అన్వేషించండి

చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ తొలి డ్రైవ్ వివరాలు ఇవే. 550hp పవర్, 850Nm టార్క్, 531km రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ SUV ప్రత్యేకతలు తెలుసుకోండి.

Range Rover Sport Electric Price, Range And Features Telugu: రేంజ్ రోవర్ స్పోర్ట్ పేరు చెప్పగానే విలాసవంతమైన డిజైన్, అద్భుతమైన రైడ్ క్వాలిటీ, ఆఫ్‌రోడ్ సామర్థ్యం గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఈ SUVలోకి ఎలక్ట్రిక్ టెక్నాలజీ కూడా వచ్చేసింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ EVని సెప్టెంబర్‌లో ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయనున్నారు. భారత్‌లోకి ఇది 2027 మార్చి సమయంలో వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV చూడటానికి దాదాపు ప్రస్తుత రేంజ్ రోవర్ స్పోర్ట్‌లాగే ఉంటుంది, ఇదే దీని ప్రత్యేకత. ప్రస్తుత డిజైన్‌ను మార్చొద్దని కస్టమర్లు కోరడంతో ల్యాండ్ రోవర్ పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, లోపల మాత్రం భారీగా మార్పులు జరిగాయి.

కొత్త 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్, 118.5kWh బ్యాటరీ, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఇందులో ఉన్నాయి. ప్రతి మోటార్ 326hp పవర్‌ను అందిస్తుంది. మొత్తంగా 550hp పవర్, 850Nm టార్క్ లభిస్తాయి. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ల్యాండ్ రోవర్ సొంతంగా మోటార్లను రూపొందించింది. ఆఫ్‌రోడ్ డ్రైవింగ్‌లో టార్క్‌ను అత్యంత ఖచ్చితంగా నియంత్రించడమే దీనికి కారణం.

గుడ్‌వుడ్‌లో నిర్వహించిన తొలి డ్రైవ్‌లో ఈ SUV అసలు పవర్‌ తెలిసొచ్చింది. మొదటగా ఆకట్టుకునేది నిశ్శబ్దం. ఎలక్ట్రిక్ మోటార్ల కారణంగా ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తారురోడ్డుపై మాత్రమే కాదు.. గ్రావెల్ రోడ్డుపై కూడా రైడ్ క్వాలిటీ అద్భుతంగా అనిపించింది.

లాంచ్ కంట్రోల్‌ను ఉపయోగించగానే ఈ భారీ SUV ఒక్కసారిగా దూసుకెళ్లింది. వేగం పెరిగే తీరు కూడా చాలా బలంగా ఉంటుంది. అయితే పవర్ డెలివరీ నియంత్రణలోనే ఉంటుంది. ప్రోటోటైప్‌లో బ్రేక్ పెడల్ కొద్దిగా షార్ప్‌గా అనిపించింది. అయితే, ఫైనల్‌ మోడల్‌లో దీనిని సరిచేస్తామని కంపెనీ ఇంజినీర్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV

ఆఫ్‌రోడ్ కెపాసిటీ విషయంలోనూ ఈ ఎలక్ట్రిక్ రేంజ్ రోవర్‌ దూకుడు ఏ మాత్రం తగ్గదు. టెస్టింగ్‌ టైమ్‌లో... మెట్లు ఎక్కించారు, గ్రావెల్ ట్రాక్‌లపై నడిపించారు, ఎయిర్‌బస్ విమానం ఫ్యూజ్‌లేజ్‌ లోపల కూడా నడిపించారు. ఇవన్నీ కేవలం వినోదం కోసం చేసిన పరీక్షలు కావు. ఎలక్ట్రిక్ డ్రైవ్ వ్యవస్థ ఆఫ్‌రోడ్‌లో ఎంత సమర్థంగా పనిచేస్తుందో చూపించడమే లక్ష్యం.

ఎలక్ట్రిక్ మోటార్లు సున్నా RPM నుంచే టార్క్‌ను అందిస్తాయి. దీంతో కఠినమైన అడ్డంకులను సులభంగా అధిగమించవచ్చు. ప్రతి మోటార్‌కు ఎంత పవర్ పంపాలో ఎలక్ట్రానిక్స్ చాలా ఖచ్చితంగా నియంత్రిస్తుంది. దీంతో లాకింగ్ డిఫరెన్షియల్స్, లో-రేంజ్ గేర్‌బాక్స్ వంటి సంప్రదాయ వ్యవస్థల అవసరం తగ్గుతుంది.

ఈ SUV బరువు దాదాపు 2.8 టన్నులు. అయినప్పటికీ మలుపుల్లో స్థిరంగా ఉంటుంది. దీని గురుత్వ కేంద్రం సాధారణ పెట్రోల్, డీజిల్ రేంజ్ రోవర్ స్పోర్ట్ కంటే 73mm తక్కువగా ఉంది. అందుకే మలుపుల్లో బాడీ కదలిక కూడా నియంత్రణలో ఉంటుంది.

ఇది కూడా చదవండి: టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!

ఒకసారి ఫుల్‌గా ఛార్జ్‌ చేస్తే ఈ కారు 531km వరకు ప్రయాణం చేయగలదని కంపెనీ చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితుల్లో ఈ సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. భారీ బాడీ, పెద్ద సైజు కారణంగా, వేగంగా నడిపితే రేంజ్ మరింత తగ్గవచ్చు. ఫ్రంక్ లేకపోవడం, ఏడు సీట్ల ఆప్షన్ లేకపోవడం కూడా కొందరికి మైనస్‌గా అనిపించవచ్చు.

ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే భారత్‌లో స్థానికంగా తయారయ్యే ఇంధన వెర్షన్ల కంటే ఇది కాస్త ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget