Low BP in Kids : పిల్లలలో లో బీపీ.. అధిక జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి
High Fever in Children : పిల్లలు అధిక జ్వరంతో ఉన్నప్పుడు డీహైడ్రేషన్‌కి గురై బీపీ తగ్గవచ్చు. దీంతో శరీరం కొన్ని లక్షణాలు ఇస్తుంది. అవి కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి అంటున్నారు. అవేంటంటే..

- అధిక జ్వరం, డీహైడ్రేషన్ పిల్లలలో లో బీపీకి కారణం.
- నీరసం, చల్లని చేతులు, శ్వాస ఇబ్బందులు లో బీపీ లక్షణాలు.
- ఓఆర్ఎస్, గోరువెచ్చని క్లాత్‌తో శరీరం చల్లబర్చండి.
- తీవ్ర లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
Low Blood Pressure in Kids : వాతావరణం మారినప్పుడు పిల్లలకు జ్వరం రావడం జరుగుతూనే ఉంటుంది. ఇది కామన్ కూడా. అయితే కొన్నిసార్లు అధిక జ్వరంతో పాటు వారిలో రక్తపోటు కూడా పడిపోవచ్చు. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. అధిక జ్వరం వచ్చినప్పుడు శరీరం చెమట ద్వారా చాలా నీటిని కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ జరిగి.. పిల్లలలో లో బీపీకి కారణం అవుతుంది. అలాగే తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం వచ్చినా పిల్లల్లో లో బీపీ వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో పేరెంట్స్ ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల్లో లో బీపీ లక్షణాలు గుర్తించండిలా..
పిల్లలలో లో బీపీకి సంబంధించిన కొన్ని లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించాల్సి ఉంటుంది. పిల్లలు నీరసంగా ఉన్నా.. తరచుగా నిద్రపోతున్నా, లేదా సరిగ్గా స్పందించలేకపోయినా.. అది లో బీపీకి సంకేతం కావచ్చు. ఇవే కాకుండా చేతులు చల్లగా మారడం, పాదాలు, పాలిపోయిన చర్మం, వేగవంతమైన లేదా బ్రీతింగ్లో ఇబ్బందులు, తల తిరగడం వంటివి లో బీపీ లక్షణాలే.
Also Read : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి
కొన్ని సందర్భాల్లో పిల్లలకు వాంతులు లేదా విరేచనాలు కూడా కావచ్చు. దీనివల్ల డీహైడ్రేషన్ తీవ్రమై, మూత్రవిసర్జన తగ్గుతుంది. ఒకవేళ పిల్లలు చాలా నీరసంగా అనిపించినా లేదా ఏడ్చిన తర్వాత అకస్మాత్తుగా సైలెంట్‌గా, నిస్సత్తువుగా మారినా తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
పిల్లలకు జ్వరంతో పాటు రక్తపోటు కూడా తగ్గడం మొదలైతే.. కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండి.. తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. వారిని పడుకోబెట్టి.. వారి కాళ్లను కొద్దిగా పైకి ఎత్తండి.. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ఓఆర్ఎస్, నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటివి ఇవ్వాలి.
Also Read : పిల్లల ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఆహారం, నిద్ర, వ్యాయామంపై వైద్యులు చెప్పిన విషయాలివే
జ్వరాన్ని తగ్గించడానికి గోరువెచ్చని లేదా సాధారణ నీటితో తడిపిన క్లాత్ పిల్లల నుదుటిపైనా, శరీరం పైనా ఉంచండి. కానీ మరీ చల్లటి నీటిని ఉపయోగించకూడదు. పిల్లలకు బిగుతుగా ఉండే దుస్తులను తీసివేసి.. గాలి బాగా ప్రసరించే విశాలమైన ప్రదేశంలో ఉంచండి. అయితే పిల్లలు బాగా నీరసంతో ఉన్నా.. స్పృహ కోల్పోయినా.. చేతులు కాళ్లు చల్లగా ఉన్నా.. లేదా శ్వాస వేగంగా తీసుకుంటున్నా.. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత తీవ్రతరం కావచ్చు.
Also Read : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























