అన్వేషించండి

పాత కారు అమ్మి కొత్తది కొనాలా? లేక, పాత కారును కొత్త కారుతో ఎక్సేంజ్‌ చేయాలా? స్పిన్నీలో చాలా ఆప్షన్లు

సెకండ్‌హ్యాండ్‌ కార్ల కొనుగోలు, అమ్మకం & ఎక్స్ఛేంజ్‌ సేవలను మరింత విస్తతంగా అందుబాటులోకి తెచ్చేందుకు నిస్సాన్‌, ఎంజీ మోటార్‌, టెస్లాతో భాగస్వామ్యాలను స్పిన్నీ విస్తరించింది.

Spinny Secondhand Cars: మీ పాత కారును అమ్మడం, లేదా కొత్త కారుతో ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం లేదా మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్‌హ్యాండ్‌ ఎలక్ట్రిక్‌ కారును కొనడం ఇప్పుడు మరింత సులభం కానుంది. ప్రముఖ ప్రీ-ఓన్డ్‌ కార్ల ప్లాట్‌ఫామ్‌ స్పిన్నీ (Spinny), వివిధ కంపెనీలతో మరిన్ని ఒప్పందాలు చేసుకుంది. నిస్సాన్‌, JSW MG మోటార్‌ ఇండియా & టెస్లాతో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను స్పిన్నీ మరింత విస్తరించింది. పాత కారును కొత్త కారుతో ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం, సెకండ్‌హ్యాండ్‌ ఎలక్ట్రిక్‌ కార్లు & వాహనాల కొనుగోలు, అమ్మకం, అప్‌గ్రేడ్‌ వంటి సేవలను ఈ ఒప్పందాలు కవర్‌ చేస్తాయి.

నిస్సాన్‌ కస్టమర్లకు భారీ ఎక్స్ఛేంజ్‌ బెనిఫిట్‌

కొత్త నిస్సాన్‌ కారును కొనే చేసే కస్టమర్లు తమ పాత కారును స్పిన్నీ ద్వారా ఎక్స్ఛేంజ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం పాత వాహనాన్ని స్పిన్నీ నిపుణులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను కేవలం 55 నిమిషాల్లో పూర్తి చేసే సదుపాయం ఉంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా.. కస్టమర్లకు గరిష్ఠంగా రూ.75,000 వరకు ఎక్స్ఛేంజ్‌ ప్రయోజనాలు లభించవచ్చు. ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన ఆధారంగా స్పిన్నీ జారీ చేసే బయ్యింగ్‌ లెటర్‌ను కూడా అంగీకరిస్తారు.

టెస్లా కొనేవారికీ స్పిన్నీ సేవలు

టెస్లా కూడా స్పిన్నీని తన ప్రిఫర్డ్‌ ఎక్స్ఛేంజ్‌ పార్ట్‌నర్‌గా నియమించింది. టెస్లా తీసుకోవాలనుకునే కస్టమర్లు తమ పాత పెట్రోల్‌ లేదా డీజిల్‌ కారును విక్రయించేందుకు స్పిన్నీ సేవలను ఉపయోగించుకోవచ్చు. టెస్లా స్విచ్‌ & సేవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అంటే కొత్త టెస్లా కొనుగోలు సమయంలో పాత ఇంధన కారును విక్రయించే ప్రక్రియను స్పిన్నీ ద్వారా పూర్తి చేయవచ్చు.

ఇది కూడా చదవండి: మిత్సుబిషి 'పజెరో' ఈజ్ బ్యాక్.. సెప్టెంబర్ 2న కొత్త SUV ఆవిష్కరణ, దమ్మున్న ఆఫ్‌రోడింగ్‌ కారు!

