అన్వేషించండి

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి

Mahindra XEV 9S 6 Seater: మహీంద్రా XEV 9S కొత్త 6 సీటర్ వెర్షన్ సీట్లతో వచ్చింది. ఈ కారులో అనేక ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. రూ.1.5 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి 6 సీటర్ కారు సొంతం చేసుకోండి.

Mahindra XEV 9S 6 Seater: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. కొత్తగా లాంచ్ అయిన కారు తీసుకోవాలని కరెక్ట్ టైమ్ కోసం వేచి చూస్తున్నారా? అయితే మీకోసమే ఓ కారు లాంచ్ అయింది. మహీంద్రా తన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ XEV 9S కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త కార్‌లో 6 సీట్ల ఆప్షన్ ఇచ్చారు. ఇందులో వెనుక సీట్లు కెప్టెన్ సీట్ స్టైల్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్ 7 సీటర్‌తో పాటు 6 సీటర్‌లో కూడా అందుబాటులో ఉంది. ఎక్కువ సౌకర్యం, ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుంది. మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ ధర ఎంత, ప్రత్యేకతలు ఏమిటో పూర్తి సమాచారం తెలుసుకుందాం.

కొత్త 6 సీటర్ XEV 9S స్పెషాలిటీ ఏంటీ.. 
 మహీంద్రా XEV 9S కేవలం 7 సీటర్‌గా మాత్రమే లభిస్తోంది.  ఇందులో మధ్య సీటు బెంచ్ టైప్‌లో వచ్చేది. కంపెనీ ఇందులో 6 సీటర్ లేఅవుట్‌ను యాడ్ చేసింది. ఈ కొత్త లేఅవుట్‌లో రెండవ వరుసలో బెంచ్ సీటుకి బదులుగా 2 వేర్వేరు కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఈ సీట్లలో ప్రత్యేక ఆర్మ్‌రెస్ట్‌లు ఇవ్వడంతో మధ్యలో కూర్చునే ఇద్దరు వ్యక్తులకు కంఫర్ట‌బుల్‌గా ఉంటుంది. లాంగ్ జర్నీ ప్రయాణాలు కంఫర్టబుల్‌గా చేయాలనుకునే కుటుంబాలకు ఈ లేఅవుట్ సెట్ అవుతుంది. ఈ 6 సీటర్ ఆప్షన్ కారును మరింత ప్రీమియంగా చేస్తుంది. స్పేస్ కంటే కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారిని ఆకట్టుకుంటుంది.

ఈ 6 సీటర్ కెప్టెన్ సీట్ ఆప్షన్ అన్ని వేరియంట్లలో ఉండదని గ్రహించాలి. కంపెనీ దీనిని Pack Two Above, Pack Three, Pack Three Above వంటి 3 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. బేసిక్ వేరియంట్ Pack One Above లో ఈ ఆప్షన్ లేదు. మహీంద్రా XEV 9S ని నవంబర్ 2025 లో మొదటిసారి లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. గడిచిన నెలలోనే ఈ కారు 4,131 యూనిట్లు అమ్ముడుపోయాయి. 

వీటి ధర ఎంత, వేటితో పోటీ?
ఇప్పుడు దీని ధర విషయానికి వస్తే, హైదరాబాద్‌లో మహీంద్రా XEV 9S బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త 6 సీటర్ కెప్టెన్ సీట్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 25.25 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 6 సీటర్ ఆప్షన్ ధర అదే వేరియంట్ 7 సీటర్ వెర్షన్ కంటే కేవలం రూ. 25,000 మాత్రమే ఎక్కువ. కొంత మొత్తం ఎక్కువ చెల్లిస్తే కస్టమర్లకు కెప్టెన్ సీట్ వంటి ప్రీమియం ఫీచర్ లభిస్తుంది. ఈ ధరలో 11.2 kW AC ఛార్జర్ ధర చేర్చలేదు. అది విడిగా యాడ్ అవుతుంది.

డౌన్‌పేమెంట్ చేసి కారు తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి..

ఒకేసారి మొత్తం ధర చెల్లించి కొనలేని వారు రూ.1.5 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే కనుక మిగతాది లోన్ తీసుకుని చెల్లించాలని కంపెనీ ప్రతినిధి తెలిపారు.  21,86,483 మొత్తంలో మీరు కనుక రూ.1.5 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. రూ.20,35,000 లోన్ తీసుకోవాలి. 5 ఏళ్ల కాలానికి 9 శాతం వడ్డీతో ప్రతినెలా EMI రూ.42,243 చెల్లించాలి. 5 ఏళ్లలో చెల్లించే వడ్డీ నగదు రూ.5 లక్షలు అవుతుంది. ఒకవేళ 6 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI రూ.36,681 చెల్లిస్తుంది. 7 ఏళ్ల కాలపరిమితికిగానూ కార్ లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI రూ. 32,741 చెల్లించాల్సి ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget