అన్వేషించండి

టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

TVS Jupiter 110 Spectral Variant: టీవీఎస్ జూపిటర్ 110లో కొత్త స్పెక్ట్రల్ వేరియంట్ విడుదలైంది. డ్యూయల్ టోన్, ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్, సీక్వెన్షియల్ ఇండికేటర్లతో అందుబాటులోకి వచ్చింది.

TVS Jupiter 110 Price And Features Telugu: టీవీఎస్ జూపిటర్ 110లో కొత్త వేరియంట్‌ లాంచ్‌ అయింది. 'స్పెక్ట్రల్' (Spectral) పేరుతో కొత్త టాప్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో డ్యూయల్ టోన్ రంగులను ప్రత్యేక ఆకర్షణగా అందిస్తోంది. కొత్త రంగులతో పాటు కొన్ని అదనపు ఫీచర్లను కూడా జోడించింది. దీంతో జూపిటర్ 110 మరింత ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది. 

టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్ వేరియంట్ ధరను రూ.89,825గా కంపెనీ నిర్ణయించింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ప్రస్తుతం జూపిటర్ 110లో ఇదే అత్యంత ఖరీదైన వేరియంట్‌. కొత్త మోడల్‌ను త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

రెండు కొత్త రంగులు

స్పెక్ట్రల్ వేరియంట్‌ను రెండు డ్యూయల్ టోన్ రంగుల్లో తీసుకొచ్చారు. స్పెక్ట్రల్ బ్లూ & స్పెక్ట్రల్ కాపర్ రంగులతో లాంచ్‌ చేశారు. ఈ రంగులకు అనుగుణంగా స్కూటర్ లోపలి ప్యానెళ్లకు కూడా కొత్త రంగులు ఇచ్చారు. సీటుకు కొత్త రంగు అందించారు. పాక్షిక క్రోమ్ మిర్రర్లను కూడా ఈ వేరియంట్‌లో చూడొచ్చు. కొత్త రంగులు జూపిటర్ 110కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కాస్మెటిక్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

రెండు కొత్త ఫీచర్లు

స్పెక్ట్రల్ వేరియంట్‌లో రెండు అదనపు ఫీచర్లను కంపెనీ యాడ్‌ చేసింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్ ఒకటి. వెనుక కూర్చునే ప్రయాణికుడికి ఇది అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

మరో ముఖ్యమైన ఫీచర్ సీక్వెన్షియల్ ఇండికేటర్లు. ఈ విభాగంలో తొలిసారిగా ఇలాంటి ఇండికేటర్లను అందిస్తున్నట్లు టీవీఎస్ చెబుతోంది. దీంతో జూపిటర్ 110లో లైటింగ్ సెటప్ మరింత ప్రత్యేకంగా మారింది.

ఇది కూడా చదవండి: రూ.10000 డౌన్‌పేమెంట్ చేసి TVS Jupiter కొంటే ప్రతినెలా EMI ఎంత చెల్లించాలి

మెకానికల్‌గా మార్పులు లేవు

కొత్త స్పెక్ట్రల్ వేరియంట్‌లో ఇంజిన్‌కు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 113.3cc పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 8hp శక్తిని & 9.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిస్క్ SXC & స్పెషల్ వేరియంట్లలో ఉన్న మెకానికల్ సెటప్‌నే ఇందులోనూ కొనసాగించారు.

జూపిటర్ 110లో 33 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. సెగ్మెంట్‌లో ఇది అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న స్కూటర్లలో ఒకటి. ఇంధన ట్యాంక్‌ను ముందు భాగంలోని ఏప్రాన్‌లో అమర్చారు. దీంతో ఇంధనం నింపడం సులభంగా ఉంటుంది.

ఇంకా ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉంది. దీని ద్వారా ఇంజిన్ నిశ్శబ్దంగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్-స్టాప్ సాంకేతికత కూడా ఇందులో ఉంది. ట్రాఫిక్‌లో అవసరం లేని సమయంలో ఇంజిన్‌ను ఆపడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడంలో ఇది సహాయపడుతుంది. స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ కూడా కొనసాగుతోంది. రోజూ ప్రయాణించేవాళ్లకు అవసరమైన సౌకర్యాలు & కనెక్టివిటీ ఫీచర్లను ఇది అందిస్తుంది.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు

ధరలో ఎంత తేడా?

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ డిస్క్ వేరియంట్‌తో పోలిస్తే, స్పెక్ట్రల్ వేరియంట్ ధర రూ.3,000 ఎక్కువ. స్పెషల్ ఎడిషన్‌తో పోలిస్తే రూ.525 అదనంగా చెల్లించాలి. కొత్త రంగులు, అదనపు ఫీచర్లను కోరుకునేవాళ్లకు ఈ వేరియంట్ ఆకర్షణీయమైన ఎంపిక కాగలదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?
కొత్త లుక్‌తో తిరిగొచ్చిన హోండా ఫైర్‌బ్లేడ్.. బరువు తగ్గించి, టార్క్ పెంచిన కంపెనీ!
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Vehicle VIP Number: 9999, 0001 వంటి ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? Parivahan పోర్టల్‌లో అప్లై చేసుకునే విధానం ఇదిగో
మీ కారు లేదా బైక్‌కు VIP నంబర్ కావాలా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి!
Maruti Car Diwali Offers: మారుతి కార్లపై నవంబర్ ఆఫర్లు.. Wagon R, Alto K10 సహా చాలా మోడళ్లపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్లు!
మారుతి కార్లపై భారీగా పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.51 లక్షల వరకు ప్రయోజనాలు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget