అన్వేషించండి

8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త 8 స్పీడ్‌ AT, సీటు మసాజర్‌, 360 డిగ్రీ కెమెరా, AI అసిస్టెంట్‌, కొత్త లైటింగ్‌ వంటి 7 మార్పులు వచ్చాయి.

2026 Skoda Slavia Facelift Details In Telugu: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ భారత మార్కెట్‌లోకి వచ్చింది. 2021లో సెడాన్‌ మోడల్‌గా స్లావియా వచ్చిన తర్వాత, ఇదే తొలి ఫేస్‌లిఫ్ట్‌. కొత్త మోడల్‌లో డిజైన్‌తో పాటు సౌకర్యం, సాంకేతికత & డ్రైవింగ్‌ అనుభవానికి సంబంధించిన కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా కొత్త ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త స్లావియాలో వచ్చిన 7 ప్రధాన మార్పులు

1. 1.0 TSIకి కొత్త 8 స్పీడ్‌ AT

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో 115 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కొనసాగుతోంది. 150 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే 1.0 TSIకి ఇప్పుడు కొత్త 8 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ATను ఇచ్చారు. పాత మోడల్‌లో 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ఉండేది. 1.0 TSIతో 5 స్పీడ్‌ మాన్యువల్‌ కూడా ఉంటుంది. 1.5 TSI మాత్రం 7 స్పీడ్‌ DCTతో మాత్రమే లభిస్తుంది.

2. వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌

కొత్త స్లావియాలో వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌ వచ్చింది. ఈ సదుపాయం దాని విభాగంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. స్కోడా కుషాక్‌ నుంచి ఈ ఫీచర్‌ను స్లావియాకు తీసుకొచ్చారు. అయితే ఇది అన్ని వేరియంట్లలో ఉండదు. టాప్‌ స్పెక్‌ ప్రెస్టీజ్‌ & మాంటే కార్లో వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

3. పెద్ద డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే

పాత స్లావియాలో ఉన్న 8 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే స్థానంలో కొత్తగా 10.25 అంగుళాల యూనిట్‌ను ఇచ్చారు. ఇందులో స్పీడోమీటర్‌, టాకోమీటర్‌ సమాచారంతో పాటు టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ కూడా చూడొచ్చు. అయితే ఈ పెద్ద డిస్‌ప్లే ప్రెస్టీజ్‌ & మాంటే కార్లో వేరియంట్లకే పరిమితం. సిగ్నేచర్‌, స్పోర్ట్‌లైన్‌లో 8 అంగుళాల డిస్‌ప్లే కొనసాగుతుంది. క్లాసిక్‌, క్లాసిక్‌ ప్లస్‌లో అనలాగ్‌ మీటర్లు & MID ఉంటాయి.

ఇది కూడా చదవండి: మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?

4. 360 డిగ్రీ కెమెరా, ముందు పార్కింగ్‌ సెన్సార్లు

పార్కింగ్‌ సమయంలో మరింత సౌకర్యంగా ఉండేందుకు కొత్త స్లావియాలో 360 డిగ్రీ కెమెరాను అందించారు. దీనికి అదనంగా ముందు పార్కింగ్‌ సెన్సార్లు కూడా వచ్చాయి. వెనుక పార్కింగ్‌ సెన్సార్లు ఇప్పటికే ఉన్నాయి. అయితే 360 డిగ్రీ కెమెరా & ముందు సెన్సార్లు ఏ వేరియంట్లలో లభిస్తాయో స్కోడా ఇంకా వెల్లడించలేదు.

5. ఏసీ పనితీరులో మెరుగుదల

పాత స్లావియాపై వచ్చిన ప్రధాన విమర్శల్లో ఏసీ పనితీరు ఒకటి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఫేస్‌లిఫ్ట్‌లో కీలక మార్పు చేశారు. పాత మోడల్‌లోని ఫిక్స్‌డ్‌ జామెట్రీ ఏసీ కంప్రెసర్‌ స్థానంలో కొత్త వేరియబుల్‌ జామెట్రీ కంప్రెసర్‌ను ఉపయోగించారు. దీంతో క్యాబిన్‌ను వేగంగా చల్లబరచడంతో పాటు క్లైమేట్‌ కంట్రోల్‌ పనితీరు మెరుగుపడుతుందని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?

6. గూగుల్‌ క్లౌడ్‌ ఆధారిత AI అసిస్టెంట్‌

స్లావియాలోని 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ సైజ్‌ మాత్రం మారలేదు. అయితే ఇందులో కొత్త యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ & AI అసిస్టెంట్‌ను అందించారు. గూగుల్‌ క్లౌడ్‌ ఆటోమోటివ్‌ AI ఏజెంట్‌ ఆధారంగా ఈ సదుపాయం పనిచేస్తుంది. భారతీయ ఇంగ్లీష్‌ ఉచ్చారణలను గుర్తించేలా దీనిని అభివృద్ధి చేసినట్లు స్కోడా తెలిపింది. వాయిస్‌ కమాండ్ల ద్వారా సమాచారం తెలుసుకోవడంతో పాటు మ్యూజిక్‌, కాల్స్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి వాటిని చేతులు ఉపయోగించకుండా నియంత్రించవచ్చు.

7. కొత్త లైటింగ్‌ డిజైన్‌

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్‌ మార్పులు కూడా చేశారు. హెడ్‌లైట్‌ హౌసింగ్‌ డిజైన్‌ పెద్దగా మారలేదు. అయితే ఇందులో సెగ్మెంటెడ్‌ LED DRLs ఇచ్చారు. ముందు ఫాగ్‌ ల్యాంప్‌ల డిజైన్‌ను కూడా మార్చారు. అవి ఇప్పుడు పిక్సెల్‌ తరహా ఆకృతిలో కనిపిస్తాయి. వెనుక టెయిల్‌ ల్యాంప్‌ హౌసింగ్‌ పాత మోడల్‌ తరహాలోనే ఉన్నప్పటికీ కొత్త LED లైటింగ్‌ ఎలిమెంట్లను ఇచ్చారు. దీంతో కారు వెనుక భాగం మరింత ఆధునికంగా కనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే.. 2026 స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో భారీ డిజైన్‌ మార్పుల కంటే ఫీచర్లు, సౌకర్యం & టెక్నాలజీపై స్కోడా ఎక్కువ దృష్టి పెట్టింది. కొత్త 8 స్పీడ్‌ AT, వెనుక సీటు మసాజ్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా & AI అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు కొత్త మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget