అన్వేషించండి

Skipping Breakfast : మహిళలు రోజూ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటోన్న నిపుణులు.. మానేస్తే వచ్చే ప్రధాన సమస్యలు ఇవే

Womens Health : మహిళలు తీసుకునే అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉంటే వచ్చే ఇబ్బందులు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బ్రేక్​ఫాస్ట్​ మానేయడం మహిళల జీవక్రియ, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్లు అస్థిరంగా మారతాయి.
  • పోషకాల లోపం, అధిక ఆకలి బరువు పెరగడానికి దారితీస్తాయి.

Women Shouldnt Skip Breakfast : రోజులో బ్రేక్​ఫాస్ట్​ అనేది అత్యంత ముఖ్యమైన భోజనంగా చెప్తారు నిపుణులు. ముఖ్యంగా మహిళలు కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలని అంటున్నారు. కానీ నేటి బిజీ లైఫ్​లో చాలామంది మహిళలు వివిధ కారణాలతో ఉదయాన్నే తినడం మానేస్తున్నారు. సమయం లేకపోవడం, బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చాలామందికి ఈ అలవాటు సర్వసాధారణం అయిపోయింది. కానీ నిపుణులు చెప్పేదేమిటంటే.. ఎక్కువరోజులు అల్పాహారం తీసుకోకపోతే, శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది కేవలం ఎనర్జీపైనే కాకుండా.. జీవక్రియ, హార్మోన్లు, మొత్తం ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

రక్తంలో షుగర్ స్థాయిల హెచ్చుతగ్గులు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మహిళలు తీసుకునే అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారవచ్చు. దీనివల్ల రోజంతా తీపి పదార్థాలు లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరికలు పెరుగుతాయి. ఇవి బరువు పెరగడానికి, భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం పెరగడానికి దారితీస్తాయి. 

Also Read : HPV వ్యాక్సిన్ పెద్దయ్యాక కాదు.. చిన్న వయసులోనే వేయించాలి.. తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయాలివే

హార్మోనల్ ప్రాబ్లమ్స్

ఇప్పటికే PCOS, థైరాయిడ్ లేదా క్రమరహిత పీరియడ్స్ వంటి సమస్యలు ఉన్న మహిళలకు, క్రమమైన సమయాల్లో ఆహారం తీసుకోవడం మరింత ముఖ్యమని వైద్యులు భావిస్తున్నారు. తరచుగా అల్పాహారం మానేయడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను పెంచి.. ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

పోషకాల లోపం

అల్పాహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. రోజంతా అవసరమయ్యే పోషకాలకు ఆరంభం కూడా. అందుకే బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, అనేక ముఖ్యమైన విటమిన్లను చేర్చుకోవచ్చు. మహిళలు క్రమం తప్పకుండా అల్పాహారం మానేసి.. మిగిలిన సమయంలో సమతుల్య ఆహారం తీసుకోకపోతే.. ఆమె శరీరం పోషకాహార లోపంతో బాధపడవచ్చు.

Also Read : కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం ఎక్కువ? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?

ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్పాహారం మానేయడం వల్ల శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆకలి పెరిగి, అవసరానికి మించి తినే అవకాశం ఉంటుంది. ఇది బరువును అదుపులో ఉంచుకోవడాన్ని కష్టతరం చేస్తుంది.

అందరిపై ఒకే ప్రభావం ఉంటుందా?

ప్రతి వ్యక్తి శారీరక అవసరాలు భిన్నంగా ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. కొంతమంది మహిళలు ఉపవాసం వంటి పద్ధతులను పాటిస్తూ.. కూడా రోజంతా అవసరమైన పోషకాలను పొందుతారు. కాబట్టి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు తగినంత పరిమాణంలో అందించడమే ప్రధాన ఉద్దేశంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read : అబార్షన్ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలంటే..

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget