అన్వేషించండి

Longest Range Electric Car: ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు

చైనాకు చెందిన BYD కంపెనీ ఈ 2 విషయాల్లోనూ ఎంతో ప్రత్యేకమైన ఒక ఎలక్ట్రిక్ సెడాన్ కారును లాంచ్ చేసింది. Denza Z9S కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1,100 కిలోమీటర్లు వెళ్తుందని క్లెయిమ్ చేసింది.

World Longest Range Electric Car | ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వినియోగదారులకు సాధారణంగా రేంజ్, ఛార్జింగ్ టైమ్ గురించి టెన్షన్ పడతారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించేలా, ఒకవేళ బ్యాటరీ అయిపోతే మళ్లీ త్వరగా ఛార్జింగ్ చేయడానికి తక్కువ సమయం తీసుకునే EV ని ప్రజలు కోరుకుంటారు.

ఈ సమయంలో చైనాకు చెందిన BYD కంపెనీ ఈ 2 విషయాల్లోనూ ఎంతో ప్రత్యేకమైన ఒక ఎలక్ట్రిక్ సెడాన్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీకి చెందిన Denza Z9S కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. దీని బ్యాటరీని కేవలం కొన్ని నిమిషాల్లోనే భారీ స్థాయిలో ఛార్జింగ్ చేయవచ్చు.

ఈ కారు ధర ఎంత?

 చైనాలో విడుదలైన ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్ Denza Z9S. దీని ప్రారంభ ధర సుమారు 47,100 డాలర్లు, అంటే దాదాపు రూ. 40 లక్షలు అని వినిపిస్తోంది. ఈ ధరతో పాటు కారు ఇచ్చే లాంగ్ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ దీని ప్రత్యేకతగా నిలిచాయి. కారు అతిపెద్ద ప్రత్యేకత దీని ఛార్జింగ్ స్పీడ్. BYD ఇందులోతమ సొంత Blade Battery టెక్నాలజీ ఉపయోగించింది. Denza Z9S బ్యాటరీని కేవలం 5 నిమిషాల్లోనే 10% నుండి 70 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చునని కంపెనీ తెలిపింది.

Also Read: Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?

10% నుండి 97% వరకు ఛార్జ్ అవ్వడానికి కేవలం 9 నిమిషాల సమయం పడుతుంది. అంటే లాంగ్ రేంజ్ జర్నీల సమయంలో బ్యాటరీ తగ్గితే, కాసేపు ఛార్జ్ చేసినా సరే కారును చాలా దూరం నడపవచ్చు. Denza Z9S కారును 3 వేర్వేరు వేరియంట్లలో తీసుకొచ్చారు. వీటి రేంజ్ వేర్వేరుగా ఉంటుంది. బేస్ వేరియంట్ రేంజ్ దాదాపు 780 కిలోమీటర్లు కాగా, రెండవ వేరియంట్ రేంజ్ దాదాపు 920 కిలోమీటర్లు ఇస్తుంది. ఇక టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. 

రేంజ్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయం

ఇక్కడ 780, 920, 1,100 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ అనేది చైనాకు చెందిన CLTC టెస్టింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రోడ్లపై అధికంగా నడిపే సాధారణ డ్రైవింగ్‌తో పోలిస్తే CLTC టెస్ట్‌లో ఎక్కువ రేంజ్ నమోదవుతుంది. రియల్ లైఫ్‌లో కారు రేంజ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, Denza Z9S కారును ఒకవేళ అమెరికన్ EPA టెస్టింగ్ ప్రమాణాల ప్రకారం లెక్కిస్తే, దీని రేంజ్ దాదాపు 772 కిలోమీటర్లు అని అంచనా వేశారు. 

అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ల విషయానికొస్తే, అమెరికాకు చెందిన Lucid Air Grand Touring ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంటుంది. దీని EPA రేంజ్ దాదాపు 824 కిలోమీటర్లుగా పేర్కొంది. Denza Z9S దావా వేస్తున్న 1,100 కిలోమీటర్ల రేంజ్ దీనికంటే ఎక్కువే అయినప్పటికీ, ఈ రెండు కార్ల గణాంకాలు వేర్వేరు టెస్టింగ్ సిస్టమ్‌లపై ఆధారపడి ఉన్నాయి. అందుకే వీటి రేంజ్‌ను పోల్చలేము. 

Also Read: Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?

ఎలక్ట్రిక్ కార్లలో Denza Z9S ఎందుకు ప్రత్యేకం?

Denza Z9S ప్రత్యేకత కేవలం దాని లాంగ్ రేంజ్ మాత్రమే కాదు, దాని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు. ఒక EV బ్యాటరీ కేవలం కొన్ని నిమిషాల్లోనే 60- 70% లేదా అంతకంటే ఎక్కువ ఛార్జ్ అయితే, ఛార్జింగ్ స్టేషన్ల వద్ద వెయిటింగ్ టైం చాలా తగ్గుతుంది. ప్రస్తుతానికి Denza Z9S కారును చైనాలో విడుదల చేసినట్లు సమాచారం. భారత్‌లో దీని లాంచ్ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి భారత మార్కెట్లో దీని ధర లేదా లాంచ్ తేదీ గురించి చెప్పలేం. 

BYD Denza Z9S తన సుదీర్ఘ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా ఎలక్ట్రిక్ కార్లలో ప్రత్యేకమైన మోడల్‌గా నిలిచింది. దీని టాప్ వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 1,100 కిలోమీటర్లు,  9 నిమిషాల్లో బ్యాటరీ 10% నుంచి 97% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అయినా నిజమైన రేంజ్ అనేది డ్రైవింగ్ స్టైల్, వాతావరణం, రోడ్డు,  ట్రాఫిక్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు
రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget