అన్వేషించండి

Kidney Disease : కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?

Kidney Disease in Men and Women : కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఆడవారికి ఎక్కువా? లేదా మగవారికా? నెఫ్రాలజిస్ట్​లు చెప్తోన్న షాకింగ్ విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వారి మాటాల్లోనే చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మహిళల్లో ఎక్కువ, పురుషుల్లో తీవ్రత ఎక్కువ.
  • హార్మోన్లు, జీవనశైలి, నియంత్రణ లేని బీపీ ప్రధాన కారణాలు.
  • ప్రారంభ లక్షణాలు ఉండవు; రెగ్యులర్ చెకప్‌లు, నియంత్రణలు ముఖ్యం.

Kidney Disease Risk in Men vs Women : కిడ్నీలు మన శరీరంలో ఎన్నో కీలకమైన పనులు చేసే అవయవాలు. రక్తంలోని వ్యర్థాలను వడపోసి బయటకు పంపడం, శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటం వంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. అయితే కిడ్నీలు దెబ్బతింటున్నా ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామందికి సమస్య ఉన్న విషయం ఆలస్యంగా తెలుస్తుంది.

కిడ్నీ వ్యాధులు పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ కనిపిస్తాయి. అయితే కిడ్నీ వ్యాధి ఎక్కువగా ఎవరిలో వస్తుంది? పురుషుల్లోనా? మహిళల్లోనా? అనే డౌట్​కి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు డాక్టర్ ఎ. శశి కిరణ్. హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్స్​లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ శశి కిరణ్ ఈ డౌట్​ స్పందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 

సాధారణంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపించినప్పటికీ.. కిడ్నీ పూర్తిగా పనిచేయకుండా పోయే తీవ్రమైన దశకు చేరుకునే అవకాశం పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది.

Also Read : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్

ఎవరికి ప్రమాదం ఎక్కువంటే..

కిడ్నీ వ్యాధికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మహిళల్లో CKD ఎక్కువగా గుర్తించిన్నప్పటికీ.. పురుషులు తీవ్రమైన కిడ్నీ వైఫల్య దశకు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉండటం షాకింగ్​కి గురిచేస్తోంది. అంటే మహిళలకు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం లేదని కాదు. అలాగే పురుషులకు మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని కూడా కాదని వివరించారు. కానీ వ్యాధి మొదలైన తర్వాత అది ఎంత వేగంగా తీవ్రమవుతుంది అనే విషయంలో పురుషులు ఎక్కువ ప్రమాదంలో ఉండే అవకాశం ఉందని తెలిపారు.

కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్..

కిడ్నీ ఫంక్షన్ బాగా తగ్గిపోయి సాధారణంగా డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలు అవసరమయ్యే దశను కిడ్నీ ఫెయిల్యూర్ లేదా ఎండ్-స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఈ తీవ్రమైన దశలో పురుషుల వాటా ఎక్కువగా కనిపిస్తుందని నెఫ్రాలజిస్టులు చెప్తున్నారు.

కారణాలు ఇవే..

పురుషులు, మహిళల్లో కిడ్నీ వ్యాధి తీవ్రతలో ఈ తేడా ఎందుకు కనిపిస్తుందనే దానికి ఒక్క కారణం లేదు. శరీరంలోని హార్మోన్ల ప్రభావం, వ్యాధి పురోగతి వేగం, జీవనశైలి, రక్తపోటు వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయని డాక్టర్ శశి కిరణ్ తెలిపారు. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ కిడ్నీలకు కొంత రక్షణ కల్పించే అవకాశం ఉంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ కిడ్నీ పనితీరు క్షీణత వేగంగా జరగడంలో పాత్ర పోషించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Also Read : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్

పురుషుల్లో వ్యాధి ముదరడానికి కారణాలు..

కిడ్నీలో నష్టం మొదలైన తర్వాత.. కొంతమంది పురుషుల్లో కిడ్నీ పనితీరు మహిళలతో పోలిస్తే వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు సరిగా నియంత్రణలో లేకపోతే కిడ్నీలపై మరింత ఒత్తిడి పడుతుంది. అందుకే కిడ్నీ సమస్య ఉందని తెలిసిన తర్వాత క్రమం తప్పకుండా టెస్ట్​లు చేయించుకోవడం, డాక్టర్ సూచించిన మందులు తీసుకోవడం ముఖ్యం. 

జీవనశైలిలో తేడాలు 

స్మోకింగ్, అధిక బరువు, రక్తపోటు సరిగా నియంత్రించుకోకపోవడం వంటి అంశాలు కిడ్నీలపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి. అదేవిధంగా అధిక బరువు, బీపీ, రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండటం కూడా కిడ్నీలపై అదనపు భారాన్ని పెంచుతాయి. అలాగే కిడ్నీలకు కొంత నష్టం జరిగినా.. మిగిలిన కిడ్నీ భాగాలు అదనంగా పనిచేసి శరీర అవసరాలను తీరుస్తాయి. అందుకే కిడ్నీ పనితీరు గణనీయంగా తగ్గే వరకు చాలామందికి సమస్య కనిపించదు.

Also Read : మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు

కిడ్నీ సమస్యను సూచించే సంకేతాలు

కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే వ్యాధి ముదిరే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఎప్పుడూ అలసటగా ఉండడం, కాళ్లు, పాదాలు లేదా చీలమండల దగ్గర వాపు, మూత్రం చేసే విధానంలో మార్పులు, రాత్రిపూట తరచుగా మూత్రం రావడం, నిద్రలో ఇబ్బందులు, చర్మం పొడిబారడం, దురద పెట్టడం వంటి లక్షణాలు శరీరం చూపిస్తుంది.

ఇలాంటి లక్షణాలను చాలామంది సాధారణ అలసట, వయసు పెరగడం, నీళ్లు ఎక్కువగా తాగడం లేదా ఇతర చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ లక్షణాలు పదేపదే కనిపిస్తుంటే వైద్యుడిని సంప్రదించి టెస్ట్​లు చేయించకోవడం మంచిది.

Also Read : కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందే కనిపించే లక్షణాలు ఇవే.. ఈ వార్నింగ్ సిగ్నల్స్ లైట్ తీసుకోకండి

మహిళలు, పురుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మహిళల్లో CKD ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం లేదా కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర ఉన్నవారు వైద్యుల సలహా మేరకు రెగ్యులర్‌గా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ వ్యాధి లక్షణాలు లేవంటే సమస్య లేదని అర్థం కాదని గుర్తించుకోవాలి. పురుషుల్లో కిడ్నీ వ్యాధి వేగంగా తీవ్రమయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి రక్తపోటు, షుగర్, బరువు అదుపులో ఉంచుకోవాలి. పొగతాగడం తగ్గించాలి. 

కిడ్నీ ఆరోగ్యాన్ని తెలిపే టెస్ట్​లు

కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడానికి రక్తం, మూత్ర పరీక్షలు చేస్తారు. కిడ్నీలు సరిగ్గా రక్తాన్ని ఫిల్టర్ చేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి రక్త పరీక్షల ద్వారా కిడ్నీ ఫంక్షన్‌ను అంచనా వేస్తారు. మూత్రంలో ప్రోటీన్ లేదా ఇతర అసాధారణ మార్పులు ఉన్నాయా అనేది కూడా పరిశీలిస్తారు. బీపీ, డయాబెటిస్, అధిక బరువు లేదా ఇతర కిడ్నీ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం మంచిది. 

Also Read : ఈ పండ్లు తింటే మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది.. కిడ్నీల కోసం కచ్చితంగా డైట్లో చేర్చుకోండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget