అన్వేషించండి

Cancer Prevention Tips : క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. ఆ తప్పులు చేయకండి

Cancer Risk : క్యాన్సర్ నివారించడానికి స్మోకింగ్ మానేయడం, మందు తగ్గించడం, లైఫ్​స్టైల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఆరోగ్యానికి మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ధూమపానం, మద్యం, రసాయనాలు మానేసి క్యాన్సర్ ప్రమాదం తగ్గించుకోవాలి.
  • పండ్లు, కూరగాయలు, వ్యాయామం, ఒత్తిడి తగ్గింపుతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  • ప్రాసెస్‌ చేసిన ఆహారం, షుగర్ తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించండి.
  • క్యాన్సర్ లక్షణాలు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలి.

Healthy Lifestyle Changes To Reduce Cancer Risk : ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనికి జన్యువులు మాత్రమే కారణం కాదు. రోజువారీ అలవాట్లు, జీవనశైలి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచగలవు లేదా తగ్గించగలవు అని చెప్తున్నారు. మరి క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలిగే కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొగాకు, ధూమపానం

ఊపిరితిత్తులు, నోరు, గొంతు, మూత్రపిండాల క్యాన్సర్లతో సహా అనేక క్యాన్సర్లకు ధూమపానం, పొగాకు వాడకం ప్రధాన కారణంగా పరిగణిస్తారు. అందుకే స్మోకింగ్ చేయడం పూర్తిగా మానేయడమే మంచిది. అలాగే ధూమపానం చేయడమే కాదు.. ఇతరులు తాగే పొగకు గురికావడం వల్ల కూడా అంతే ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. 

Also Read : ఆన్‌లైన్‌లో మెడిసన్స్, రోగాల గురించి తెలుసుకుంటున్నారా? అలసట కూడా క్యాన్సర్ అనేస్తాది జాగ్రత్త

హెల్తీ డైట్

మీరు రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, గ్రీన్ టీ, పసుపు, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ప్రాసెస్ చేసిన ఫుడ్, రెడ్ మీట్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, షుగర్ అధికంగా ఉండే ఆహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

వ్యాయామం 

శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ఫిట్‌నెస్‌కు మాత్రమే కాకుండా క్యాన్సర్ నివారణకు కూడా ముఖ్యం. వ్యాయామం, యోగా చేస్తే మనశ్శాంతి, ఒత్తిడిని తగ్గి.. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. తద్వారా క్యాన్సర్ ప్రమాదం తగ్గవచ్చు. 

Also Read : యువతుల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఎక్కువ, ఇలా గుర్తించండి

డ్రింకింగ్..

మద్యపానం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని పలు పరిశోధనల్లో తేలాయి. అందుకే క్యాన్సర్ నివారణలో భాగంగా మద్యానికి దూరంగా ఉండటం లేదా దాని వినియోగాన్ని తగ్గించుకోవడం ముఖ్యమైన చర్య అని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఒత్తిడి

నిరంతర ఒత్తిడి.. రోగనిరోధక శక్తిని తగ్గించి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ధ్యానం చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, ప్రియమైనవారితో సమయం గడపడం వంటివన్నీ మానసిక బలాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.

Also Read : కడుపు క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు ఇవే.. గ్యాస్, అజీర్ణం, పొట్ట నొప్పితో పాటు మరెన్నో

కెమికల్స్​తో జాగ్రత్త

వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రలలో పెట్టడం, హెయిర్ డైలు, పెయింట్లు, పురుగుమందులకు అధికంగా గురికావడం వంటివి కూడా మానుకోవాలి. ఎందుకంటే వీటిలో క్యాన్సర్‌కు కారణమయ్యే కొన్ని రసాయనాలు ఉంటాయి. 

క్యాన్సర్ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి..

క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు వెంటనే కనిపించవు. కాబట్టి క్రమం తప్పకుండా హెల్త్ టెస్ట్​లు చేయించుకోవడం ముఖ్యం. నిరంతరం అలసటగా ఉండటం, ఆకస్మిక బరువు తగ్గడం, రక్తపు వాంతులు, శరీరంలో గడ్డ, లేదా మానని గాయం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే సమస్యను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభంగా, మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

Also Read : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supplements for Skin and Hair : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Afghani Green Chicken : అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget