అన్వేషించండి

సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!

Decathlon కొత్తగా EXPL 10, EXPL 20, EXPL 140 సైకిళ్లను భారత్‌లోనే తయారు చేసి లాంచ్‌ చేసింది. వీటి ధరలు, ఫీచర్లు & ప్రత్యేకతలు తెలుసుకోండి.

Decathlon Rockrider Series Bicycles: డెకాథ్లాన్, తన రాక్‌రైడర్ సిరీస్‌లో మూడు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. EXPL 10, EXPL 20 & EXPL 140 పేర్లతో వీటిని లాంచ్‌ చేసింది. ఈ మూడు సైకిళ్లను భారత్‌లోనే తయారు చేయడం ప్రత్యేకత.

కొత్త రైడర్ల నుంచి ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ (రాళ్లతో ఉన్న ఎగుడుదిగుడు కొండదారులు, మట్టి రోడ్లు వంటివి)పై సైక్లింగ్‌ చేయాలనుకునేవాళ్ల వరకు వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ మోడళ్లను రూపొందించింది. భారతీయ రైడర్ల శరీర నిర్మాణం, రైడింగ్‌ విధానం & స్థానిక రహదారులు, ట్రైల్స్‌కు అనుగుణంగా వీటి డిజైన్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త రైడర్ల కోసం EXPL 10

కొత్త మోడళ్లలో EXPL 10 అనేది ఎంట్రీ లెవల్ సైకిల్‌. రోజువారీ సిటీ రైడింగ్‌ కోసం దీనిని రూపొందించారు. సింపుల్‌గా సైక్లింగ్‌ ప్రారంభించాలనుకునేవాళ్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇందులో సింగిల్‌-స్పీడ్ గేర్‌ సెటప్‌ ఉంటుంది.

ఈ సైకిల్‌ తయారీలో అల్యూమినియం ఫ్రేమ్‌ ఉపయోగించారు. ఈ ఫ్రేమ్‌ బరువు సుమారు 2.25 కిలోలు. 660 మిల్లీమీటర్ల వెడల్పైన హ్యాండిల్‌బార్‌ ఉంటుంది. దీంతో రైడింగ్‌ సమయంలో మంచి కంట్రోల్‌ ఉంటుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఉపయోగించుకునే టైర్లను ఈ సైకిల్‌కు బిగించారు. రైడర్ల అవసరాన్ని బట్టి హై ఫ్రేమ్ & లో ఫ్రేమ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రెండు చక్రాలకు కాలిపర్ బ్రేక్‌లు ఇచ్చారు. వీటి నిర్వహణ కూడా సులభమే.

ఇది కూడా చదవండి: యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!

కంఫర్ట్‌పై ఫోకస్ చేసిన EXPL 20

EXPL 20 మోడల్‌ మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇందులో స్టీల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. మెకానికల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. EXPL 10 తరహాలోనే 660 మిల్లీమీటర్ల వెడల్పైన హ్యాండిల్‌బార్‌ ఉంటుంది. అయితే ఇందులో మెరుగైన ప్యాడింగ్‌తో కంఫర్ట్ గ్రిప్స్‌ ఇచ్చారు.

ఇంటర్నల్ కేబుల్ రూటింగ్‌ ఉండటం ఈ సైకిల్‌కు మరో ప్రత్యేకత. ఫోర్క్ డిజైన్‌ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. వెడల్పైన స్యాడిల్‌తో పాటు, ISO పరీక్షలకు తట్టుకుని నిలబడిన విడిభాగాలను ఇందులో ఉపయోగించారు. రోజువారీ ఫిట్‌నెస్ రైడింగ్‌ & తేలికపాటి ట్రైల్స్‌కు ఇది సరైన ఎంపికగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?

ఆఫ్‌రోడ్ రైడింగ్‌ కోసం EXPL 140

ఈ మూడు మోడళ్లలో EXPL 140 అనేది టాప్‌ మోడల్‌. దీని ధర రూ.49,999. భారత్‌లో తయారైన డెకాథ్లాన్ తొలి 29-ఇంచ్ మౌంటెన్ బైక్‌గా ఇది నిలిచింది. ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌పై రైడింగ్‌ చేయాలనుకునే వారి కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.

EXPL 140లో పూర్తి అల్యూమినియం హార్డ్‌టెయిల్ ఫ్రేమ్ ఉంటుంది. 100 మిల్లీమీటర్ల ట్రావెల్‌తో హైడ్రాలిక్ సస్పెన్షన్‌ అందించారు. గేర్ల విషయానికి వస్తే 10-స్పీడ్ షిమనో CUES డెరైలర్‌ ఉంది. ట్రిగ్గర్ షిఫ్టర్లు ఉండటంతో గేర్లను సులభంగా మార్చుకోవచ్చు. డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే.. సిటీ రైడింగ్‌ కోసం EXPL 10, కంఫర్ట్ & ఫిట్‌నెస్ రైడింగ్‌ కోసం EXPL 20, కొండలు & మట్టిదారుల్లో సాహసాల కోసం EXPL 140ను ఎంచుకోవచ్చు.

భారత్‌లో తయారీకి డెకాథ్లాన్ ప్రాధాన్యం

భారత్‌లో డెకాథ్లాన్ తయారీ ప్రయాణం 26 ఏళ్ల క్రితమే ప్రారంభమైందని కంపెనీ తెలిపింది. మొదట సైకిల్ భాగాల ఎగుమతులతో ఇది మొదలైంది. ప్రస్తుతం భారత్‌లో విక్రయించే డెకాథ్లాన్ సైకిళ్లలో 97 శాతానికి పైగా స్థానికంగా తయారవుతున్నాయని కంపెనీ వెల్లడించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
రూ.1.27 లక్షలకే Hero Xtreme 160R 4V అప్‌డేటెడ్‌ వెర్షన్‌.. కొత్త డిజైన్, మూడు వేరియంట్లు, పవర్‌ఫుల్ ఫీచర్లు!
కొత్త లుక్‌లో Hero Xtreme 160R 4V లాంచ్‌.. క్రూయిజ్ కంట్రోల్, TFT డిస్‌ప్లేతో నయా అప్‌డేట్స్
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget