అన్వేషించండి

Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?

Yamaha R2 మూడు వేరియంట్లలో విడుదలైంది. ధరలు రూ.2.30 లక్షల నుంచి రూ.2.53 లక్షల వరకు ఉన్నాయి. 204cc ఇంజిన్‌, Quickshifter, Adjustable Suspension వంటి ఫీచర్లు ఉన్నాయి.

Yamaha R2 Price And Features Telugu: యమహా కంపెనీ, యువత ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న R2 బైక్‌ను ఆగస్టు 27న భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Supersport బైక్‌గా దీన్ని పరిచయం చేసింది. ఇప్పటికే పాపులర్‌ అయిన R15కి ఇది ప్రత్యామ్నాయం కాదు. R15 కంటే పై స్థాయిలో ఉండే మోడల్‌గా R2ను తీసుకొచ్చింది.

Yamaha R2 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ధరలు రూ.2.30 లక్షల నుంచి రూ.2.53 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు.

Yamaha R2 మూడు వేరియంట్లలోనూ ఒకే ఇంజిన్‌ ఉంటుంది. 204cc లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ 26.5hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 10,000rpm వద్ద ఈ పవర్‌ వస్తుంది. గరిష్ఠ టార్క్‌ 19.1Nm. ఇది 8,000rpm వద్ద లభిస్తుంది.

అన్ని వేరియంట్లలోనూ 5 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ముందు భాగంలో 37mm USD ఫోర్క్ ఉంటుంది. వెనుక లింకేజ్ మోనోషాక్ అమర్చారు. డ్యూయల్ ఛానల్ ABS కూడా అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

బేస్‌ వేరియంట్‌ ధర రూ.2.30 లక్షలు. ఇది Metallic Black & Dark Bluish Gray రంగుల్లో లభిస్తుంది. ఈ వేరియంట్‌లో బ్లాక్‌ వీల్స్‌ ఉంటాయి. Matte Finish Seat కూడా అందించారు.

ఇది కూడా చదవండి: Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. 204cc ఇంజిన్‌, 26.5hp పవర్‌.. Yamaha R2 రేటెంతో తెలుసా?

R2 (Quickshifter)
రేస్‌ ట్రాక్‌పై బైక్‌ను ఎక్కువగా ఉపయోగించాలనుకునే వారికి రెండో వేరియంట్‌ R2 (Quickshifter) మరింత ఆసక్తికరంగా ఉంటుంది. దీని ధర రూ.2.39 లక్షలు. బేస్‌ వేరియంట్‌ కంటే రూ.9,500 ఎక్కువ.

ఈ వేరియంట్‌లో బై డైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్ ప్రధాన ఆకర్షణ. అంటే గేర్‌లను పైకి మార్చడంతో పాటు కిందికి మార్చేటప్పుడు కూడా క్విక్‌షిఫ్టర్ పనిచేస్తుంది. R15లో ఉన్న క్విక్‌షిఫ్టర్ కేవలం అప్‌ షిఫ్ట్‌లకు మాత్రమే పనిచేస్తుంది. R2లో మాత్రం అప్‌ & డౌన్‌ షిఫ్ట్‌లకు ఇది ఉపయోగపడుతుంది.

ఈ వేరియంట్‌లో బాడీ రంగులో ఉండే అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ప్రత్యేక గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. Matte White Pearl & Racing Blue రంగుల్లో ఇది లభిస్తుంది.

M
R2లో టాప్‌ వేరియంట్‌ M. దీని ధర రూ.2.53 లక్షలు. మధ్య వేరియంట్‌ కంటే రూ.14,000 ఎక్కువ. ఇందులో సస్పెన్షన్‌ను మరింతగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

R2 Mలో ముందు Fork & వెనుక లింకేజ్ మోనోషాక్‌కు సర్దుబాటు చేయగల ప్రీలోడ్ సదుపాయం ఉంది. రైడర్‌ బరువుకు అనుగుణంగా సస్పెన్షన్‌ సెటప్‌ను మార్చుకోవచ్చు.

అదనంగా ప్రీమియం 3D ఎంబోస్డ్ ఎంబ్లమ్‌, ఫాక్స్ స్వెడ్ ఫినిష్ సీటు, సిల్వర్ ఫినిష్ స్వింగ్‌ఆర్మ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మఫ్లర్ ఎండ్ క్యాప్‌కు షాట్ బ్లాస్టెడ్ ఫినిష్ ఇచ్చారు.

M వేరియంట్‌లో అడ్జస్టబుల్‌ బ్రేక్ & క్లచ్ లివర్లు కూడా ఉన్నాయి. కీలెస్‌ సిస్టమ్‌ కూడా అందించారు. ఇది Metallic Grey అనే ఒకే రంగులో లభిస్తుంది.

ఇది కూడా చదవండి: యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్‌!

మూడు వేరియంట్లలోనూ ఇంజిన్‌ & ప్రధాన ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ధర పెరిగే కొద్దీ అదనపు సౌకర్యాలు, రేసింగ్‌కు ఉపయోగపడే ఫీచర్లు పెరుగుతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు
Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు
Tata Aerisలో 5 వేరియంట్లు.. ఏ వేరియంట్‌లో స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి, ఏది కొనాలి?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Charmilla Nalluru: శ్రీలంకలో కొత్త యాంకర్ ఛర్మిల... షికారులో అందాల భామ
శ్రీలంకలో కొత్త యాంకర్ ఛర్మిల... షికారులో అందాల భామ
Embed widget