రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంత పడుతుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గోర్ఖా ఆన్-రోడ్ ధర, కనీస డౌన్‌పేమెంట్ వివరాలు. నెలవారీ EMI ఎంత పడుతుందో ఇప్పుడే తెలుసుకోండి!

Royal Enfield Classic 350 Down Payment, EMI Details: మన రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మేనియా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా, ప్రతి ఒక్కరి కలల బైక్‌గా ఇది నిలిచింది. ఈ కంపెనీ, ఇటీవల గోర్ఖా / సిగ్నల్స్ లేదా హెరిటేజ్ ఎడిషన్లను లాంచ్ చేసింది. మీరు కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్‌గా మారాలని ఉన్నా, మీ దగ్గరున్న డబ్బు సరిపోదా?. మీ దగ్గర పెద్ద మొత్తంలో క్యాష్ లేకపోయినా, అతి తక్కువ డౌన్‌పేమెంట్ చెల్లించి, జేబుకు భారం కాని EMI ఆప్షన్‌తో ఈ డ్రీమ్ బైక్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350: ఇంజిన్ పెర్ఫార్మెన్స్ & ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌లో అత్యంత పవర్‌ఫుల్ 349cc జె-సిరీస్ సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 20.2bhp పవర్‌ను, 27Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, లాంగ్ రైడ్స్‌లో అద్భుతమైన స్టెబిలిటీని, సిటీ ట్రాఫిక్‌లో సాఫీగా సాగే రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
ఈ బైక్‌లో డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LCD డిస్‌ప్లే, ఫ్యూయల్ గేజ్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. రైడర్ సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ABS, డిస్క్ బ్రేకుల సెటప్‌ను అందించారు. లీటరుకు సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీని ఈ మోటర్‌సైకిల్ ఇస్తుంది.
ఇది కూడా చదవండి: రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
గోర్ఖా ఎడిషన్ / సిగ్నల్స్ వేరియంట్: అసలు ధర ఎంత?
మార్కెట్‌లో వివిధ నగరాలను బట్టి RTO రుసుములు, ఇన్సూరెన్స్ ఛార్జీలలో స్వల్ప మార్పులు ఉంటాయి. క్లాసిక్ 350 సిరీస్‌లో గోర్ఖా / సిగ్నల్స్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2,00,000/- నుంచి ప్రారంభమవుతుంది. అన్ని పన్నులు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కలిపి దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 2,49,816/- వరకు ఉంటుంది.
కనీస డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించాలి?
ఫైనాన్స్ స్కీమ్‌లో బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఆన్-రోడ్ ధరలో కొంత మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక ఫైనాన్స్ భాగస్వాములు & వివిధ బ్యాంకుల ఆఫర్ల ప్రకారం, క్లాసిక్ 350 గోర్ఖా / సిగ్నల్స్ వేరియంట్‌పై కనీస డౌన్‌పేమెంట్ రూ. 12,491/- నుంచి ప్రారంభమవుతుంది.
ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ అద్భుతంగా ఉంటే, కొన్ని ఫైనాన్స్ సంస్థలు రూ. 22,000/- డౌన్‌పేమెంట్‌తో కూడా లోన్ మంజూరు చేస్తాయి.
ఇది కూడా చదవండి: 8 స్పీడ్ AT నుంచి సీట్ మసాజర్ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్ ఇవే
EMI ఆప్షన్లు & బ్యాంక్ వడ్డీ రేట్ల లెక్కలు
ఒకవేళ మీరు రూ. 12,491/- కనీస డౌన్‌పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.2,37,325/- మొత్తాన్ని లోన్ రూపంలో పొందుతారు. బ్యాంకులు సాధారణంగా 9.7% నుంచి 10% వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. మీరు 10% వడ్డీ రేటుతో లోన్ తీసుకున్నారని అనుకుంటే, మీరు ఎంచుకునే టెన్యూర్‌ను బట్టి EMI లెక్క మారుతుంది.
3 సంవత్సరాల కాలపరిమితి (36 నెలలు)
రుణ మొత్తం: రూ. 2,37,325/-
వడ్డీ రేటు: 10% p.a.
నెలవారీ EMI: రూ. 8,570/-
4 సంవత్సరాల కాలపరిమితి (48 నెలలు)
రుణ మొత్తం: రూ. 2,37,325/-
వడ్డీ రేటు: 10% p.a.
నెలవారీ EMI: రూ. 6,800/-
5 సంవత్సరాల కాలపరిమితి (60 నెలలు)
రుణ మొత్తం: రూ. 2,37,325/-
వడ్డీ రేటు: 10% p.a.
నెలవారీ EMI: రూ. 5,700/-
గమనిక: పైన పేర్కొన్న ఆన్-రోడ్ ధరలు, EMI అంచనాలను తెలుగు రాష్ట్రాల్లోని తాజా మార్కెట్ సగటు గణాంకాల ఆధారంగా ఇచ్చాము. స్థానిక షోరూమ్ విధానాలు, సిబిల్ స్కోర్‌ను బట్టి వీటిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















