అన్వేషించండి

7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్

ఫోక్స్‌వ్యాగన్ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ టైరాన్ (Volkswagen Tayron) పై డిస్కౌంట్ ప్రకటించారు. ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ కలిపి 1.50 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫోక్స్‌వ్యాగన్ టైరాన్‌పై రూ.1.50 లక్షల వరకు తగ్గింపు ఆఫర్.
  • ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌ల ద్వారా వినియోగదారులు పొదుపు చేయవచ్చు.
  • 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 4మోషన్ AWD సిస్టమ్.
  • 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 15 అంగుళాల టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో పండుగల సీజన్లో ఆటోమొబైల్ మార్కెట్‌లో పలు రకాల డిస్కౌంట్లు కనిపిస్తుంటాయి. మీరు ఏదైనా 7 సీటర్ SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. మీరు ఈ సెప్టెంబర్‌లో ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే దాదాపు రూ.1.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎర్టిగా, కియా కారెన్స్ లేదా టాటా సఫారీ వంటి కార్ల కంటే మెరుగైన ఒక లగ్జరీ, పవర్‌ఫుల్ జర్మనీ ఎస్‌యూవీని కొనడానికి తక్కువ బడ్జెట్ అవుతుంది. కంపెనీ ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ 7 సీటర్ కారు విక్రయాలను పెంచడానికి డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఫోక్స్‌వ్యాగన్ టైరాన్‌పై మీకు డబ్బు ఆదా చేసే అవకాశాలపై ఇక్కడ తెలుసుకుందాం.

పొదుపు చేసే అవకాశం

ఫోక్స్‌వ్యాగన్ టైరాన్‌పై లభించే ఈ 1.50 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీపై ఎలాంటి నేరుగా క్యాష్ డిస్కౌంట్‌ ఇవ్వడం లేదు. అందుకు బదులుగా కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, లాయల్టీ బోనస్ రూపంలో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేసి కొత్త ఫోక్స్ వ్యాగన్ టైరాన్‌ కొంటే కంపెనీ మీకు రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్‌ ఇస్తోంది. మీ పాత కారును స్క్రాప్ చేయాలని సెలక్ట్ చేసుకుటే, ఎక్స్ఛేంజ్ బోనస్ బదులుగా 20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది. 

Also Read: 2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?

ప్రస్తుత కస్టమర్లకు 50 వేల బోనస్

మీతో ఫోక్స్‌వ్యాగన్ కారు ఉండి, మీరు ఆ బ్రాండ్ కస్టమర్ అయితే మీకు 50,000 అదనపు లాయల్టీ బోనస్‌ ఇస్తోంది. రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 లాయల్టీ బెనిఫిట్ కలిపి మొత్తంగా రూ.1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. 

ఈ ఆఫర్ ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ లైఫ్, స్పోర్టీ ఆర్-లైన్ 2 ప్రధాన వేరియంట్లకు వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత 7 సీటర్ ఎస్‌యూవీ ధర భారీగా దిగొస్తుంది. 

2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్

ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ కేవలం లుక్స్, డిస్కౌంట్లలోనే కాకుండా పెర్ఫార్మెన్స్ విషయంలోనూ పవర్‌ఫుల్ కారు. ఇందులో కంపెనీకి చెందిన 2.0 లీటర్ TSI 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 201 BHP పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 7 స్పీడ్ DSG డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిపారు. గుంతలు, గతుకుల రోడ్లు, ఆఫ్-రోడింగ్‌లో కారుకు మెరుగైన గ్రిప్ కోసం ఇందులో 4మోషన్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఇచ్చారు. 

9 ఎయిర్‌బ్యాగ్‌లు, 15 ఇంచుల టచ్‌స్క్రీన్

కారు లోపల లగ్జరీ కేబిన్ మిమ్మల్ని చాలా ఆకట్టుకుంటుంది. ఇందులో 15 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 30 కలర్ యాంబియంట్ మూడ్ లైటింగ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ విత్ మసాజ్ సీట్ల వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి.

Also Read: రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!

సేఫ్టీ విషయంలో ఈ జర్మన్ కారు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా 9 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవెల్ 2 ADAS వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లను ఇచ్చింది. అయితే, డిస్కౌంట్ మొత్తం సిటీ, డీలర్‌షిప్ పై ఆధారపడి ఉంటాయని గమనించాలి. పూర్తి సమాచారం కోసం, అవగాహన కోసం మీ సమీపంలోని షోరూమ్‌కు వెళ్లి వివరాలు కనుక్కోవడం మంచిది. 

 

Frequently Asked Questions

ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) ఎస్‌యూవీపై సెప్టెంబర్‌లో ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?

ఈ సెప్టెంబర్‌లో ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ ఎస్‌యూవీ కొనుగోలుపై రూ.1.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు లాయల్టీ బోనస్ రూపంలో అందిస్తారు.

టైరాన్ (Tayron) ఎస్‌యూవీపై రూ.1.50 లక్షల డిస్కౌంట్ ఎలా లభిస్తుంది?

పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.1 లక్ష, ఫోక్స్‌వ్యాగన్ పాత కస్టమర్లకు రూ.50,000 అదనపు లాయల్టీ బోనస్ ద్వారా మొత్తం రూ.1.50 లక్షలు ఆదా చేసుకోవచ్చు. పాత కారును స్క్రాప్ చేస్తే రూ.20,000 ప్రయోజనం లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) ఎస్‌యూవీలో ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్, 4మోషన్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. 15 అంగుళాల టచ్‌స్క్రీన్, 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget