అన్వేషించండి

7 సీటర్‌ హైబ్రిడ్ SUV 'MG Hector Tomahawk' లాంచ్.. పెట్రోల్‌, ఛార్జింగ్‌ కలిపి 1100km పైగా కంబైన్డ్‌ రేంజ్‌

MG Hector Tomahawk PHEV రూ.25.70 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. 40 కి.మీ. మైలేజ్, 115 కి.మీ. ఎలక్ట్రిక్ రేంజ్, 1,100 కి.మీ.కి పైగా కంబైన్డ్ రేంజ్ అందిస్తుంది.

MG Hector Tomahawk PHEV Price, Range And Features Telugu: లీటర్ పెట్రోల్‌కు 40 కిలోమీటర్లకు పైగా మైలేజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లకు పైగా ఎలక్ట్రిక్ రేంజ్.. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ & పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో 1,100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం. ఇదే MG Hector Tomahawk PHEV ప్రత్యేకత. దేశంలో ప్రధాన స్రవంతిలోకి వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVగా MG దీనిని తీసుకొచ్చింది.

JSW MG Motor India కొత్త Hector Tomahawk PHEVని రూ.25.70 లక్షల ప్రారంభ ధరతో లాంచ్‌ చేసింది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఈ SUV కేవలం 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది. టాప్ Essence వేరియంట్ ధర రూ.27.80 లక్షలు. ఈ ధరలు పరిమిత సంఖ్యలో బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయి.

BaaS కింద రూ.21.79 లక్షలకే
Hector Tomahawk PHEV బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్‌లో మొదలవుతాయి. ఈ SUVని Battery-as-a-Service (BaaS) పథకం కింద కూడా కొనుగోలు చేయవచ్చు. BaaS ధర రూ.21.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.20 అదనంగా చెల్లించాలి.

ఈ SUVలో 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 20.5kWh బ్యాటరీ ప్యాక్ & పర్మనెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేశారు. పెట్రోల్ ఇంజిన్ ఒక్కటే 102hp పవర్ & 125Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 201hp పవర్ & 237Nm టార్క్‌ను అందిస్తుంది.

రెండు పవర్ సోర్స్‌ల కలిపిన మొత్తం అవుట్‌పుట్ 198hp పవర్ & 230Nm టార్క్‌గా ఉంది. ఈ పవర్‌ట్రెయిన్‌ను ఈ-క్లచ్‌తో కూడిన ప్రత్యేక హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించారు. దీని థర్మల్ ఎఫిషియెన్సీ 43.2 శాతంగా ఉందని MG చెబుతోంది.

నాలుగు డ్రైవింగ్ మోడ్స్‌
PHEV కావడంతో ఇందులో నాలుగు డ్రైవింగ్ మోడ్స్‌ ఉన్నాయి. Pure EV మోడ్‌లో ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే చక్రాలను నడుపుతుంది. Series Hybrid మోడ్‌లో పెట్రోల్ ఇంజిన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. వాహనాన్ని మాత్రం ఎలక్ట్రిక్ మోటార్ నడుపుతుంది.

ఇది కూడా చదవండి: మిత్సుబిషి 'పజెరో' ఈజ్ బ్యాక్.. సెప్టెంబర్ 2న కొత్త SUV ఆవిష్కరణ, దమ్మున్న ఆఫ్‌రోడింగ్‌ కారు!

Parallel Hybrid మోడ్‌లో పెట్రోల్ ఇంజిన్ & ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి పనిచేస్తాయి. ఎక్కువ పనితీరు అవసరమైనప్పుడు ఈ మోడ్ ఉపయోగపడుతుంది. Engine Direct Drive మోడ్‌లో ఇంజిన్ నేరుగా చక్రాలకు శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా హైవేపై ప్రయాణించేటప్పుడు మార్పిడి నష్టాలను తగ్గించి మెరుగైన సామర్థ్యాన్ని అందించడమే దీని ఉద్దేశం.

ఆటోమేటిక్‌ మార్పులు
ఈ నాలుగు మోడ్‌ల మధ్య వాహనం స్వయంచాలకంగా మారుతుంది. డ్రైవర్ ప్రత్యేకంగా ఎలాంటి మోడ్‌ను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. వాహనం వేగం, యాక్సిలరేటర్ వినియోగం, బ్యాటరీ ఛార్జ్ స్థాయి & రోడ్డు పరిస్థితులను బట్టి సిస్టమ్ తన మోడ్‌ను మార్చుకుంటుంది. ఈ మార్పు కేవలం 0.1 సెకన్లలో జరుగుతుందని MG చెబుతోంది.

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లకు పైగా ఎలక్ట్రిక్-ఓన్లీ రేంజ్ వస్తుంది. పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నింపి, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 1,100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. కంబైన్డ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ 40 కి.మీ. పర్ లీటర్ కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఛార్జింగ్ టైమ్‌
3.3kW AC ఛార్జర్‌ను ఉపయోగిస్తే 10 నుంచి 100 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 7.5 గంటలు పడుతుంది. 25kW DC ఛార్జర్‌తో 30 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 35 నిమిషాలు పడుతుంది.

పరిమాణం పరంగా Hector Tomahawk PHEV పొడవు 4,745 మిల్లీమీటర్లు. వీల్‌బేస్ 2,810 మిల్లీమీటర్లు. వెడల్పు 1,850 మిల్లీమీటర్లు. ఎత్తు 1,770 మిల్లీమీటర్లు. ఈ SUV Mahindra XUV 7XO & Tata Safari కంటే పొడవుగా ఉంటుంది.

డిజైన్ 
ముందు భాగంలో పెద్ద ఫంక్షనల్ గ్రిల్ కనిపిస్తుంది. ఇందులో క్రోమ్ ఎలిమెంట్లు ఉన్నాయి. దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్స్ కింద గ్లోస్ బ్లాక్ గార్నిష్ ఇచ్చారు. బంపర్‌పై సిల్వర్ ట్రిమ్ ఉంది. 18 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ & రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సుజుకి నుంచి వస్తున్న చవకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావచ్చు! e Sky ప్రత్యేకతలు ఇవే

వెనుక భాగంలో చుట్టూ విస్తరించిన దీర్ఘచతురస్రాకార LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ బంపర్‌ను అందించారు. Starry Black, Aurora Silver, Shadow Gold, Pearl White, Turquoise Green & Celadon Blue రంగుల్లో SUV లభిస్తుంది. చివరి రెండు రంగులను వైట్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ ఆప్షన్‌లోనూ అందిస్తున్నారు.

ఇంటీరియర్‌
ఇంటీరియర్‌లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. దీనికి 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే జత చేశారు. ఫ్లాట్ బాటమ్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ & వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌తో కూడిన ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ ఉన్నాయి. సాఫ్ట్ టచ్ లెదరెట్ మెటీరియల్‌ను విస్తృతంగా ఉపయోగించారు.

వైర్‌లెస్ Apple CarPlay & Android Auto, జెస్చర్ కంట్రోల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, 256 రంగుల యాంబియంట్ లైటింగ్ & 10 స్పీకర్ల Infinity సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లకు సన్‌షేడ్స్ కూడా అందించారు.

భద్రత 
6 ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. 360 డిగ్రీ కెమెరాతో పాటు ట్రాన్స్‌పరెంట్ బానెట్ & వీల్ వ్యూ ఫంక్షన్లు ఉన్నాయి. Level 2 ADAS కూడా అందించారు.

భారత మార్కెట్లో Hector Tomahawk PHEVకు ప్రధానంగా Mahindra XUV 7XO & Tata Safari వంటి 7-సీటర్‌ SUVలు ప్రత్యర్థులుగా నిలవనున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget