అన్వేషించండి

Best Fruits For Kidney : ఈ పండ్లు తింటే మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది.. కిడ్నీల కోసం కచ్చితంగా డైట్లో చేర్చుకోండి

Kidney Health : పండ్లు ఆరోగ్యానికి మంచివే. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. అందుకే మూత్రపిండాల సమస్యలను దూరం చేసుకోవడానికి తీసుకోవాల్సినవి ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మూత్రపిండాల ఆరోగ్యానికి యాపిల్, బ్లూబెర్రీ, నారింజ వంటి పండ్లు మేలు.
  • ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి.
  • పండ్లు ఎక్కువగా తినేవారిలో కిడ్నీ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
  • తగినంత నీరు, సరైన జీవనశైలితో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Healthy Fruits for Kidney : మూత్రపిండాలు శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసి.. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంలో హెల్ప్ చేస్తాయి. అలాగే టాక్సిన్స్‌ను బయటకు పంపడం వంటి కీలక పనులు చేస్తాయి. అయితే నేటికాలంలోని జీవనశైలి, జంక్ ఫుడ్, తక్కువ నీరు తాగడం, అధిక ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. 

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడానికి లైఫ్ స్టైల్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని ఫుడ్స్ డైట్లో చేర్చకోవాలి. అయితే కొన్ని పండ్లు కూడా డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయని డైటీషియన్ జెన్ హెర్నాండెజ్ తెలిపారు. దాదాపు 98 వేల మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎక్కువగా పండ్లు తినేవారిలో కిడ్నీ వ్యాధుల ప్రమాదం 6 నుంచి 8 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పండ్లు ఏంటో చూసేద్దాం. 

యాపిల్స్

యాపిల్స్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రెండు కూడా కిడ్నీ ఆరోగ్యంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కిడ్నీలపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి రక్తనాళాలను రక్షించడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ఓట్స్, పెరుగు లేదా స్మూతీల్లో వీటిని కలిపి తీసుకోవచ్చు.

నారింజ

నారింజలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా మద్దతు ఇస్తుంది. సరైన హైడ్రేషన్ కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

చెర్రీలు

చెర్రీల్లో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యం బాగుంటే కిడ్నీలకు రక్తప్రసరణ కూడా సరిగా జరుగుతుంది. దీంతో కిడ్నీల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

దానిమ్మ

దానిమ్మలో ఫైబర్, విటమిన్ K, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గ్రీన్ టీ కంటే ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

మరిన్ని జాగ్రత్తలు

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినడంతో పాటు.. రోజుకు తగినంత నీరు తాగాలి. కిడ్నీలు బాగుండాలంటే అధిక ఉప్పు, జంక్ ఫుడ్ తగ్గించాలి. షుగర్ డ్రింక్స్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ.. వైద్యులు ఇచ్చే వాడుతూ బీపీ, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు ఆపకూడదు. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు కొన్ని పండ్లు వైద్యుల సూచనలతో తీసుకోవాలి.

ఇలాంటి హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Snake Bite Medicine : నాగపాము, రక్తపింజిరి, కట్లపాము కాటేసినా ఈ మందు వాడితే చాలట.. కేవలం 300 రూపాయాలతో ప్రాణం కాపాడవచ్చా?
నాగపాము, రక్తపింజిరి, కట్లపాము కాటేసినా ఈ మందు వాడితే చాలట.. కేవలం 300 రూపాయాలతో ప్రాణం కాపాడవచ్చా?
Joint Pain Diet : కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. ఏవి తినకూడదు? ఏవి తినాలి? పూర్తి లిస్ట్ ఇదే
కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. ఏవి తినకూడదు? ఏవి తినాలి? పూర్తి లిస్ట్ ఇదే
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
Best Friend Problems : బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవైందా? ఈ టిప్స్ ఫాలో అయితే మళ్లీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది
బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవైందా? ఈ టిప్స్ ఫాలో అయితే మళ్లీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Slumdog Teaser : స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget