అన్వేషించండి

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV

BMW భారత్‌లో అసెంబుల్ చేసిన కొత్త i5 LWB ఎలక్ట్రిక్ సెడాన్‌ మార్కెట్లోకి రాబోతోంది. దాదాపు 669 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌తో తక్కువ ధరలో అద్భుతమైన కారు అని చెప్పవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BMW భారత మార్కెట్‌కు విశాలమైన i5 LWB EVని తెస్తోంది.
  • చెన్నై ప్లాంట్‌లో అసెంబ్లీ ద్వారా ధర తగ్గి, పోటీ పెరుగుతుంది.
  • ఈ మోడల్ 669 కి.మీ రేంజ్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగివుంది.
  • కొత్త BMW X1 LWB పెట్రోల్ మోడల్ కూడా విడుదలైంది.

 BMW i5 lwb Electric Cars | లగ్జరీ వెహికల్స్ తయారు చేసే BMW భారత్‌లో పట్టు సాధించేందుకు సిద్ధమవుతోంది. భారత వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా బీఎండబ్ల్యూ కంపెనీ ఇప్పుడు తన మోడళ్లను మరింత విశాలంగా, రీజనబుల్ ధరలో ఉండేలా తీసుకురావాలని చూస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా BMW తన ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్ i5 లాంగ్ వీల్‌బేస్ వెర్షన్‌ను ఆవిష్కరించింది.

ఈ కార్‌ అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే, CBUకి బదులుగా నేరుగా చెన్నై ప్లాంట్‌లోనే అసెంబుల్ చేయనున్నారు. దేశంలోనే అసెంబ్లీంగ్ చేయడం ద్వారా ఖర్చు భారీగా తగ్గుతుంది. దీంతో BMW కంపెనీ దీని ధరను తగ్గించుకుని, ఇతర లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారత మార్కెట్‌లో అసెంబుల్ కానున్న BMW రెండో ఎలక్ట్రిక్ కార్‌గా మారనుంది. ఇది లగ్జరీ EV సెగ్మెంట్‌లో సంలచనాలకు కారణం కావొచ్చు. 

669 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్

కొత్త BMW i5 LWBలో కంపెనీ 81.6 kWh కెపాసిటీ గల పెద్ద, పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తుంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ సెటప్‌తో వచ్చే ఈ సెడాన్ ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే దాదాపు 669 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుందని కంపెనీ పేర్కొంది. లాంగ్ రేంజ్ ఇవ్వడంతో వాహనదారులు పదే పదే ఛార్జింగ్ స్టేషన్ కోసం వెతకాల్సిన పనిలేదు. బీఎండబ్ల్యూ కంపెనీ ఇందులో రియర్ యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్ ఫీచర్‌ను కూడా చేర్చింది. ఇది భారత రోడ్లలోని గుంతలు, గతుకుల మార్గాలలో ఇబ్బంది లేకుండా వెళ్తుంది. భారత రోడ్లపై ఎదురయ్యే  సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ కార్‌ గ్రౌండ్ క్లియరెన్స్‌ను గతంతో పోలిస్తే కొద్దిగా పెంచారు.

Also Read: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?


ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV

ధర ఎంత ఉండొచ్చు

పాత ఇంపోర్టెడ్ స్టాండర్డ్ వీల్‌బేస్ వెర్షన్‌తో పోలిస్తే ఈ కొత్త లాంగ్ వీల్‌బేస్ మోడల్‌లో వెనుక కూర్చునే ప్రయాణికులకు ఎక్కువ నీ-రూమ్, లెగ్‌రూమ్‌ను ఇచ్చారు. కేబిన్‌లో లభించే లగ్జరీ ఫీల్, కంఫర్ట్ స్థాయి దీన్ని బిజినెస్ క్లాస్ రైడ్‌గా మారుస్తాయి. భారత్‌లోనే అసెంబుల్‌ అయ్యే మోడల్ ధర 1 కోటి రూపాయల లోపే ఉంటుందని భావిస్తున్నారు. గతంతో పోలిస్తే వినియోగదారులు తక్కువ ధరలోనే మరింత స్పేస్, ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ రేంజ్‌ను ఆస్వాదిస్తారు. ఈ కార్ మార్కెట్‌లో పెట్రోల్- డీజిల్ LWB మోడళ్లతో పాటు విక్రయాలు జరుపుకుంటుంది. 

 హవా కొనసాగిస్తున్న BMW X1 LWB

ఎలక్ట్రిక్ సెడాన్‌తో పాటు BMW భారత ఆటో మార్కెట్‌లో తన ఎంట్రీ-లెవల్ SUV X1 లో LWB పెట్రోల్ మోడల్‌ను రూ. 49.90 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇవ్వగా, ఇది 156 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ కాంపాక్ట్ SUV వీల్‌బేస్‌ను 108mm పెంచారు. దీని రియర్ సీట్ స్పేస్ గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. తన సెగ్మెంట్‌లో X1 LWB ఇంత పొడవైన వీల్‌బేస్, ప్రీమియం కేబిన్ స్పేస్‌తో వినియోగదారులను ఆకర్షిస్తుంది. 

 

Frequently Asked Questions

BMW i5 LWB భారతదేశంలో ఎందుకు తక్కువ ధరకు లభిస్తుంది?

ఈ కారు CBU దిగుమతికి బదులుగా నేరుగా చెన్నై ప్లాంట్‌లోనే అసెంబుల్ చేయబడుతుంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గి, వినియోగదారులకు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుంది.

కొత్త BMW i5 LWB ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించగలదు?

కొత్త BMW i5 LWB 81.6 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 669 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా BMW i5 LWBలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి?

ఈ కారులో రియర్ యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్ ఫీచర్ ఉంది. భారత రోడ్లపై ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పెంచారు.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త i5 LWB లోపలి భాగంలో ఎలాంటి మార్పులు జరిగాయి?

కొత్త లాంగ్ వీల్‌బేస్ మోడల్‌లో వెనుక కూర్చునే ప్రయాణికులకు ఎక్కువ నీ-రూమ్, లెగ్‌రూమ్‌ను ఇచ్చారు. ఇది క్యాబిన్‌లో మరింత విశాలమైన, విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget