అన్వేషించండి

రూ.2 లక్షలు చెల్లిస్తే Maruti Brezza Top Model కోసం ప్రతినెలా EMI ఎంత కట్టాలి

మారుతి బ్రెజ్జా టాప్ మోడల్ కొనుగోలు చేయడానికి రూ.2 లక్షలు డౌన్ పేమెంట్ చేసి కొనవచ్చు. అయితే నెలవారీ చెల్లించాల్సిన EMI వివరాలు తెలుసుకున్నాకే కొనడం మంచిది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి బ్రెజ్జా పెట్రోల్, CNG, మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తుంది.
  • రెండు లక్షల డౌన్ పేమెంట్‌తో, మిగిలిన మొత్తానికి EMI చెల్లించవచ్చు.
  • టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

మీరు ఫ్యామిలీ కోసం మంచి డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ ఇంజిన్, బెస్ట్ ఫీచర్లతో వచ్చే కాంపాక్ట్ SUV ని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మారుతి బ్రెజ్జా (Maruti Brezza) మీకు మంచి ఆప్షన్ కావచ్చు. భారత మార్కెట్లో చాలా ఆదరణ పొందిన SUV మారుతి బ్రెజ్జా. ఇది పెట్రోల్‌తో పాటు CNG, మ్యాన్యువల్- ఆటోమేటిక్ 2 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 

మీరు కారును పూర్తి పేమెంట్ చేయకుండా కొంత డౌన్2పేమెంట్ చేసి, EMI ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే ఫైనాన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీతో సుమారు రూ. 2 లక్షలు ఉంటే, మిగిలిన మొత్తాన్ని EMI ద్వారా మీ టర్మ్ వరకు చెల్లించవచ్చు. 

కారు ధర, డౌన్ పేమెంట్

మారుతి బ్రెజ్జా ధర వేరియంట్‌ను బట్టి ఆయా రాష్ట్రాలు, నగరాల్లోనే వేర్వేరుగా ఉంటుంది. బేస్ వేరియంట్ నుంచి ఎక్కువ ఫీచర్లు ఉండే టాప్ వేరియంట్ వరకు దీని ధరలో వ్యత్యాసం ఉంటుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఎక్స్-షోరూమ్ ధర కాదు, ఆన్ రోడ్ ధర చెక్ చేయాలి. ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన ఛార్జీలు కూడా జతచేస్తే కారు ఆన్-రోడ్ ధర అవుతుంది. 

మీరు బ్రెజ్జా కొనుగోలు చేయడానికి రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ద్వారా కార్ లోన్  తీసుకోవచ్చు. డౌన్ పేమెంట్ తర్వాత మిగిలిన మొత్తాన్ని లోన్‌లో చేర్చి EMI అంచనా వేస్తారు. లోన్ మొత్తం, EMI అనేవి బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ కాలపరిమితి, క్రెడిట్ ప్రొఫైల్, ఇతర కండీషన్లను బట్టి మారవచ్చు.

ఒకవేళ బ్యాంక్ నుంచి సుమారు 9 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ తీసుకుంటే, EMI అనేది లోన్ మొత్తం, కాలపరిమితిని బట్టి నిర్ణయిస్తారు. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే ప్రతి నెలా చెల్లించే EMI తగ్గుతుంది, కానీ వడ్డీ పెరుగుతుంది. తక్కువ కాలపరిమితితో లోన్ తీసుకుంటే నెలానెలా చెల్లించే EMI పెరిగినా, చెల్లించే వడ్డీ తగ్గుతుంది.

Also Read: ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు

ప్రతి నెలా EMI ఎంత చెల్లించాలి

బ్రెజ్జాలోని వేరియంట్ కోసం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే సుమారు రూ. 12.62 లక్షల లోన్‌పై 9 శాతం వడ్డీతో 7 సంవత్సరాలకు నెలకు దాదాపు EMI రూ. 20,318 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కింపు ప్రకారం 7 ఏళ్లలో సుమారు రూ. 4.43 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు. కారుకు అయ్యే ఖర్చును లెక్కించేటప్పుడు డౌన్ పేమెంట్, EMI ని మాత్రమే కాదు లోన్‌పై పడే వడ్డీ కూడా చెక్ చేసుకోవాలి. 

మారుతి బ్రెజ్జాలో వినియోగదారులకు పలు మోడ్రన్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్-అప్ డిస్ప్లే, సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ కోసం కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, హిల్-హోల్డ్ కంట్రోల్, ESP, ISOFIX, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు ఉన్నాయి.  టాప్ వేరియంట్లలో అయితే 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

Also Read: టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

కారు పవర్‌ట్రెయిన్, ఇతర వివరాలు

మారుతి బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీనిని మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకోవచ్చు. CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ అవసరం, బడ్జెట్‌ను బట్టి పెట్రోల్, CNG, మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే ముందు వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను కంపేర్ చేసుకున్న తరువాతే తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థను ఎంచుకోవాలి. 

Frequently Asked Questions

మారుతి బ్రెజ్జా ఎలాంటి కారు?

ఇది కుటుంబాల కోసం మంచి డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ఉత్తమ ఫీచర్లతో వచ్చే కాంపాక్ట్ SUV. పెట్రోల్, CNG, మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

మారుతి బ్రెజ్జాను కొనుగోలు చేయడానికి డౌన్ పేమెంట్ ఎంత అవసరం?

మీరు సుమారు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ద్వారా కార్ లోన్ తీసుకోవచ్చు. EMI అనేది బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ కాలపరిమితిని బట్టి మారుతుంది.

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే బ్రెజ్జాకు నెలవారీ EMI ఎంత ఉండవచ్చు?

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి, రూ. 12.62 లక్షల లోన్‌పై 9% వడ్డీతో 7 సంవత్సరాలకు నెలకు దాదాపు రూ. 20,318 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్‌పై 7 ఏళ్లలో సుమారు రూ. 4.43 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు.

మారుతి బ్రెజ్జాలో ఏయే ఫీచర్లు లభిస్తాయి?

ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD వంటివి కూడా లభిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Embed widget