అన్వేషించండి

రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.10 లక్షల ప్రారంభ ధరతో లాంచ్‌ అయింది. సింగిల్ ఛార్జ్‌తో 243 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ స్కూటర్‌లో 70 లీటర్ల స్టోరేజ్ ఉంది.

Simple Wave Price, Range And Features Telugu: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనబోతున్నవాళ్లకు గుడ్ న్యూస్. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ', కొత్త ఫ్యామిలీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'సింపుల్ వేవ్' ‍‌(Simple Wave) పేరుతో ఈ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.10 లక్షలు. కంపెనీ చెప్పిన ప్రకారం, ఈ EVని ఫుల్‌గా ఛార్జ్‌ చేస్తే ఏకంగా 243 కిలోమీటర్లు తిరుగుతుంది.

సింపుల్ వేమ్‌ ధర, రేంజ్‌ను చూస్తే... ఏథర్ కోణార్క్, బజాజ్ చేతక్, హీరో విడా & టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది పోటీ ఇవ్వనుంది.

ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా సింపుల్ వేవ్‌ను రూపొందించారు. ఈ స్కూటర్‌లో భారీ స్టోరేజ్ స్పేస్ ప్రధాన ఆకర్షణ అవుతుంది. మొత్తం 70 లీటర్ల స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో.. సీటు కింద ఏకంగా 63 లీటర్ల స్థలం ఉంది. ముందు భాగంలో 3 లీటర్ల క్యూబీ స్పేస్ ఉంటుంది. రైడర్ సీటు ఎడమ వైపున మరో 4 లీటర్ల క్విక్‌-యాక్సెస్‌ స్టోరేజ్ పాకెట్ ఉంది.

వేరియంట్లు

సింపుల్ వేవ్‌లో నాలుగు ప్రధాన వేరియంట్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి వీటిని అందిస్తున్నారు. బేస్ వేరియంట్ Wave S లో 2.2 కిలోవాట్ అవర్ & 2.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. కంపెనీ వెల్లడించిన ప్రకారం వీటి రేంజ్ వరుసగా 110 కిలోమీటర్లు & 132 కిలోమీటర్లు.

వేవ్ (Wave) వేరియంట్‌లో 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీని ఇచ్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌తో 171 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. టాప్ వేరియంట్ వేవ్ ప్లస్‌ (Wave + 5)లో భారీ 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 243 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో ఇదే అత్యధిక రేంజ్ అని సింపుల్ ఎనర్జీ చెబుతోంది.

పవర్‌ట్రెయిన్ విషయంలో కూడా కంపెనీ కొన్ని మార్పులు చేసింది. 6.4 కిలోవాట్ మోటార్‌తో పాటు బ్యాటరీ నిర్వహణ వ్యవస్థను థర్డ్‌ జనరేషన్‌ స్థాయికి అప్‌డేట్ చేసింది. మోటార్ సైజును కూడా 15 శాతం తగ్గించింది.

ఇది కూడా చదవండి: రూ.లక్ష లోపే వచ్చే పవర్‌ఫుల్‌ 125cc బైక్స్ - యూత్‌ మెచ్చిన టాప్-5 లిస్ట్‌ మీ కోసం!

ఛార్జింగ్‌ సమయం

2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసేందుకు 2 గంటల 15 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. మిగిలిన వేరియంట్ల ఛార్జింగ్ సమయాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అన్ని వేరియంట్లతోనూ 750 వాట్ల ఛార్జర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

డిజైన్ పరంగా కూడా వేవ్‌కు కొత్త రూపం ఇచ్చారు. సింపుల్ వన్ మాదిరిగా స్పోర్టీగా కాకుండా మరింత సున్నితమైన ఆకృతిని తీసుకొచ్చారు. సీటు పొడవు 920 మిల్లీమీటర్లు ఉంటుంది. దేశంలోనే అత్యంత పొడవైన సీట్లలో ఇదొకటిగా కంపెనీ తెలిపింది.

Wave S వేరియంట్లలో మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఎకోఎక్స్, ఎకో & రైడ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటి గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు. వేవ్ & వేవ్ ప్లస్ వేరియంట్లలో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది. వీటి గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు.

అన్ని వేరియంట్లలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. ఖర్చును తగ్గించేందుకు వెనుక డిస్క్ బ్రేక్ స్థానంలో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. గ్రిప్‌సెన్స్ అనే ఫీచర్‌ను మాత్రం హైయ్యర్‌ వేరియంట్లకు పరిమితం చేశారు.

సీటు ఎత్తు 775 మిల్లీమీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిల్లీమీటర్లు. బేస్ Wave S బరువు 124.5 కిలోలు. Wave బరువు 121 కిలోలు. టాప్ Wave + బరువు 128 కిలోలు.

ఇది కూడా చదవండి: ధర నుంచి పవర్‌, రేంజ్ వరకు.. ఏథర్ కోణార్క్‌ ఎస్ 125కి పోటీగా నిలిచే స్కూటర్లు ఏవి?

ధరలు

వేరియంట్‌
ధర (ఎక్స్‌షోరూమ్‌)
Wave S 2.2
 
రూ. 1.10 లక్షలు
Wave S 2.7 EBN
 
రూ. 1.40 లక్షలు
Wave S 2.7 TFT
 
రూ. 1.50 లక్షలు
Wave 3.7 EBN
 
రూ. 1.60 లక్షలు
Wave 3.7 TFT
 
రూ. 1.75 లక్షలు
Wave + 5
 
రూ. 1.90 లక్షలు

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్ 25, 2026 నుంచి ప్రారంభం అవుతాయి. అయితే, అన్ని వేరియంట్ల డెలివరీలు ఒకే తేదీ నుంచే మొదలవుతాయా అనే విషయాన్ని కంపెనీ స్పష్టం చేయలేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Embed widget