుడు ఉపయోగించారు. ప్రతి కారులో ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించారు. వివిధ రకాల డ్రైవింగ్ స్టైల్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకునేలా, డ్రైవర్లను మారుస్తూ ఈ టెస్ట్ చేశారు.
ప్రతి పరీక్ష ముగిసిన తర్వాత ట్యాంక్‌ను మళ్లీ పూర్తిగా నింపి ఎంత ఇంధనం అయిపోయిందో లెక్కించారు. ఈ విధంగా వచ్చిన గణాంకాల ఆధారంగా రియల్ వరల్డ్ మైలేజ్‌ను నిర్ధారించారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















