అన్వేషించండి

Sleep Deprivation in Kids : పిల్లల్లో బరువు పెరుగుదలకు(Obesity) నిద్రలేమి కూడా కారణమేనా? వైద్యుల హెచ్చరికలు ఇవే

Obesity in Kids : తక్కువ నిద్రపోయే, ఎక్కువ స్క్రీన్ టైమ్ గడిపే పిల్లల్లో అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశంలో పిల్లల ఊబకాయానికి నిద్రలేమి, అధిక స్క్రీన్ సమయం ప్రధానం.
  • స్క్రీన్ టైమ్ శారీరక శ్రమను తగ్గించి, కేలరీల అసమతుల్యత పెంచుతుంది.
  • డిజిటల్ లైట్ నిద్రను భంగపరిచి ఆకలి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.
  • తగిన నిద్ర, స్క్రీన్ నియంత్రణ, శారీరక శ్రమ ఊబకాయం తగ్గిస్తాయి.

Sleep Loss, Screen Time and Obesity : భారతదేశంలో పిల్లల్లో ఊబకాయం (ఒబెసిటీ) సమస్య వేగంగా పెరుగుతోంది. సాధారణంగా దీనికి కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లేనని చాలా మంది అనుకుంటారు. కానీ సరిగ్గా నిద్ర లేకపోవడం, స్క్రీన్‌ ముందు ఎక్కువ సమయం గడపడం కూడా పిల్లల బరువు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ మూడు అంశాలు కలిసి పిల్లల శారీరక, జీవక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. 

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిషియన్‌గా సేవలందిస్తున్న డాక్టర్ సత్యప్రియ సాహూ ప్రకారం.. నేటి పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, టెలివిజన్లు, గేమింగ్ కన్సోళ్లు, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దీంతో వారిలో బయట ఆడుకోవడం, శారీరక కార్యకలాపాలు తగ్గిపోవడం జరుగుతున్నాయని తెలిపారు.

స్క్రీన్ టైమ్ పెరిగితే బరువు పెరుగుతారా?

పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్‌ల ముందు కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలో ఖర్చయ్యే శక్తి తగ్గి.. తీసుకునే క్యాలరీలు ఎక్కువ అవుతాయి. ఈ అసమతుల్యత క్రమంగా అనారోగ్యకరమైన బరువు పెరుగుదలకు దారితీస్తుంది. అయితే సమస్య కేవలం శారీరక శ్రమ తగ్గడమే కాదని.. రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, టీవీలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల నిద్రపోయే విధానంలో కూడా మార్పులు వస్తాయని తెలిపారు. 

నిద్రను దెబ్బతీసే బ్లూ లైట్

డిజిటల్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ శరీరంలో నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో పిల్లలు ఆలస్యంగా నిద్రపోవడం, తక్కువ సమయం నిద్రపోవడం లేదా నిద్ర నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

ఆకలి కూడా పెరుగుతుందట

నిద్ర అనేది కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదు. ఆకలి, జీవక్రియ, ఎదుగుదల, హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు డాక్టర్ సత్యప్రియ సాహు. పిల్లలకు సరిపడా నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది.

దీంతో వారు ఎక్కువ ఆకలిగా ఫీలవడం, అలాగే కేలరీలు ఎక్కువగా ఉండే క్రేవింగ్స్  కోరుకోవడం, అవసరానికి మించి తినడం వంటి అలవాట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నిద్రలేమి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇతర జీవక్రియ సమస్యలు కూడా తలెత్తి భవిష్యత్తులో ఊబకాయానికి దారితీయవచ్చని చెప్తున్నారు.

చిన్న వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

పిల్లల్లో స్క్రీన్ టైమ్ పెరగకుండా.. నిద్ర సమస్యలు రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు సరిపడా నిద్ర, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం, రోజువారీ శారీరక శ్రమ ఉండేలా కేర్ తీసుకోవాలి. పిల్లలు పడుకునే ముందు కనీసం ఒక గంట పాటు మొబైల్, టీవీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ కనీసం గంటసేపు శారీరకంగా చురుకుగా ఉండే ఆటలు ఆడేలా చూడాలి. 

వయసుకు తగినంత నిద్రపోవడం వంటి అలవాట్లు కూడా ఊబకాయాన్ని నివారిస్తాయి. అలాగే పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్యను నియంత్రించాలంటే వారు ఏమి తింటున్నారు అన్నదానిపై మాత్రమే కాకుండా.. ఎంతసేపు నిద్రపోతున్నారు.. శారీరకంగా ఎంత యాక్టివ్గా ఉంటున్నారు.. స్క్రీన్‌ల ముందు ఎంత సమయం గడుపుతున్నారు అనే విషయాలపై కూడా దృష్టి పెట్టాలని డాక్టర్ సత్య ప్రియ సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget