అన్వేషించండి

Online Medical Information : ఆన్‌లైన్‌లో మెడిసన్స్, రోగాల గురించి తెలుసుకుంటున్నారా? అలసట కూడా క్యాన్సర్ అనేస్తాది జాగ్రత్త

Hidden Dangers of Online Medical Advice : ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వస్తే దాని లక్షణాలను చాలామంది ఇంటర్నెట్​లో వెతికేస్తారు. ఇలా చేయడం వల్ల లాభమా? నష్టమా? నిపుణుల సలహా ఏంటో చూసేద్దాం.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంటర్నెట్ ద్వారా ఆరోగ్య సమాచారం సులభంగా అందుబాటులోకి వచ్చింది.
  • ఆన్‌లైన్ సమాచారం ఆధారంగా స్వీయ నిర్ధారణ, చికిత్స ప్రమాదకరం.
  • ధృవీకరించని చికిత్సలు, తప్పుడు సమాచారం వైద్య సహాయాన్ని ఆలస్యం చేయవచ్చు.
  • వ్యక్తిగత వైద్యానికి నిపుణుల సలహా తప్పనిసరి, ఆన్‌లైన్ విద్యా సాధనంగా వాడండి.

Online Medical Information Benefits and Risks : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా సులభమైపోయింది. మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా లేదా మీకున్న లక్షణాలు ఏంటో ఆన్​లైన్​లో ఈజీగా తెలుసుకోగలిగే రోజులు వచ్చేశాయి. దీంతో కొన్ని సెకన్లలోనే లక్షణాలు, వ్యాధులు, చికిత్సలు, నివారణ చర్యల గురించి సమాచారం పొందే అవకాశం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఆరోగ్యపరంగా అవగాహన పెరగడమే కాకుండా.. తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు.

అయితే వైద్యుల ప్రకారం ఆన్‌లైన్‌లో లభించే వైద్య సమాచారాన్ని.. సరైన వైద్య సలహా లేకుండా అర్థం చేసుకోవడం కొన్నిసార్లు ప్రయోజనాల కంటే ప్రమాదాలనే ఎక్కువగా కలిగించవచ్చు. యశోద హాస్పిటల్స్​లో ఆంకాలజీ సర్వీసెస్ డైరెక్టర్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ & హీమాటో ఆంకాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ జి వంశీ కృష్ణా రెడ్డి మెడిసన్, ట్రీట్మెంట్ గురించిన సమాచారం కోసం ఇంటర్నెట్​లో తెలుసుకోవడం, అలాగే ఎంతవరకు వినియోగించడం ప్రమాదమో అనే విషయంపై పలు అంశాలు తెలిపారు. 

ఇలా తెలుసుకోవడం మంచిదే..

ప్రస్తుతం గూగుల్‌లో ఎక్కువమంది వెతికే ఆరోగ్య అంశాల్లో క్యాన్సర్ ఒకటి. లక్షణాలు కనిపించినప్పుడు లేదా క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత చాలా మంది రోగులు, వారి కుటుంబ సభ్యులు ముందుగా ఇంటర్నెట్​లో దాని గురించి వెతికేస్తున్నారు. అయితే విశ్వసనీయమైన వెబ్‌సైట్లు, వైద్య సంస్థల సమాచారం ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రారంభ హెచ్చరిక సంకేతాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి అవగాహన తెలుసుకోవచ్చు. అలాగే వైద్యులను అడగాల్సిన ప్రశ్నలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఈ తరహా అవగాహన మంచిదనే చెప్తున్నారు. 

ఈ సమాచారంతో జాగ్రత్త

కానీ.. ఆన్‌లైన్ సమాచారాన్ని చూసి స్వయంగా వ్యాధిని నిర్ధారించుకోవడం ప్రమాదమని డాక్టర్ జి వంశీ కృష్ణా రెడ్డి  చెప్తున్నారు. ఉదాహరణకు బరువు తగ్గడం, ఎక్కువ అలసట, కడుపు ఉబ్బరం, దీర్ఘకాలిక దగ్గు లేదా మలవిసర్జన అలవాట్లలో మార్పులు వంటి లక్షణాలకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఇంటర్నెట్‌లో వెతికినప్పుడు అవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల లక్షణాలుగా చూపిస్తాయి. 

ఇలా చూసినప్పుడు బాధితుడిలో అవసరానికి మించి భయం పెరిగిపోతుంది. మరోవైపు కొన్ని వెబ్‌సైట్లు ఈ లక్షణాలను సాధారణ సమస్యలుగా చూపించి మీకు భరోసా ఇవ్వవచ్చు. ఈ రెండు పరిస్థితులు మంచివి కాదని చెప్తున్నారు. ఇవి సరైన సమయంలో మెడికల్ టెస్ట్​లు చేయించుకోవడాన్ని ఆలస్యం చేస్తాయి. ఎందుకంటే వైద్య రంగంలో తప్పుడు సమాచారం ప్రస్తుతం పెద్ద సవాలుగా మారింది. 

సోషల్ మీడియాలో వైరల్ అయితే నిజమేనా?

సోషల్ మీడియా, ఇతర ధృవీకరించని వెబ్‌సైట్లలో శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సలు, అద్భుత ఫలితాలు ఇస్తాయని చెప్పే మందులు, కఠినమైన డైట్లు, సప్లిమెంట్లు, ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు తెగ ప్రచారం అవుతున్నాయి. క్యాన్సర్ చికిత్స విషయంలో ఇలాంటి తప్పుడు సమాచారం మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమంది రోగులు.. వైద్యులు సూచించిన చికిత్సలను వాయిదా వేయడం లేదా పూర్తిగా మానేస్తున్నారట. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది.

ఇంటర్నెట్‌లో లభించే సమాచారం సాధారణ స్వభావం కలిగి ఉంటుంది. ఏ వెబ్‌సైట్ లేదా సెర్చ్ ఇంజిన్ లేదా AI సాధనం కూడా ఒక వ్యక్తి పూర్తి వైద్య చరిత్ర, శారీరక పరీక్ష ఫలితాలు, ల్యాబ్ రిపోర్టులు, జన్యుపరమైన అంశాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేవు. ఎందుకంటే ఒకే లక్షణం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు కారణాల వల్ల రావచ్చు. అందుకే ప్రతి రోగికి చికిత్స కూడా భిన్నంగా ఉంటుంది.

అందుకే ఆన్‌లైన్‌లోని వైద్య సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి ఉత్తమ మార్గం దానిని ఒక విద్యా సాధనంగా మాత్రమే చూడాలని నిపుణులు చెప్తున్నారు. దానిని ఆధారంగా చేసుకుని స్వయంగా వ్యాధిని నిర్ధారించుకోవడం లేదా చికిత్స ప్రారంభించడం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. విశ్వసనీయ వైద్య సంస్థలు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, అర్హత కలిగిన వైద్యుల ద్వారా మాత్రమే ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget