అన్వేషించండి

పెట్రోల్ బాదుడుకి చెక్ చెబుదాం - పాత వాహనాన్ని ఎలక్ట్రిక్ కారుగా మార్చడం ఎలా?

పాత పెట్రోల్ వాహనాన్ని ఎలక్ట్రిక్ కారుగా మార్చే రెట్రోఫిటింగ్ విధానం, అయ్యే ఖర్చులు, RTO అనుమతులు & ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Car Retrofitting: పెట్రోలు, డీజిల్ ధరలను భరించలేని వాహనదారులు ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. మొదట్లో CNG, LPG వైపు మొగ్గు చూపినా.. ఇప్పుడు అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లింది. అయితే కొత్త ఎలక్ట్రిక్ కారు కొనడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో పాత పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చు, ఈ విధానమే 'రెట్రోఫిటింగ్'.

రెట్రోఫిట్ అంటే ఏమిటి?
తయారీ సమయంలో వాహనానికి ఉన్న ఇంజిన్ లేదా ఇంధన వ్యవస్థను తీసివేసి.. దాని స్థానంలో కొత్త బ్యాటరీ & మోటార్ సాంకేతికతను అమర్చడాన్ని రెట్రోఫిటింగ్ అంటారు. గతంలో పెట్రోల్ కార్లకు CNG కిట్లు బిగించడం చూశాం. ఇప్పుడు అదే తరహాలో ఎలక్ట్రిక్ కిట్లను అమర్చుకునే కన్వర్షన్ ట్రెండ్ నడుస్తోంది.

ఇది ఎవరికి గిట్టుబాటు అవుతుంది?

మీ వాహనం రోజూ కనీసం 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగితేనే రెట్రోఫిట్ చేసుకోవడం లాభదాయకం. సాధారణ కారును EVగా మార్చడానికి ప్రారంభ ధర సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అందుకే వ్యక్తిగత కార్ల కంటే రోజూ తిరిగే క్యాబ్స్, డెలివరీ వాహనాలకు ఇది చాలా గిట్టుబాటవుతుంది.

వాహనాన్ని మార్చేముందు ఇవి గమనించాలి:

మీ వాహనం కనీసం ఏడు నుంచి ఎనిమిది ఏళ్ల పాతదై ఉండి, మంచి కండిషన్‌లో ఉంటేనే EVగా మార్చుకోవాలి.

కారు బాడీ తుప్పు పట్టకుండా ఉండాలి. మరో 10-15 రోడ్డుపై నడిచే సామర్థ్యం ఉందో, లేదో తనిఖీ చేసుకోవాలి.

కారు ఫ్రేమ్ & ఛాసిస్ బలంగా ఉన్నాయో లేదో వర్క్‌షాప్‌లో పరీక్షించుకోవాలి.

మీ వాహన మోడల్‌కు ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధ్రువీకరించిన EV కిట్ సరిపోతుందో, లేదో చూసుకోవాలి.

భవిష్యత్తులో మీ పాత వాహన విడిభాగాలు దొరుకుతాయో, లేదో ముందే తెలుసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. 204cc ఇంజిన్‌, 26.5hp పవర్‌.. Yamaha R2 రేటెంతో తెలుసా?

మార్పిడి ప్రక్రియ ఎలా జరుగుతుంది?

మీ కారును EVగా మార్చాలనుకుంటే ముందుగా RTO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. RC, లైసెన్స్ & బిగించబోయే ఎలక్ట్రిక్ కిట్ వివరాలను సమర్పించి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

అనుమతి వచ్చాక ఏ.ఆర్.ఏ.ఐ., సీ.ఐ.ఆర్.టి., ఏ.సీ.ఏ.టి. లేదా జీ.ఏ.ఆర్.సి. వంటి సంస్థల ఆమోదం పొందిన అధీకృత రెట్రోఫిటింగ్ కేంద్రాల్లోనే కిట్ అమర్చుకోవాలి. అనధికారిక కిట్లు వాడటం సురక్షితం కాదు.

కిట్ అమర్చిన తర్వాత సదరు సంస్థ వాహనం పనితీరు, బ్రేకులు & ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను తనిఖీ చేసి ఇన్వాయిస్‌తో కూడిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తుంది.

ఈ సర్టిఫికెట్‌తో వాహనాన్ని మళ్లీ RTO ఆఫీసుకు తీసుకెళ్లి తనిఖీ పూర్తి చేయించాలి. అప్పుడు, ఆ వాహనం RCలో ఇంధన రకాన్ని EVగా మారుస్తూ ఎండార్స్‌మెంట్ ఇస్తారు. ఆ తర్వాతే బీమా కూడా వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్‌!

అందుబాటులో ఉన్న కేంద్రాలు:

హైదరాబాద్‌లో CNG కిట్లు అమర్చే అధీకృత కేంద్రాలు అత్తాపూర్, బోయగూడ, నాగోల్, LB నగర్‌లో ఉన్నాయి. బైక్‌లు, ఆటోలు & సరుకు రవాణా వాహనాల కోసం EV కన్వర్షన్ కేంద్రాలు బొల్లారం, LB నగర్, తెల్లాపూర్‌లో అందుబాటులోకి వస్తున్నాయి.

డ్రైవర్లు ప్రతిరోజూ గంటల తరబడి వాహనం నడపుతూ, కొన్ని వందలసార్లు గేర్లను మారుస్తున్నారు. వాహనం నుంచి వచ్చే వైబ్రేషన్లు, గేర్‌ మార్పుల వల్ల కొన్ని రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. EVగా మారితే వైబ్రేషన్లు, శబ్దాలు ఉండవు. కాలుష్యం తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. పాత వాహనాన్ని పక్కన పడేయకుండా  ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చుకోవడం పర్యావరణానికి & జేబుకు రెండింటికీ శ్రేయస్కరం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget