అన్వేషించండి

రూ.10000 డౌన్‌పేమెంట్ చేసి TVS Jupiter కొంటే ప్రతినెలా EMI ఎంత చెల్లించాలి

TVS Jupiter 110 ధర వేరియంట్‌ను బట్టి, ఆయా నగరాలను బట్టి సైతం మారుతుంటుంది. టీవీఎస్ Jupiter Drum ధర పూర్తిగా చెల్లించకుండా డౌన్ పేమెంట్ చేసి స్కూటీ కొనుగోలు చేయవచ్చు.

మీరు ప్రతిరోజు ఆఫీస్ లేదా బిజినెస్, ఇతర పనుల మీద బయటకు వెళ్తున్నారా.. మంచి మైలేజ్ ఇచ్చే, కావాల్సిన ఫీచర్లు ఉన్న ఒక స్కూటర్‌ను కొనాలనుకుంటే TVS Jupiter 110 ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ఈ స్కూటర్ భారత ఆటో మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే టీవీఎస్ జుపిటర్ స్కూటీ తీసుకోవడానికి మీ వద్ద పూర్తి నగదు లేకపోయినా ఇబ్బంది లేదు, మీరు ఫైనాన్స్ ద్వారా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చుర. మీరు తీసుకున్న నిర్ణీత గడువు వరకు ప్రతినెలా EMI చెల్లించాలి. 

TVS Jupiter 110 ధర వేరియంట్‌ను బట్టి మారుతుంది. ప్రస్తుతం బేస్ Jupiter Drum ధర సుమారు రూ. 77,175 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్-షోరూమ్ ధరకు రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులు కలిపితే ఆన్ రోడ్ ధర అవుతుందని తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.87,439గా ఉంది. మీరు ఆన్ రోడ్ ధర చెల్లిస్తేనే వాహనం మీ సొంతం అవుతుంది. 

డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి

Jupiter 110 ని ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తే, కస్టమర్ తన వీలును బట్టి బట్టి డౌన్ పేమెంట్‌ను చెల్లించవచ్చు. డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే, లోన్ అంత తక్కువగా ఉంటుంది. దాంతో మీ నెలవారీ EMI కూడా తగ్గుతుంది. Jupiter బేస్ వేరియంట్ కోసం రూ.10000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే 36 నెలల లోన్ టర్మ్.. 9.5 శాతం వడ్డీ రేటు అయితే EMI నెలకు సుమారు రూ. 2,480 చెల్లించాలి. మొత్తం వడ్డీ 11,877 చెల్లిస్తారు. ఒకవేళ 4 ఏళ్లకు అయితే ప్రతినెలా రూ.1,946 చెల్లించాలి. మొత్తం వడ్డీ 15,969 చెల్లిస్తారు. 5 ఏళ్లకు ఫైనాన్స్ తీసుకుంటే ప్రతినెలా ఈఎంఐ వాయిదా రూ.1626 చెల్లించాలి. మొత్తం వడ్డీ 20 వేల రూపాయలు పైగా చెల్లిస్తారు. 

Also Read: Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?

TVS Jupiter 110 లో 113.3cc ఇంజిన్ ఇచ్చారు. ఇందులో కంపెనీ iGO Assist సాంకేతికత అందిస్తుంది. ఇది అవసరమైన సమయంలో మెరుగైన పికప్, మైలేజ్‌ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. iGO Assist ద్వారా మైలేజ్‌లో సుమారు 10 శాతం వరకు మెరుగుదల ఉంటుంది. 

ఫీచర్లలో స్పెషాలిటీ ఏముంది..

Jupiter 110 లో రోజువారీ వినియోగానికి పనికొచ్చే పలు ఫీచర్లు ఉన్నాయి. ఇందులో LED లైటింగ్, డిజిటల్ న్‌స్ట్రుమెంట్ కన్సోల్, SmartXonnect వంటి ఫీచర్లు ఇచ్చారు. SmartXonnect ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, నోటిఫికేషన్లు వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఫ్రంట్- మౌంటెడ్ ఫ్యూయల్ ఫిల్లర్ ఇచ్చారు. దీని వల్ల సీటు ఎత్తకుండానే పెట్రోల్ కొట్టించవచ్చు.  ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ లభిస్తుంది. జర్నీ సమయంలో మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. 

Jupiter 110 లో సుమారు 30 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. డబుల్ హెల్మెట్ ఉంచే సౌకర్యం లభిస్తుంది.  పొడవైన సీటు ఇచ్చారు. దీని వల్ల రైడర్, వెనుక కూర్చునే వ్యక్తికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

Also Read: రూ.79,999కే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 301 కి.మీ. రేంజ్‌తో Ola S1Z సంచలనం!

కొత్త డ్యూయల్-టోన్ వేరియంట్ 

TVS కంపెనీ Jupiter 110 ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కొత్త Dual Tone Spectral Range వేరియంట్‌ లాంచ్ చేసింది. ఇందులో కొత్త డ్యూయల్-టోన్ రంగులు, కొన్ని కొత్త లైటింగ్ ఫీచర్లు యాడ్ చేసింది. టీవీఎస్ కంపెనీ ఇందులో కంఫర్ట్,  స్టైల్‌కు సంబంధించిన అప్‌డేట్లు ఇచ్చింది. 

Jupiter 110 అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాలెన్స్. ఇందులో రోజువారీ వాడకంలో ఉపయోగపడే ఫీచర్లు ఇచ్చింది. మంచి స్టోరేజ్, USB ఛార్జింగ్, డిజిటల్ కన్సోల్, పొడవైన సీటు, ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, iGO Assist వంటి సౌకర్యాలు దీనిని ఫ్యామిలీ ఉపయోగం కోసం కొనేలా చేస్తున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మినిమమ్‌ డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్‌... TVS Orbiter ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ ఇంటి ముందుంటుంది!
యూత్‌ తెగ కొంటున్న టీవీఎస్‌ ఆర్బిటర్‌ స్కూటర్‌ను కేవలం రూ.2000 EMIతో మీరూ కొనొచ్చు
ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి రూ.లక్ష లోపు వచ్చే TVS టూవీలర్లు.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి!
రూ.1 లక్ష దాటని టీవీఎస్ బైక్‌ లేదా స్కూటర్‌ కొనాలా? మీ బడ్జెట్‌ తగిన బెస్ట్ ఆప్షన్స్ ఇవిగో!
రూ.3.60 లక్షల స్పాట్‌ క్యాష్‌తో Mahindra XUV 7XO మీదే! ఈజీ EMI ప్లాన్‌ ఎంచుకుంటే చాలు
కేవలం రూ.21,000 EMIతో Mahindra XUV 7XO మీ సొంతమవుతుంది! ఎన్నేళ్లు చెల్లించాలంటే?
ప్రయాణాల్లో మీ కుటుంబం భద్రతకు మహీంద్రా భరోసా! XUV 7XOకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
మహీంద్రా XUV 7XOలో ప్రయాణం చాలా సేఫ్‌! భారత్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Embed widget