అన్వేషించండి

Smartphone Exposure in Kids : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు

Smartphone Affect on Kids : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వినియోగం జోరుగా సాగుతోంది. వివిధ కారణాలతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. ఈ అలవాటు ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

Smartphones Can Harm Children’s Mental Health : చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని లేదా మారం చేస్తున్నారని.. ఫుడ్ తినట్లేదని వారికి ఫోన్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇది చాలా ప్రమాదమంటోన్నారు నిపుణులు. తమపనికి ఇబ్బంది ఉండకూడదని.. ఎలాంటి కారణం లేకుండానే చిన్నపిల్లలకు ఫోన్స్ ఇస్తున్నారంటూ కొత్త పరిశోధనలు ఆందోళన కలిగించాయి. తాజాగా చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండటం ఆరోగ్యానికి హానికరం.

అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉన్న పిల్లల్లో నిరాశ, నిద్ర లేమి, ఊబకాయం వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. స్మార్ట్ ఫోన్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని స్లోగా దెబ్బతీసేలా చేస్తుందని.. ఈ అధ్యయనం హెచ్చరించింది. 

తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలు

ఈ పరిశోధనకోసం అమెరికాలోని 10 వేలకు పైగా పిల్లల డేటాను తీసుకున్నారు. దాని ఆధారంగా నివేదిక రూపొందించారు. దీనిలో 12 సంవత్సరాల కంటే ముందు ఫోన్ ఉన్న పిల్లల నిద్ర, మానసిక స్థితి ఇతరులకన్నా ఎక్కువగా ప్రభావితమైందని గుర్తించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. చిన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు వాడితే.. వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిద్రలేమి అలవాట్లు వల్ల చిన్న వయసులోనే బరువు పెరగడం జరుగుతుందని.. అవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి కారణమయ్యేలా చేస్తుందని అంటున్నారు. 

ఫోన్ ఉంటే జరిగిన పరిణామాలు మాత్రమే

ఈ అధ్యయన ప్రధాన రచయిత, పిల్లల మనోరోగ వైద్యుడు రాన్ బార్జిలే మాట్లాడుతూ.. ఈ పరిశోధన పిల్లలు తమ ఫోన్లలో వాస్తవానికి ఏమి చేస్తారో కూడా పరిశీలించలేదని చెప్పారు. కేవలం ఫోన్ ఉండటం పిల్లల ఆరోగ్యంపై చూపిస్తోన్న ప్రభావాల గురించే నివేదించినట్లు తెలిపారు. ఏడాది పాటు జరిపిన ఈ స్టడీలో స్మార్ట్‌ఫోన్‌లు లేని పిల్లలు, స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న పిల్లల కంటే మానసిక ఆరోగ్యంలో మెరుగ్గా రాణించారని తెలిపారు. టాబ్లెట్ లేదా ఇతర పరికరం ఉన్నప్పటికీ.. ఫలితాలు గణనీయంగా మారలేదని వెల్లడించారు. 

ఈ అధ్యయనం ప్రకారం కేవలం ఫోన్ ఉంటేనే ఇలాంటి పరిణామాలు జరిగితే.. వాటిని ఉపయోగించి పిల్లలు ఎలాంటి ఫీడ్ తీసుకుంటున్నారో అనేది మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కాబట్టి పిల్లలకు వీలైనంత ఫోన్స్ దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. అవసరానికి మించి ఫోన్ ఇవ్వకూడదని.. ఒకవేళ ఫోన్ ఇచ్చినా.. వాటి కంట్రోల్స్ పేరెంట్స్ దగ్గర ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Municipal Elections 2026 LIVE: తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు వేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు వేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Maoist Letters To AP Ministers: నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే..
జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే..
AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్
అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్
Advertisement

వీడియోలు

Abhishek Sharma Health Update | స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం
Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Municipal Elections 2026 LIVE: తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు వేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు వేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Maoist Letters To AP Ministers: నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే..
జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే..
AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్
అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్
Telangana Politics: జిల్లాల రద్దు ప్రచారంపై ఆలస్యంగా మేల్కొన్న రేవంత్ ప్రభుత్వం - మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తప్పదా?
జిల్లాల రద్దు ప్రచారంపై ఆలస్యంగా మేల్కొన్న రేవంత్ ప్రభుత్వం - మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తప్పదా?
T20 world cup 2026: ఎంఎస్ ధోని ప్రపంచ రికార్డును సమం చేసిన క్వింటన్ డి కాక్, చరిత్రకు అడుగు దూరంలో
ఎంఎస్ ధోని ప్రపంచ రికార్డును సమం చేసిన క్వింటన్ డి కాక్, చరిత్రకు అడుగు దూరంలో
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
KTR: కేటీఆర్ సెల్ఫ్ ట్రాప్ - కార్యకర్తలకు హితబోధ చేసి స్వయంగా తిట్ల పురాణం- బీఆర్ఎస్ ఎజెండా దారి తప్పిందా?
కేటీఆర్ సెల్ఫ్ ట్రాప్ - కార్యకర్తలకు హితబోధ చేసి స్వయంగా తిట్ల పురాణం- బీఆర్ఎస్ ఎజెండా దారి తప్పిందా?
Embed widget