సెకండ్‌హ్యాండ్‌ ఎలక్ట్రిక్‌ కార్లపై ఫోకస్‌

JSW MG మోటార్‌ ఇండియాతో స్పిన్నీ భాగస్వామ్యం ప్రధానంగా సెకండ్‌హ్యాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను కవర్‌ చేస్తుంది. ఎంజీకి ఉన్న ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నైపుణ్యాన్ని, స్పిన్నీకి ఉన్న వాహన తనిఖీ, సర్టిఫికేషన్‌, రీఫర్బిష్‌మెంట్‌ & విక్రయ సామర్థ్యాలతో కలిపి ఈ ఒప్పందం ఖరారైంది. ఎంజీ కామెట్‌ ఈవీ, ఎంజీ విండ్సర్‌ ఈవీ & ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ వంటి మోడళ్లు ఈ ఒప్పందం కిందకు వస్తాయి. స్పిన్నీ ద్వారా సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ ఎంజీ ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేసేవాళ్లకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా.. బ్యాటరీ హెల్త్‌ అసెస్‌మెంట్‌ & సర్టిఫికేషన్‌ అందిస్తారు. ఒరిజినల్‌ వాహన తయారీ సంస్థ వారంటీ కొనసాగుతుంది. ఫిక్స్‌డ్‌ ప్రైసింగ్‌ ఉంటుంది. దీనికి అదనంగా స్పిన్నీ తనిఖీ & రీఫర్బిష్‌మెంట్‌ ప్రక్రియను కూడా పూర్తి చేస్తుంది.

ఎలక్ట్రిక్‌ కారును అమ్మేవాళ్లకూ బ్యాటరీ పరీక్ష

తమ ఎలక్ట్రిక్‌ కారును స్పిన్నీకి విక్రయించే కస్టమర్లకు కూడా బ్యాటరీ హెల్త్‌ అసెస్‌మెంట్‌ & సర్టిఫికేషన్‌ సదుపాయం ఉంటుంది. దీంతో వాహనం బ్యాటరీ పరిస్థితిపై మరింత స్పష్టత లభిస్తుంది. ప్రస్తుతం ఈ EV సేవలు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, కొచ్చి, ముంబై, పుణె, జైపూర్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా, లక్నో, చండీగఢ్‌ & కోయంబత్తూరులో అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కార్లు, బైకుల హెడ్‌లైట్లకు కొత్త రూల్స్‌! హైబీమ్ వాడితే అలర్ట్.. వెలుగు తగ్గనుందా?

80కి పైగా నగరాల్లో స్పిన్నీ సేవలు

స్పిన్నీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80కి పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీకి 57కి పైగా కార్‌ హబ్‌లు, 17 స్పిన్నీ పార్కులు & 15కి పైగా ఇంటిగ్రేటెడ్‌ రీస్టొరేషన్‌ సెంటర్లు ఉన్నాయి. 

ఈ కొత్త భాగస్వామ్యాలతో... కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో పాత కారును ఎక్స్ఛేంజ్‌ చేయడం, సెకండ్‌హ్యాండ్‌ ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేయడం & వాహనాన్ని అప్‌గ్రేడ్‌ చేయడం వంటి సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా పొందే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Mini Cooper SE ఎలక్ట్రిక్‌ కారు.. స్టీరింగ్‌ పట్టుకుంటే 402km రేంజ్, యాక్సిలేటర్‌ తొక్కితే 218hp పవర్!
కారు చిన్నదైనా ధర మాత్రం రూ.53.9 లక్షలు! మినీ కూపర్ SEలో అంత స్పెషల్ ఏముంది?
ఒక కారంత పవర్‌తో Royal Enfield Himalayan 750 బైక్‌ లాంచ్‌, బుకింగ్స్ డిసెంబర్ 1 నుంచి ఓపెన్‌
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బిగ్‌ బైక్‌' హిమాలయన్ 750 లాంచ్.. ధర రూ.4.89 లక్షల నుంచి ప్రారంభం
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
టాటా నెక్సాన్ EVకి పోటీగా వస్తున్న Hyundai Ioniq P EV.. లాంగ్‌ రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లు, లెవల్ 2 ADAS
సంక్రాంతి కానుకగా హ్యుందాయ్‌ కొత్త EV.. ₹9.79 లక్షల ధర, టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Bigg Boss Season 10 Today November 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చివరి కెప్టెన్‌గా లేడీ టైగర్ దేబ్జానీ! మరోసారి క్యారెక్టర్ గొడవ.. హౌస్ సపోర్ట్ మొత్తం త్రిగుణ్‌కే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చివరి కెప్టెన్‌గా లేడీ టైగర్ దేబ్జానీ! మరోసారి క్యారెక్టర్ గొడవ.. హౌస్ సపోర్ట్ మొత్తం త్రిగుణ్‌కే!
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Delimitation Bill: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
Embed widget