అన్వేషించండి

కొత్త Bajaj Pulsar 125లో 4 వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

కొత్త Bajaj Pulsar 125 నాలుగు వేరియంట్లలో వచ్చింది. ధరలు, ఇంజిన్, బ్రేకులు, డిస్‌ప్లే, రైడింగ్ మోడ్‌లు & ప్రతి వేరియంట్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్లను తెలుసుకోండి.

Bajaj Pulsar 125 Price And Features Telugu: బజాజ్ తన ఎంట్రీ లెవల్ Pulsar 125ను పూర్తిగా అప్‌డేట్ చేసింది. కొత్త వెర్షన్‌లో నాలుగు వేరియంట్లను తీసుకొచ్చింది. గత మోడల్‌లో రెండు వేరియంట్లు మాత్రమే ఉండేవి. Bajaj Pulsar 150 తరహాలోనే Pulsar 125లో కూడా ధరకు తగ్గ ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. నాలుగు వేరియంట్ల మధ్య ధర తేడా రూ.11,500 మాత్రమే. అయితే ఒక్కో వేరియంట్‌లో కొన్ని కీలక మార్పులు ఉన్నాయి.

బజాజ్‌ పల్సర్‌ 125 - వేరియంట్లు

Pulsar 125 Single Seat LCD

ధర: రూ.92,900 (ఎక్స్‌షోరూమ్)

ఇది Pulsar 125లో బేస్ వేరియంట్. మొత్తం నాలుగు వేరియంట్లలోనూ కొత్త సింగిల్ క్రేడిల్ ఛాసిస్ ఉంటుంది. 124.58cc ఇంజిన్‌ను కూడా అన్ని వేరియంట్లలోనూ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,500rpm వద్ద 12.1hp పవర్ & 6,500rpm వద్ద 11.4Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గత తరం 124.38cc ఇంజిన్‌తో పోలిస్తే ఈ కొత్త బండి పవర్ 0.3hp, టార్క్ 0.6Nm పెరిగాయి.

అన్ని వేరియంట్లలో LED హెడ్‌లైట్ & LED టెయిల్‌లైట్ ఉంటాయి. టైర్లు, ముందు & వెనుక సస్పెన్షన్ కూడా ఒకే విధంగా ఉంటాయి. Bluetooth కనెక్టివిటీ & టర్న్ బై టర్న్ నావిగేషన్ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటాయి.

బేస్ వేరియంట్‌లో సింగిల్ సీట్ & LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ముందు 240mm డిస్క్ బ్రేక్, వెనుక 130mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. CBS కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇండికేటర్లు మాత్రం బల్బ్ తరహాలో ఉంటాయి. USB Type C పోర్ట్ కావాలంటే అదనంగా యాక్సెసరీగా తీసుకోవాలి.

Pulsar 125 Single Seat TFT

ధర: రూ.99,291 (ఎక్స్‌షోరూమ్)

రెండో వేరియంట్‌లో ప్రధాన మార్పు డిస్‌ప్లే. ఇందులో LCDకు బదులుగా 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇంకా మూడు రైడింగ్ మోడ్‌లు, ISG కూడా లభిస్తాయి. USB Type C పోర్ట్ ఇందులో స్టాండర్డ్‌గా వస్తుంది.

బ్రేకింగ్ వ్యవస్థను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ముందు 260mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇండికేటర్లు LEDగా మారాయి. హజార్డ్ లైట్స్ ఫంక్షన్ కూడా ఉంది.

ఈ వేరియంట్ ధర బేస్ మోడల్ కంటే రూ.6,391 ఎక్కువ.

ఇది కూడా చదవండి: అథర్ కొణార్క్ లాంచ్‌ అయింది.. 161km రేంజ్‌, 3 బ్యాటరీ ఆప్షన్లతో పాటు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు

Pulsar 125 Split Seat TFT

ధర: రూ.1 లక్షకు పైగా (ఎక్స్‌షోరూమ్)

మూడో వేరియంట్‌లో సింగిల్ సీట్‌కు బదులుగా స్ప్లిట్ సీట్ ఉంటుంది. రైడర్ & వెనుక కూర్చునే ప్రయాణికుడి కోసం ప్రత్యేక సీట్ ప్యాడ్లు ఉంటాయి. మిగిలిన ఫీచర్ల విషయంలో ఇది రెండో వేరియంట్‌తో దాదాపు సమానంగా ఉంటుంది. అంటే 5 అంగుళాల TFT డిస్‌ప్లే, మూడు రైడింగ్ మోడ్‌లు, ISG, USB Type C పోర్ట్, 260mm ఫ్రంట్ డిస్క్, LED ఇండికేటర్లు వంటి ఫీచర్లు ఉంటాయి.

Pulsar 125 Split Seat TFT+

ధర: రూ.1.04 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

ఇది Pulsar 125లో టాప్ వేరియంట్. పేరు చివర ఉన్న '+' గుర్తును చూసి చిన్న మార్పులే ఉంటాయని అనుకోవద్దు. ఇందులో మూడు ప్రత్యేక అప్‌గ్రేడ్స్‌ ఉన్నాయి. 

TFT డిస్‌ప్లేకు WiFi సపోర్ట్ లభిస్తుంది. దీని ద్వారా Google Mapsను డిస్‌ప్లేలో మిర్రర్ చేసుకుని నావిగేషన్ ఉపయోగించవచ్చు. ఇంజిన్ కింది భాగానికి అదనపు రక్షణ కోసం బెల్లీ ప్యాన్‌ను స్టాండర్డ్‌గా అందించారు. మిగతా వేరియంట్లలో సింగిల్ హార్న్ ఉంటే, ఈ టాప్ వేరియంట్‌లో డ్యూయల్ హార్న్ ఉంటుంది. ఈ మూడు అదనపు ఫీచర్ల కోసం మూడో వేరియంట్ కంటే సుమారు రూ.4,000 ఎక్కువ చెల్లించాలి.

ఇది కూడా చదవండి: టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

ఏ వేరియంట్ ఎంచుకోవాలి?

Pulsar 125లో నాలుగు వేరియంట్లు ఉన్నప్పటికీ ప్రాథమిక ఇంజిన్ & విడిభాగాలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రధాన తేడాలు డిస్‌ప్లే, సీటు, బ్రేకులు, రైడింగ్ మోడ్‌లు & అదనపు ఫీచర్లలో కనిపిస్తాయి.

తక్కువ ధరలో Pulsar 125 కావాలనుకునేవారికి Single Seat LCD వేరియంట్ సరిపోవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలంటే Single Seat TFT ఆసక్తికరమైన ఎంపిక.

స్ప్లిట్ సీట్ కోరుకునేవాళ్లు Split Seat TFT వైపు చూడవచ్చు. Google Maps మిర్రరింగ్, బెల్లీ ప్యాన్ & డ్యూయల్ హార్న్ వంటి అదనపు ఫీచర్లు కావాలనుకునేవారికి Split Seat TFT+ టాప్ ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!
కారు పాలిష్ చేయాలా.. వ్యాక్స్ వేయాలా? తేడా ఇదే.. ముందుగా ఏది చేయాలో తెలుసుకోండి
Advertisement

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget