Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
Morning Infused Waters : ఎప్పుడూ నీరసంగా ఉండడం, గొంతులో నొప్పి, జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? అయితే మీరు కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగితే ఉపశమనం పొందవచ్చు. అవి ఏంటో.. వాటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

- నిపుణుల సలహా మేరకు ఆరోగ్యానికి సహజ పానీయాలు ప్రయత్నించండి.
- అసిడిటీకి ధనియాల నీరు, బలహీనతకు ఎండుద్రాక్ష నీరు తాగండి.
- నోటి దుర్వాసనకు సోంపు, గొంతు నొప్పికీ లవంగాలు ఉపశమనం.
- ఇవి తాత్కాలిక ఉపశమనం, తీవ్ర సమస్యలకు వైద్యుని సంప్రదించండి.
Coriander to Clove Water : రోజూ ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీ తాగే అలవాటు ఉందా? వాటికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని సహజ పానీయాలు ట్రై చేయండి. ఇప్పటికే చాలామంది నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, నిమ్మరసం, అల్లరసం అంటూ తదితర హెల్తీ డ్రింక్స్ ఆరోగ్యం కోసం తీసుకుంటూ ఉంటారు. అయితే జీర్ణ సమస్యలు, నోటిదుర్వాసన, నీరసం, గొంతు ఇబ్బందులు ఉన్నవారు ఎలాంటి నీళ్లు(ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్) తాగాలో ఇప్పుడు చూసేద్దాం.
పోషకాహార నిపుణులు శ్వేతా షా ప్రకారం.. కొన్ని ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తాయి. ధనియాలు, నల్ల ఎండుద్రాక్ష, సోంపు, లవంగాలతో తయారుచేసే నీళ్లను ఇంట్లోనే సులభంగా చేసుకుని తీసుకోవడం వల్ల.. జీర్ణ, నోటి దుర్వాసన, నీరసం, గొంతు ఇబ్బందులు తగ్గుతాయి అంటున్నారు. మరి ఏ సమస్యకు ఏ నీళ్లు తాగాలి? వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
Also Read : వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అసిడిటీ ఉంటే..
తరచూ కడుపులో మంట, అసిడిటీ, జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ధనియాల నీళ్లను ప్రయత్నించవచ్చు. పోషకాహార నిపుణురాలు శ్వేతా షా ప్రకారం.. ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల కడుపునకు చల్లదనం కలుగుతుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ధనియాలు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. అయితే అసిడిటీకి ఇది చికిత్స కాదు. కానీ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలగవచ్చు. తరచూ కడుపులో మంట వస్తుంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
Also Read : ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే..
తరచూ నీరసంగా అనిపించడం, అలసటగా ఉండటం వంటి సమస్యలు ఉంటే శరీరంలో ఐరన్ లోపం ఉందేమో టెస్ట్ చేయించుకోవాలి. ఈ సమయంలో నల్ల ఎండుద్రాక్షను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. వీటిలో కొంత ఐరన్, ఇతర పోషకాలు ఉంటాయి. అయితే ఎండుద్రాక్ష నీళ్లు తాగడం వల్ల హిమోగ్లోబిన్ గణనీయంగా పెరుగుతుందని చెప్పలేము.
రాత్రి 8 నుంచి 10 నల్ల ఎండుద్రాక్షలను ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని తాగి.. నానిన ఎండుద్రాక్షలను కూడా తినాలి. ఐరన్ లోపం ఉన్నవారు వైద్యుల సూచన మేరకు ఐరన్ అధికంగా ఉండే ఆహారం, అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవాలి.
Also Read : ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే
నోటి దుర్వాసన ఉన్నవారు..
కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనికి నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, దంత సమస్యలు, నోరు పొడిబారడం వంటి కారణాలు ఉండవచ్చు. సోంపు గింజలకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. వీటితో తయారుచేసిన నీటిని తాగడం వల్ల నోటికి తాజాగా అనిపించవచ్చు. భోజనం తర్వాత సోంపు నమలడం కూడా కొందరికి నోటి దుర్వాసనను తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. అయితే నోటి దుర్వాసన నిరంతరం ఉంటే దంత వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also Read : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
గొంతు నొప్పితో ఇబ్బంది ఉంటే..
జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు గొంతులో గరగరగా ఉండటం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో గోరువెచ్చని పానీయాలు తాగడం వల్ల గొంతుకు తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనానికి కొన్ని ప్రయోగశాల స్థాయి పరిశోధనల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.
ఓ కప్పు నీటిలో రెండు లవంగాలు వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి. తరువాత వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నా, జ్వరం వచ్చినా వైద్యులను సంప్రదించాలి.
Also Read : జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?
ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
రోజూ మీరు ఈ నాలుగు డ్రింక్స్ తాగాల్సిన అవసరం లేదు. మీకు ఏ సమస్య ఉందో దానికి అనుగుణంగా ఈ నీటిని ఎంచుకోవచ్చు. అలాగే ఈ పానీయాలతో పాటు రోజంతా తగినంత సాధారణ నీటిని కూడా తాగాలి. అలాగే వీటిని తాగడం వల్ల పూర్తిగా సమస్య తగ్గిపోతుందని అనుకోకూడదు. రక్తహీనత, తీవ్రమైన అసిడిటీ, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.
Also Read : నీటిలో బేకింగ్ సోడా వేసుకుని తాగితే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందా? వైరల్ అవుతున్న ఈ ట్రెండ్‌లో నిజమెంత?
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















