అన్వేషించండి

టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!

టాటా మోటార్స్‌ సెప్టెంబర్‌ 1 నుంచి ఎంపిక చేసిన కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచనుంది. ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వ్యయాల పెరుగుదలే ప్రధాన కారణాలుగా చెబుతోంది.

Tata cars price hike: దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌, కన కస్టమర్లకు షాకిచ్చింది. మారుతి సుజుకి & హ్యుందాయ్‌ ఇప్పటికే ధరల పెంపును ప్రకటించగా.. ఇప్పుడు అదే బాటలో టాటా మోటార్స్‌ కూడా నడిచింది. సెప్టెంబర్‌ 1, 2026 నుంచి కొన్ని మోడళ్ల రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.

టాటా కార్ల ధరలు గరిష్ఠంగా రూ.25,000 వరకు పెరగనున్నాయి. అయితే ప్రతి మోడల్‌పై ఒకే స్థాయిలో ధరల పెంపు ఉండదు. ఏ మోడల్‌ ‌ధర ఎంత పెరుగుతుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు & ఉత్పత్తి వ్యయాల పెరుగుదలను ధరల పెంపునకు ప్రధాన కారణాలుగా టాటా మోటార్స్‌ పేర్కొంది. పెరుగుతున్న వ్యయాలను కొంతకాలంగా కంపెనీయే భరిస్తూ వస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో కీలకమైన బ్యాటరీల ధరలు కూడా పెరిగాయి. గత కొన్ని నెలల్లో బ్యాటరీల తయారీ వ్యయం దాదాపు 10 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఎలక్ట్రిక్‌ కార్ల ధరలపై కూడా ఒత్తిడి పెరిగింది.

విదేశీ మారకపు విలువల్లో మార్పులు కూడా టాటా మోటార్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగ వలసల ఖర్చులు కూడా పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచాలని టాటా మోటార్స్‌ నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: 8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే

ఈ ధరల పెంపు టాటా మోటార్స్‌ విక్రయిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ కార్లతో పాటు EV మోడళ్లపైనా ప్రభావం చూపనుంది. దాదాపుగా అన్ని మోడళ్ల SUVల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఆగస్టు 21, 2026 నాటికి ఉన్న ధరలు ఇవి:

మోడల్‌
ధర (రూ.లక్షల్లో)
Tiago
 
4.70-8.55
Tiago EV
 
6.99-9.99
Tigor
 
5.55-8.84
Tigor EV
 
12.49-13.75
Altroz
 
6.30-10.77
Punch
 
5.70-10.67
Punch EV
 
9.69-12.79
Nexon
 
7.40-14.10
Nexon EV
 
12.49-17.49
Curvv
 
9.76-18.96
Curvv EV
 
16.99-21.99
Sierra
 
11.49-21.29
Sierra EV
 
18.79-25.99
Harrier
 
13.00-25.40
Harrier EV
 
21.69-29.19
Safari
 
13.40-26.15

ఇది కూడా చదవండి: మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!

కారు కొనాలని భావిస్తున్నవాళ్లు సెప్టెంబర్‌ ధరల పెంపును దృష్టిలో పెట్టుకోవాలి. ధరలు పెరగకముందే బుక్‌ చేసుకుంటే కొంత మొత్తాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుంది. తుది ధరలు మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget