అన్వేషించండి

High BP : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ డ్రింక్స్‌ తాగితే BP కంట్రోల్‌కు హెల్ప్ అవుతుందట.. అవేంటంటే?

High Blood Pressure : బీపీ ఉన్నవారు ఆహారంలో భాగంగా రక్తపోటును అదుపు చేసేందుకు కొన్ని డ్రింక్స్ రెగ్యులర్​గా తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏంటో వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఒత్తిడి, నిద్రలేమి, ఉప్పు అధిక రక్తపోటుకు ముఖ్య కారణాలు.
  • నిమ్మ, మందార, గ్రీన్ టీ, దానిమ్మ రసం బీపీ నియంత్రిస్తాయి.
  • జీవనశైలి మార్పులు, మందులతో పాటు ఈ పానీయాలు సహాయం.

High BP Diet : ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామందికి అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు వంటి ఎన్నో కారణాలు బీపీని పెంచేలా చేస్తున్నాయి. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కొందరిలో కనిపించినా.. చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే రక్తపోటు పెరిగి ఉండొచ్చు. అందుకే క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ కూడా బీపీ మేనేజ్‌మెంట్‌లో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని ఫాలో అవుతూ కొన్ని హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే.. బీపీ అదుపులో ఉండేందుకు హెల్ప్ అవ్వవచ్చు. ఆ డ్రింక్స్ ఏంటో.. వాటిని ఎప్పుడు తాగాలో.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. 

Also Read : పిల్లలలో లో బీపీ.. అధిక జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

గోరువెచ్చని నీటితో నిమ్మరసం

ఉదయం నిద్రలేచిన తర్వాత గోరువెచ్చని నీటిలో తాజా నిమ్మరసం కలిపి తాగడం చాలామందికి అలవాటు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలను అందిస్తాయి. అయితే నిమ్మనీరు తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లి బీపీ వెంటనే తగ్గిపోతుంది అనుకోకూడదు. ఉదయాన్నే నీటిని తగినంతగా తీసుకోవడం వల్ల హైడ్రేషన్‌కు సహాయపడుతుంది.

మందార పువ్వులతో టీ 

మందార పువ్వులతో తయారు చేసే హెర్బల్ టీని బీపీ నియంత్రణకు ఉపయోగించే పానీయాల్లో ఒకటిగా చెబుతారు. కొన్ని అధ్యయనాల్లో మందార టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటులో కొంత తగ్గుదల కనిపించినట్లు సూచనలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది కెఫీన్ లేని డ్రింక్ కాబట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు. అయితే ఇది బీపీ మందులకు ప్రత్యామ్నాయం కాదు. 

Also Read : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే

గ్రీన్ టీ

గ్రీన్ టీలోని క్యాటెచిన్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహార విధానంలో భాగంగా గ్రీన్ టీ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాఫీతో పోలిస్తే ఇందులో కెఫీన్ తక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది కాబట్టి కెఫీన్ సెన్సిటివిటీ ఉన్నవారు.. తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అలాగే గ్రీన్ టీని చక్కెర లేదా తేనె ఎక్కువగా కలిపి తాగితే దాని ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. 

దానిమ్మ రసం

దానిమ్మలో పాలీఫెనాల్స్‌, యాంటీఆక్సిడెంట్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. కొన్ని పరిశోధనలు దానిమ్మను లేదా దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటుపై స్వల్ప ప్రయోజనం ఉండొచ్చని సూచిస్తున్నాయి. అయితే దానిమ్మ రసంలో సహజ చక్కెర కూడా ఉంటుంది. అందుకే ప్యాకెట్‌ జ్యూస్‌ కంటే చక్కెర కలపని తాజా దానిమ్మ రసం తీసుకోవడం మంచిది. జ్యూస్ బదులు మొత్తం దానిమ్మ పండును తినడం ద్వారా ఫైబర్ కూడా లభిస్తుంది.

Also Read : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు

BP తగ్గాలంటే..

కేవలం ఈ డ్రింక్స్ తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని అనుకోకూడదు. మీరు నిజంగా బీపీని అదుపులోకి తెచ్చుకోవాలంటే లైఫ్​స్టైల్లో కొన్ని మార్పులు కచ్చితంగా చేయాలి. అదే ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అధిక బరువు ఉంటే క్రమంగా తగ్గించుకోవడం, పొగతాగడం మానేయడం, ఆల్కహాల్‌ తగ్గిచడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని అదుపులో చేసే చిట్కాలు ఫాలో అవ్వడంతో పాటు.. వైద్యుడు సూచించిన బీపీ మందులు రెగ్యులర్​గా వేసుకోవాలి.

Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget